కొత్త Yamaha MT-10 SP బైక్ ఆవిష్కరణ; ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?

ఇటలీలోని మిలాన్ లో జరుగుతున్న 78వ ఎడిషన్ ఇంటర్నేషనల్ మోటార్‌సైకిల్ అండ్ యాక్ససరీస్ ఎగ్జిబిషన్ (EICMA 2021) లో జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha) తమ సరికొత్త యమహా ఎమ్‌టి-10 ఎస్‌పి (Yamaha MT-10 SP) మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త బైక్ సెమీ-యాక్టివ్ సస్పెన్షన్ మరియు కొన్ని ఇతర అప్‌గ్రేడ్‌లతో పరిచయం చేయబడింది. యమహా ఎమ్‌టి-10 మోడల్ ను పరిచయం చేసిన కొద్ది రోజులకే, కంపెనీ యమహా ఎమ్‌టి-10 ఎస్‌పి మోడల్ ను వెల్లడించింది.

కొత్త Yamaha MT-10 SP బైక్ ఆవిష్కరణ; ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?

ఓహ్లిన్స్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ సెమీ-యాక్టివ్ సిస్టమ్‌తో అమర్చబడిన మొదటి ప్రొడక్షన్ వెర్షన్ బైక్‌గా 'యమహా ఎమ్‌టి-10 ఎస్‌పి' ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సెమీ-యాక్టివ్ సస్పెన్షన్ నెక్స్ట్ జనరేషన్ "స్పూల్ వాల్వ్ డంపింగ్ టెక్నాలజీ"ని ఉపయోగిస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్‌కు మూడు సెమీ-యాక్టివ్ మోడ్‌లు ఇవ్వబడ్డాయి, వీటిలో A1, A2 మరియు A3 మోడ్ లు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా స్పోర్ట్, స్పోర్ట్ టూరింగ్ మరియు టూరింగ్ రైడ్స్ మోడ్ లో ఉపయోగించబడుతాయి.

కొత్త Yamaha MT-10 SP బైక్ ఆవిష్కరణ; ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?

కొత్త యమహా ఎమ్‌టి-10 ఎస్‌పి బైక్ లో ప్రధానమైన ఆకర్షణ దాని సస్పెన్షన్ సెటప్, ఈ సస్పెన్షన్ ను మూడు విధాలుగా మాన్యువల్‌గా సర్దుబాటు చేయవచ్చు. యమహా పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త ఓహ్లిన్స్ సెమీ-యాక్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది ప్రొడక్షన్ మోటార్‌సైకిల్‌కు ఇప్పటివరకు అమర్చబడిన అత్యున్నత సాంకేతికత మరియు ప్రస్తుత యమహా R1M సూపర్‌బైక్ కంటే మరింత అధునాతనమైనది. ఇప్పుడు ఇది మొదటిసారిగా ఎమ్‌టి-10 ఎస్‌పి బైక్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.

కొత్త Yamaha MT-10 SP బైక్ ఆవిష్కరణ; ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?

ఈ బైక్ లోని ఆయిల్ కూలర్ ను రక్షించడంలో సహాయపడటానికి కొత్త త్రీ-పీస్ బెల్లీ పాన్‌ ను కూడా అమర్చారు, దానితో పాటుగా ఇందులో కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు రేస్-బ్రెడ్, సూపర్-నేక్డ్ లుక్‌తో కంపెనీ ఇందులో తాజా ఆకర్షణను అందించింది. యమహా ఎమ్‌టి-10 బైక్ ఇప్పటికే కొత్త రేడియల్ బ్రేక్ మాస్టర్ సిలిండర్‌ను పొందగా, కొత్త ఎమ్‌టి-10 ఎస్‌పి బైక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను మరింత అడ్వాన్స్డ్ గా తీర్చిదిద్దారు. కొత్త Yamaha MT-10 SP బైక్ లో శక్తివంతమైన 998 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు.

కొత్త Yamaha MT-10 SP బైక్ ఆవిష్కరణ; ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?

ఈ ఇంజన్ స్టాండర్డ్ (ఎమ్‌టి-10) మోడల్ కంటే ఎక్కువ శక్తిని అందించేలా ట్యూన్ చేయబడింది. ఇది గరిష్టంగా 164 బిహెచ్‌పి పవర్ ను మరియు 112 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంజన్‌లో లైట్ వెయిట్ అల్యూమినియం పిస్టన్‌ని ఉపయోగించడం వల్ల ఇంజన్ సామర్థ్యం కూడా పెరిగింది. మరికొద్ది రోజుల్లో ఈ బైక్ అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల కానుంది. ముందుగా ఇది యూరప్ మార్కెట్లలో కస్టమర్లకు చేరువ కానుంది. భారత మార్కెట్లో విడుదల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.

కొత్త Yamaha MT-10 SP బైక్ ఆవిష్కరణ; ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?

ఇదిలా ఉంటే, యమహా ఇండియా ఇటీవలే భారత మార్కెట్‌లో తమ సరికొత్త అప్‌గ్రేడెడ్ యమహా ఆర్15 వి4 (Yamaha R15 V4) ని విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ బైక్‌ ను రూ. 1,67,800 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే కంపెనీ కొద్ది రోజుల్లోనే దాని ధరను రూ. 3,000 మేర పెంచింది. ధర పెరిగిన తర్వాత, కొత్త ఆ15 వి4 ధర రూ. 1,70,800 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ధర పరంగా, 150 సిసి విభాగంలో కొత్త Yamaha R15 V4 చాలా ఖరీదైన బైక్, అయితే ఈ బైక్‌తో వచ్చే ప్రీమియం రైడ్ అనుభవం ఈ సెగ్మెంట్‌లోని మరే ఇతర మోటార్‌సైకిల్ అందించదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కొత్త Yamaha MT-10 SP బైక్ ఆవిష్కరణ; ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?

కొత్త యమహా ఆర్15 వి4 భారత మార్కెట్లో ఐదు విభిన్న రంగులలో విడుదల చేయబడింది. అలాగే, ఇందులో బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) మరియు క్విక్ షిఫ్టర్ వంటి కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లను కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ బైక్ లో గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ట్రాక్ మరియు స్ట్రీట్ మోడ్‌తో కూడిన కొత్త YZF-R1-ప్రేరేపిత ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది.

కొత్త Yamaha MT-10 SP బైక్ ఆవిష్కరణ; ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త Yamaha R15 V4 బైక్ లో 155 సిసి లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 19 బిహెచ్‌పి పవర్ ను మరియు 15 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మునుపటిలాగనే, ఈ ఇంజన్ కూడా స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్‌ తో వస్తుంది మరియు ఇది సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది.

కొత్త Yamaha MT-10 SP బైక్ ఆవిష్కరణ; ఇందులో ప్రత్యేకత ఏంటంటే..?

కొత్త యమహా ఆర్15ఎమ్ మరియు రేసింగ్ బ్లూ వేరియంట్‌లు మెరుగైన పనితీరు కోసం క్విక్‌షిఫ్టర్‌ ను కూడా పొందుతాయి. ఈ 2021 మోడల్ యమహా ఆర్15 బైక్ గతంలో కన్నా మరింత అగ్రెసివ్ గా కనిపించే ఫెయిరింగ్స్, మజిక్యులక్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు పొడవైన విండ్‌స్క్రీన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది స్పోర్టియర్ స్టైలింగ్ డిజైన్ ఉన్నప్పటికీ, ఇందులో సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్‌ను రూపొందించామని, ఇది రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha unveiles mt 10 sp at eicma 2021 features engine launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X