యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

ఇప్పటి తరం వారికి యెజ్ది మోటార్ బైక్స్ పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ 1990 కాలానికి చెందిన వారికి మాత్రం వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దశాబ్ధాల కాలం పాటు భారత టూవీలర్ మార్కెట్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన యెజ్ది మోటార్‌సైకిళ్లు తిరిగి భారత మార్కెట్లోకి రాబోతున్నాయి.

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

భారత ఆటోమొబైల్ బ్రాండ్ మహీంద్రా సహకారంతో క్లాసిక్ లెజెండ్స్ ఈ యెజ్ది బ్రాండ్‌ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే భారతదేశంలో యెజ్ది రోడ్‌కింగ్ పేరును కూడా ట్రేడ్ మార్క్ చేసింది. జావా మోటార్‌సైకిళ్ల మాదిరిగానే యెజ్ది మోటార్‌సైకిళ్లు కూడా ఒకప్పుడు బాగా పాపులర్ అయిన క్లాసిక్ టూవీలర్ బ్రాండ్.

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

తాజా నివేదికల ప్రకారం, మహీంద్రా ఈ ఏడాది దీపావళి కంటే ముందుగానే సరికొత్త యెజ్ది రోడ్‌కింగ్ బిఎస్6 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయాలని చూస్తోంది. క్లాసిక్ లెజెండ్ యొక్క లైనప్‌కు జోడించబడే రెండవ బ్రాండ్ యెజ్ది. క్లాసిక్ లెజెండ్ ఇప్పటికే మహీంద్రా టూవీలర్ నెట్‌వర్క్ ద్వారా జావా మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది.

MOST READ:హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

మహీంద్రా సహకారంతోనే క్లాసిక్ లెజెండ్స్ తమ జావా బ్రాండ్‌ను భారత మార్కెట్లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, ఈ కంపెనీ జావా బ్రాండ్ క్రింద క్లాసిక్, ఫోర్టీ టూ మరియు పెరాక్ మోడళ్లను విక్రయిస్తోంది. జావా క్లాసిక్ మరియు ఫోర్టీ టూ రెండు మోటార్‌సైకిళ్లు కూడా ఒకే ఇంజన్‌ను పంచుకుంటాయి. కాగా, జావా పెరాక్ బాబర్ స్టైల్ బైక్ మాత్రం మరింత శక్తివంతమైన ఇంజన్‌ను పొందుతుంది.

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

కాగా, యెజ్ది రోడ్‌కింగ్ మోడల్‌లో కూడా జావా క్లాసిక్ మరియు ఫోర్టీ టూ మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన అదే ఇంజన్‌ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. ఇందులోని 293సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 26.2 బిహెచ్‌పి శక్తిని మరియు 27.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటికే తమ యెజ్ది రోడ్‌కింగ్ మోటార్‌సైకిల్‌ను భారతదేశపు రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ టెస్టింగ్ వాహనాన్ని పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసి ఉండటం వలన, దానికి సంబంధించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. జావా మోటార్‌సైకిళ్ల మాదిరిగానే, యెజ్ది మోటార్‌సైకిళ్లు కూడా మోడ్రన్ టచ్‌తో కూడిన క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

యెజ్ది రోడ్‌కింగ్ ఉత్పాదక వ్యయాన్ని తక్కువగా ఉంచేందుకు కంపెనీ దీని సస్పెన్షన్, బ్రేక్‌లు మరియు చక్రాలు వంటి అనేక విడిభాగాలను జావా 300 ట్విన్ బైక్‌లను సేకరించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ మోటార్‌సైకిల్ యొక్క ఫ్రేమ్ మాత్రం ఇతర జావా మోటార్‌సైకిళ్ల ఫ్రేమ్ కన్నా భిన్నంగా ఉంటుంది.

MOST READ:ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

బిఎస్ఏ బ్రాండ్ పునరుద్ధరణ

క్లాసిక్ లెజెండ్స్ భారత మార్కెట్లో యెజ్ది బ్రాండ్‌ను రీలాంచ్ చేయటంతో పాటుగా, మోటార్‌సైకిళ్ల తయారీలో పేరుగాంచిన బిఎస్ఏ బ్రాండ్‌ను కూడా పునరుద్ధరించాలని చూస్తోంది. బిఎస్ఏ మోటార్‌సైకిల్ బ్రాండ్ క్రింద కంపెనీ ఓ సరికొత్త 650సిసి ఇంజన్‌తో కూడిన బైక్‌ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం.

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

ప్రస్తుతానికి ఈ కొత్త ఇంజన్‌కు సంబంధించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, ఇదొక ట్విన్-సిలిండర్ అమరికను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. యూకేలోని తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఈ ఇంజన్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి బిఎస్ఏ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది.

MOST READ:దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటికే పితాంపూర్ ప్లాంట్‌లో ప్రీమియం బిఎస్‌ఏ మోటార్‌సైకిళ్ల తయారీ కోసం ఓ ప్రత్యేక అసెంబ్లీ లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణ పెరుగుతున్నందున, క్లాసిక్ లెజెండ్స్ కూడా బిఎస్ఏ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ మోటారుసైకిల్‌పై పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.

యెజ్ది మోటార్ బైక్స్ గుర్తున్నాయా..? ఇవి తిరిగి మార్కెట్లోకి రాబోతున్నాయ్!

బిఎస్‌ఏ మోటార్‌సైకిళ్ల కోసం సరైన ఆవిష్కరణ లేదా లాంచ్ డేట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. యెజ్ది బ్రాండ్ మాత్రం అతి త్వరలోనే భారత మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. క్లాసిక్ లెజెండ్స్ సంస్థ చరిత్రలో కలిసిపోయిన జావా, యెజ్ది బ్రాండ్‌లతో పాటుగా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోటారుసైకిల్ బ్రాండ్లలో ఒకటైన బిఎస్ఏను కూడా పునరుద్ధరించాలని చూస్తోంది.

Source: ET Auto

Most Read Articles

English summary
Yezdi Roadking Name Trademarked In India; Launch Expected Before Diwali This Year, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X