వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొత్త మరియు పాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

ఈ కంపెనీలు ఆఫర్ చేసే కొన్ని రకాల ఉత్పత్తులలో లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉంటున్నాయి. ఇలాంటి వాటిని నడిపేందుకు రైడర్లకు ఎలాంటి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ అవసరం లేదు.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

బిగినర్స్‌ని దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల వారికి అనువుగా ఉండేలా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు ఈ తరహా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను, మోపెడ్లను అందిస్తున్నాయి. స్వల్ప దూరాలను చేరుకునేందుకు ఇవి ఎంతో చక్కగా ఉపయోగపడుతాయి.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ అవసరం లేని లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఈ5

భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ విక్రయించే లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో హీరో ఆప్టిమా ఈ5 ఒకటి. ఈ స్కూటర్ 250 వాట్ డిసి ఎలక్ట్రిక్ మోటారు సాయతో పనిచేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంటుంది.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఈ5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 48 వి / 28 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి ఛార్జీపై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 65 కిలోమీటర్ల రేంజ్ (మైలేజ్)ని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో లీడ్-యాసిడ్ బ్యాటరీ వేరియంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

ఒకినావా లైట్

జపనీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ అయిన ఒకినావా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకినావా లైట్ మోడల్ ఒకటి. ఇది చూడటానికి ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగిన ట్రెడిషనల్ స్కూటర్‌లా అనిపిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఎల్ఈడి లైటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 250 వాట్ల బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

ఈ స్కూటర్ కూడా గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో 1.25 కెడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జీపై 60 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుండి 5 గంటలు పడుతుంది. ఇందులో ఇ-ఏబిఎస్ రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ఉంటుంది. దీని సాయంతో బ్రేక్ వేసిన ప్రతిసారి బ్యాటరీ చార్జ్ అవుతుంది.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

ఒకినావా ఆర్30

ఒకినావా అందిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మరొక మోడల్ ఆర్30. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపడానికి కూడా రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు. చూడటానికి స్కూటీ పెప్ మాదిరిగా కనిపించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.25 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు 250 వాట్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇందులోని బ్యాటరీ పూర్తి ఛార్జీపై 60 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీని చార్జ్ చేయటానికి 4-5 గంటల సమయం పడుతుంది. ఇందులో కూడా ఇ-ఏబిఎస్ రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఫలతంగా, బ్రేక్ వేసిన ప్రతిసారి బ్యాటరీ చార్జ్ అవుతుంది.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

ఆంపియర్ రియో ​​ఎలైట్

ఆంపియర్ రియో ​​ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూడటానికి హోండా డియో పెట్రోల్ స్కూటర్ మాదిరిగా ఉంటుంది. ప్రీమియం లుక్‌లో కనిపించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్ స్లాట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

ఈ స్కూటర్‌లో 250 వాట్ల బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ కూడా గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు లీడ్-యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లలో అందిస్తోంది. ఇందులోని బ్యాటరీ పూర్తి చార్జ్‌పై 60 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో అత్యంత సరసమైన లిథియం-అయాన్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 48 వోల్ట్ 28 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. పూర్తి ఛార్జీపై ఇది 65 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

లోహియా ఒమా స్టార్ ఎల్ఐ

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ లోహియా అందిస్తున్న ఒమా స్టార్ ఎల్ఐ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకటి. ఈ స్కూటర్‌లో 250 వాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఇందులోని బ్యాటరీ సాయంతో ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

వీటిని నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు.. ఎవ్వరైనా నడపొచ్చు!

పైన పేర్కొన్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగాన్ని గంటకు 25 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, ఇలా గంటకు 25 కి.మీ. మరియు అంత కన్నా తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. అలాగే, వాటిని నడిపే రైడర్లకు లైసెన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు.

Most Read Articles

English summary
You Don't Need Registration Or License To Ride These Electric Scooters. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X