Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

భారతదేశం రోజురోజుకి చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే సాంకేతిక కూడా మరింత వేగంగా అభివృద్ధి మార్గం వైపు పయనిస్తోంది. కావున అన్నిరంగాల్లో ఆధునిక మెళుకువలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ లాజిస్టిక్స్ డెలివరీ స్టార్టప్ Zypp ఎలక్ట్రిక్ పెద్ద క్యాంపస్‌లలో డెలివరీల కోసం డెలివరీ బాట్‌లను అభివృద్ధి చేయడానికి మరియు రూపొందించడానికి బెంగళూరు యొక్క ఫ్లో మొబిలిటీ (Flo Mobility) తో జతకట్టింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

Zypp ఎలక్ట్రిక్ ఇప్పుడు ఫ్లో మొబిలిటీతో ఏర్పరచుకున్న ఈ భాగస్వామ్యం సహకారంతో ఢిల్లీ NCR ప్రాంతంలో డెలివరీల చేయడానికి దృష్టి పెడుతుంది. ఫ్లో మొబిలిటీ ప్రస్తుతం భారతదేశం మరియు యూరప్‌లోని నగరాల్లో పైలట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. Zypp ఎలక్ట్రిక్ ఏర్పరచుకున్న ఈ భాగస్వామ్యంలో భాగంగా పెద్ద ప్రాంగణంలో డెలివరీ కోసం డెలివరీ బాట్‌ను తయారు చేస్తుంది. డెలివరీ బాట్ గేట్/ఎంట్రీ వద్ద మిగిలి ఉన్న ఏవైనా ప్యాకేజీలను ఎంచుకొని వాటిని డోర్ వద్దకు తీసుకువస్తుంది.

Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

ఫ్లో మొబిలిటీ Zypp డెలివరీ బాట్‌లను డెలివరీ సమయంలో స్వయంప్రతిపత్తితో నావిగేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది డెలివరీ ప్యాకేజీలతో లోడ్ చేయబడిన Zypp ఎలక్ట్రిక్ వాహనాలను పర్యవేక్షిస్తుంది. అంతే కాకుండా డెలివరీ సిబ్బంది కోసం వేచి ఉంటుంది. ప్రస్తుతం ఈ డెలివరీలు ఢిల్లీ NCR లో మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది.

Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

భారతదేశంలో లాస్ట్ మైల్ డెలివరీ కోసం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనున్న మొదటి డెలివరీ కంపెనీ Zypp Electric. Zypp Electric పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు, ఈ-స్టోర్స్ మరియు రెస్టారెంట్‌లతో సహా అనేక రకాల కంపెనీల నుండి దాని వినియోగదారులకు డెలివరీ సర్వీస్ అందిస్తుంది.

Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

Zypp Electric సహ వ్యవస్థాపకుడు & సీఈఓ ఆకాష్ గుప్తా, ఫ్లో మొబిలిటీతో కంపెనీ ఏర్పరచుకున్న భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. చిన్న వాహనాల కోసం భారతదేశంలోని ప్రముఖ స్వయంప్రతిపత్త సాంకేతిక పరిష్కార సంస్థ అయిన ఫ్లో మొబిలిటీతో మా భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ఈ సహకారంతో వివిధ ప్రదేశాలలో ఫుడ్ డెలివరీలను మరింత సులభంగా ఖచ్చితమైన సమయానికి డెలివరీ చేయవచ్చు. ఇది మునుపటికంటే మరింత మెరుగైన సర్వీస్ అందిస్తుందని అన్నారు.

Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

Zypp Electric ఇప్పుడు ఫ్లో మొబిలిటీ సహకారముతో స్టోర్ నుండి నేరుగా కస్టమర్ల ఇళ్లకు డెలివరీ సర్వీస్ అందిస్తుంది. కంపెనీ తన డెలివరీ ఫ్లీట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించడం ద్వారా కార్బన్-ఎమిషన్ రహిత వాతావరణాన్ని కూడా నిర్ధారిస్తోంది. కావున ఇది వాతావరణానికి ఎటువంటి హాని కలిగించదు.

Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

కస్టమర్లకు సకాలంలో డెలివరీని నిర్ధారించడానికి, బ్యాటరీలను మార్చుకోవడం ద్వారా ఛార్జింగ్‌లో సమయాన్ని ఆదా చేయడానికి కంపెనీ తన EV ఫ్లీట్ కోసం బ్యాటరీ ఎక్స్చేంజ్ స్టేషన్‌లను కూడా రూపొందించింది. ప్రస్తుతం, Zypp ఎలక్ట్రిక్ డెలివరీ ఫ్లీట్‌లో 2,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుకలో ఉన్నాయి. అంతే కాకూండా, కంపెనీ ప్రతి నెలా 50,000 కంటే ఎక్కువ డెలివరీ ఆర్డర్‌లను ప్రాసెస్ చేస్తోంది.

Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

భారతదేశంలో ఇ-కామర్స్ డెలివరీ ప్లాట్‌ఫాం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక నివేదిక ప్రకారం, 2025 నాటికి భారతదేశంలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య 60 లక్షలు దాటుతుందని అంచనా, ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌లో, ఆగస్ట్‌లో బెంగళూరు, పూణేలలో కంపెనీ తన సర్వీసులను ప్రారంభించింది.

Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

Zypp Electric ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్ మరియు జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో డోర్-స్టెప్ డెలివరీ సేవలను అందిస్తుంది. కంపెనీ ప్రస్తుతం తన ఎలక్ట్రిక్ టూ వీలర్ల ద్వారా స్టోర్ నుండి కస్టమర్‌కు వస్తువులు, మందులు, ఆహారం మరియు ప్యాకేజీలను అందజేస్తోంది.

Flo Mobility తో జతకట్టిన Zypp Electric.. కారణం ఇదే

స్టార్టప్ కంపెనీ Zypp కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్లను చాలా తక్కువ ధరలకు అద్దెకు తీసుకుంటుంది. మీరు Zypp మొబైల్ అప్లికేషన్‌లో Zypp ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. Ola మరియు Uber కోసం క్యాబ్‌లను బుక్ చేసినట్లే Zypp స్కూటర్‌ల కోసం బుకింగ్ చేయబడుతుంది. కావున ఇవి వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. Zypp ఎలక్ట్రిక్ ప్రారంభించిన ఈ కొత్త సర్వీస్ త్వరలో దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉంటుంది.అప్పుడు ఇది మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.

Most Read Articles

English summary
Zypp electric partnered with flo mobility for autonomous delivery robot details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X