హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన జిప్ ఎలక్ట్రిక్; పూర్తి వివరాలు

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ మామూలుగా లేదు. కావున దాదాపు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విక్రయిస్తున్నాయి. కస్టమర్లు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతే కాదు చాలా రాష్ట్రాల్లో కొన్ని సర్వీసుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పుడు ఈవీ స్టార్టప్ అయిన జిప్ ఎలక్ట్రిక్ తన సేవలను హైదరాబాద్‌లో తన సర్వీస్ ప్రారంభించినట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన జిప్ ఎలక్ట్రిక్; పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం ఇటీవల కాలంలో చాలా నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా ఇప్పుడు ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగానికి అడుగులు ముందుకు పడుతున్నాయి.

హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన జిప్ ఎలక్ట్రిక్; పూర్తి వివరాలు

ఇందులో భాగంగానే జిప్ ఎలక్ట్రిక్ కంపెనీ హైదరాబాద్‌లో 100 ఈవీ బైకర్లతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో జిప్ ఎలక్ట్రిక్ మొదటిసారిగా తన కార్యకలాపాలను హైదరాబాద్ నగరంలో ప్రారంభించింది. ఈ కంపెనీ ఇప్పుడు స్టార్టప్ గ్రోసరీ, ఈ రిటైల్ మరియు ఫుడ్ టెక్ దిగ్గజాలు బిగ్‌బాస్కెట్, హైపర్‌మార్కెట్లు మరియు గ్రోఫర్స్‌ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

MOST READ:లాక్‌డౌన్‌ సడలింపుకు శ్రీకారం.. మొదటగా ఈ సర్వీస్ స్టార్ట్.. ఎక్కడంటే?

హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన జిప్ ఎలక్ట్రిక్; పూర్తి వివరాలు

ఇప్పుడు దాదాపు అన్ని డెలివరీలు ఎపిఐ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వాహనాలతో చేయబడతాయి. ఈ ఎలెక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కంపెనీ 20 బ్యాటరీ ఎక్స్చేంజ్ మరియు ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనుంది.

హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన జిప్ ఎలక్ట్రిక్; పూర్తి వివరాలు

ప్రస్తుతం కంపెనీ హైదరాబాద్ నగరంలో 100 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించింది. అయితే రానున్న 3 నుంచి 4 నెలల్లో 500 వాహనాలను ప్రారంభించే పనులకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కంపెనీ యొక్క కార్యకలాపాలు ఉత్తర భారతదేశంలో చాలా వేగంగా ఉన్నాయి. ఇది కాస్త ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తహరించడానికి పూనుకుంది.

MOST READ:స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త హోండా ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన జిప్ ఎలక్ట్రిక్; పూర్తి వివరాలు

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కార్బన్ ఉద్గారాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ విధంగా తగ్గడం వల్ల పర్యావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది.

హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన జిప్ ఎలక్ట్రిక్; పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ బైకుల ద్వారా పర్యావరణ అనుకూలమైన డెలివరీ సర్వీస్ అందించడానికి కొన్ని కంపెనీలతో మరియు కొన్ని పెద్ద పొరుగు దుకాణాలతో భాగస్వామ్యం చేయడమే మా ప్రధాన లక్ష్యం, అని జిప్ ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు మరియు సిఈఓ ఆకాష్ గుప్తా అన్నారు.

MOST READ:సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ.. షాక్‌లో అరబ్ దేశాలు

హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన జిప్ ఎలక్ట్రిక్; పూర్తి వివరాలు

జిప్ ఎలక్ట్రిక్ 2017 లో స్థాపించబడింది. ఈ కంపెనీ ప్రస్తుతం కిరాణా, మందులు, ఆహారం, ప్యాకేజీలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి స్కూటర్ల ఎలక్ట్రిక్ బైకుల ద్వారా అందిస్తుంది. జిప్ మార్పిడి స్టేషన్లలో రిమూవబుల్ బ్యాటరీలను టెక్నాలజీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

Most Read Articles

English summary
Zypp Electric Launches Their Services In Hyderabad. Read in Telugu.
Story first published: Monday, June 7, 2021, 15:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X