ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

ఈ ఫొటోలలో కనిపిస్తున్న మోటార్‌సైకిల్ ఖరీదు అక్షరాల రూ. 17.55 లక్షలు, ఇందులో మ్యాన్యువల్ గేర్లు కూడా ఉండవు. మరి ఇది ఏ రకం మోటార్‌సైకిల్ అనుకుంటున్నారా? ఇది జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle And Scooter India) అందిస్తున్న అధునాతన 2022 హోండా ఆఫ్రికా ట్విన్ స్పోర్ట్ అడ్వెంచర్ (Honda Africa Twin Adventure) మోటార్‌సైకిల్. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ. 16.01 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

హోండా తమ ఆఫ్రికా ట్విన్ మోటార్‌సైకిల్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి, దాని కలర్ ఆప్షన్ మరియు ట్రాన్సిమిషన్ ఆప్షన్లలో మార్పులు చేయబడి ఉంటాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

2022 హోండా ఆఫ్రికా ట్విన్ పెరల్ గ్లేర్ వైట్ ట్రైకలర్ (6-స్పీడ్ మ్యాన్యువల్) : రూ.16.01 లక్షలు

2022 హోండా ఆఫ్రికా ట్విన్ బాలిస్టిక్ బ్లాక్ మెటాలిక్ (డిసిటి ఆటోమేటిక్) : రూ.17.55 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

కొత్త 2022 హోండా ఆఫ్రికా ట్విన్ స్పోర్ట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ను కంపెనీ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) ఆప్షన్లలో విక్రయిస్తోంది. ఈ రెండు వేరియంట్లలో గేర్‌బాక్స్ ఆప్షన్లు వేరుగా ఉన్నప్పటికీ, ఇంజన్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ లో 1082.96 సిసి, లిక్విడ్-కూల్డ్, 4 స్ట్రోక్, 8 వాల్వ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ను ఉపయోగించారు. దీనిలో కంపెనీ ఓవర్‌హెడ్ క్యామ్‌షాఫ్ట్ (OHC) వాల్వ్ రకాన్ని ఇన్‌స్టాల్ చేసింది.

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

పవర్, టార్క్ గణాంకాల విషయానికి వస్తే, ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 97.8 బిహెచ్‌పిల శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 103 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్‌సైకిల్‌లో సిక్స్-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ (IMU), డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ (ABS), హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) మరియు బ్లూటూత్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

హోండా ఆఫ్రికా ట్విన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో కంపెనీ నాలుగు ప్రత్యేకమైన రైడింగ్ మోడ్స్ (టూర్, అర్బన్, గ్రావెల్ మరియు ఆఫ్-రోడ్) ను అందిస్తోంది. ఇవి కాకుండా ఇందులో రెండు కస్టమైజబుల్ (యూజర్ 1 మరియు యూజర్ 2) సెట్టింగ్స్ కూడా ఇవ్వబడ్డాయి. రైడర్ వీటిని తమ డ్రైవింగ్ తీరుకు తగినట్లుగా కస్టమైజ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది.4

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

ఇంకా ఈ మోటార్‌సైకిల్‌లో సర్దుబాటు చేయగల కన్సోల్ స్క్రీన్‌ కూడా లభిస్తుంది. వినోదం కోసం, కొత్త 2022 మోడల్ హోండా ఆఫ్రికా ట్విన్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ యాపిల్ కార్‌ప్లే (Apple CarPlay) మరియు ఆండ్రాయిడ్ ఆటో (Android Auto) ను సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా ఇందులో రైడర్ అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేయగల సీట్లు మరియు ర్యాలీ స్టైల్ పాజిటివ్ ఎల్‌సిడి కలర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

కొత్త 2022 హోండా ఆఫ్రికా ట్విన్ స్పోర్ట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఇటు టూరింగ్ మోటార్‌సైక్లింగ్ కోసం మరియు అటు ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం తయారు చేయబడింది. ఇందులోని భారీ ఇంజన్‌కు మద్దతు ఇవ్వడానికి కంపెనీ దీనిని సెమీ-డబుల్ క్రెడిల్ స్టీల్ ఫ్రేమ్‌ను ఉపయోగించి తయారు చేసింది. కాబట్టి, ఇది చాలా ధృడమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇందులోని డిసిటి ట్రాన్స్‌మిషన్ వేరియంట్ మూడు స్థాయిల ఎలక్ట్రానిక్ ఇంజన్ బ్రేకింగ్‌ను కలిగి ఉంటుంది.

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

ఈ మోటార్‌సైకిల్‌ను నిటారుగా ఉంచడానికి, మూడు-స్థాయిల వీలీ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఈ మోటారుసైకిల్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు 230 మిమీ ట్రావెల్‌తో షోవా 45 మిమీ కార్ట్రిడ్జ్-టైప్ ఇన్వెర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో 220 మిమీ ట్రావెల్‌తో మోనో-షాక్ సస్పెషన్లు ఉంటాయి. రెండు చివర్లలో ఉన్న సస్పెన్షన్లను పూర్తిగా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంది.

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయెల్ 310 మిమీ డిస్క్స్, వెనుక వైపు 256 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం వెనుక చక్రంలో రైడర్ సహాయాన్ని స్విచ్-ఆఫ్ చేసే సామర్ధ్యంతో డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ డ్యూయల్ పర్పస్ టైర్లను అమర్చారు, ఇందులో ముందు వైపు 21 ఇంచ్, వెనుక వైపు 18 ఇంచ్ టైర్లను ఉపయోగించారు.

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.17.55 లక్షలు.. ఇందులో గేర్లు కూడా ఉండవు.. ఇంతకీ ఇదేంటి?

ఈ కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే మరిన్ని కొత్త హంగులతో వస్తుంది. ఇందులో అప్‌డేటెడ్ ఇంజన్, కనెక్టింగ్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో ఎక్స్‌టర్నల్ క్రాష్ ప్రొటెక్టివ్ ఫ్రేమ్, ఎత్తు-సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, పెద్ద 24.5 లీటర్ల ఇంధన ట్యాంక్, ముందు భాగంలో డేటైమ్ రన్నింగ్ లైట్లు, కార్నరింగ్ లైట్లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడి హెడ్‌లైట్లు మొదలైన డిజైన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
2022 honda africa twin adventure sports launched in india price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X