త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్' (Honda Motorcycle) తన కొత్త 2022 హోండా సిబి500ఎక్స్ (2022 Honda CB500X) ని వెల్లడించింది. ఈ కొత్త 2022 Honda CB500X బైక్ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. దేశీయ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

2022 హోండా CB500X బైక్ లో కనిపించే అతిపెద్ద అప్డేట్ ఏమిటంటే దాని కొత్త 41 మిమీ నాన్-అడ్జస్టబుల్, షోవా SFF-BP USD ఫోర్క్, ఇది మునుపటి టెలిస్కోపిక్ ఫోర్క్‌ను భర్తీ చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ అనేది బైక్ రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది.

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

అదే సమయంలో హోండా CB500X బైక్ సస్పెన్షన్ సిస్టమ్ లైట్ వెయిట్ ఆఫ్-రోడ్ ఉపయోగం కోసం 132 మిమీ వీల్ ట్రావెల్‌తో వస్తుంది మరియు ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ సెటప్ మధ్య సరైన బ్యాలెన్స్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

కొత్త హోండా CB500Xలో ఇతర మార్పులు కొత్త అల్యూమినియం ఫ్రంట్ వీల్ రూపంలో వస్తాయి, ఇది మునుపటి వీల్ కంటే 100 గ్రామ్స్ తేలికైనది. కావున ఈ మోటార్‌సైకిల్ తక్కువ స్ప్రుంగ్ మాస్ కలిగి ఉంటుంది, ఇది మోటార్‌సైకిల్ యొక్క రైడ్ మరియు హ్యాండ్లింగ్ ఫీచర్స్ పైన కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

యాంత్రిక మార్పుల జాబితాలో కొత్త స్వింగ్‌ఆర్మ్ ఉందని హోండా మోటార్‌సైకిల్స్ చెబుతోంది, ఇది మునుపటి యూనిట్ కంటే 1 కిలోల బరువు తక్కువగా ఉంటుంది, కానీ సమానంగా దృఢంగా ఉంటుంది. అంతేకాకుండా, హోండా కొత్త హోండా CB500X యొక్క బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది.

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

కొత్త హోండా CB500X మోటార్‌సైకిల్‌ కొత్త పెర్ల్ ఆర్గానిక్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. ఈ కలర్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

కంపెనీ ఈ కొత్త హోండా CB500X మోటార్‌సైకిల్‌ యొక్క పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో అదే 471 సిసి లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ అందుబటులో ఉంటుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 43.2 ఎన్ఎమ్ టార్క్‌ విడుదల చేస్తుంది.

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా CB500X ధర రూ. 6.87 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అయితే త్వరలో రానున్న ఈ కొత్త అప్డేటెడ్ హోండా CB500X మోటార్‌సైకిల్‌ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే త్వరలో కంపెనీ దీనికి సంబంధించి సమాచారం వెల్లడిస్తుంది.

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

ఇదిలా ఉండగా హోండా మోటార్సైకిల్ (Honda Motorcycle) భారతీయ మార్కెట్లో కొత్త హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ స్కూటర్‌ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ. 78,725.

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ స్కూటర్‌ రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో అందించబడింది. అవి పెర్ల్ అమేజింగ్ వైట్/మ్యాట్ మాగ్నిఫిసెంట్ కాపర్ మెటాలిక్ మరియు మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్/మ్యాట్ ఎర్ల్ సిల్వర్ మెటాలిక్. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి యాక్టివా 125 ప్రీమియం డ్రమ్ అల్లాయ్ వేరియంట్ కాగా, మరొకటి యాక్టివా 125 ప్రీమియం డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 78,725 మరియు రూ. 82,280 (ఎక్స్-షోరూమ్).

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

ఈ కొత్త స్కూటర్ లో కొత్త కాస్మెటిక్ అప్‌డేట్‌లు కాకుండా మిగిలినవన్నీ దాని స్టాండర్డ్ యాక్టివా 125 మాదిరిగానే ఉంటుంది. ఇక స్టైలింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఇది ఇప్పుడు మునుపటి మాదిరిగా కాకూండా డ్యూయల్-టోన్ బాడీ కలర్‌ పొందుతుంది, ఇది సైడ్ ప్యానెల్‌లతో పాటు ఫ్రంట్ కవర్ వరకు విస్తరించి ఉంటుంది. ఇది కాకుండా, స్కూటర్‌లోని ఇతర ముఖ్యమైన మార్పులు బ్లాక్ ఫ్రంట్ సస్పెన్షన్‌తో బ్లాక్ ఇంజన్‌ని కలిగి ఉన్నాయి.

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

కొత్త హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ స్కూటర్‌లో, కంపెనీ 124 సిసి కెపాసిటీ గల బిఎస్-6 ఇంజన్‌ని ఉపయోగించింది. ఈ ఇంజన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ మోడల్‌లో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్‌ను కూడా ఉపయోగించింది. దీని కారణంగానే ఈ స్కూటర్ మైలేజ్ మరింత మెరుగ్గా ఉంటుంది.

త్వరలో విడుదల కానున్న 2022 Honda CB500X బైక్: వివరాలు

కొత్త హోండా యాక్టవా 125 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో, కంపెనీ మల్టీ-ఫంక్షన్ ఇగ్నిషన్ కీని ఇచ్చింది, తద్వారా మీరు స్కూటర్ యొక్క స్టీరింగ్‌ను కూడా లాక్ చేయవచ్చు, కావున దీని ద్వారా సీటును సులభంగా ఓపెన్ చేయవచ్చు. అంతే కాకూండా ఈ స్మార్ట్ కీ సహాయంతో ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్‌ను కూడా ఓపెన్ చేయవచ్చు, ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 12, 2022, 10:02 [IST]
English summary
2022 honda cb500x unveiled design features engine launch soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+