ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ 'హోండా మోటార్సైకిల్స్ ఇండియా' (Honda Motorcycles India) భారతీయ మార్కెట్లో కొత్త '2022 హోండా సిబిఆర్650ఆర్' (2022 Honda CBR650R) బైక్ లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త సిబిఆర్650ఆర్ బైక్ ధర రూ. 9.35 లక్షలు. కంపెనీ ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున కొనుగోలు చేయాలనుకునే వారు హోండా యొక్క బిగ్‌వింగ్ షోరూమ్‌ని సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

'2022 హోండా సిబిఆర్650ఆర్' (2022 Honda CBR650R) బైక్ భారతీయ మార్కెట్లోకి నాక్డ్ డౌన్ యూనిట్‌గా తీసుకురాబడుతుంది. ఈ బైక్ రెండు కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి గ్రాండ్ ప్రిక్స్ రెడ్ కాగా, మరొకటి మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ కలర్స్.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

హోండా సిబిఆర్650ఆర్ బైక్ అద్భుతమైన డిజైన్ పొందితుంది. ఇది కొత్త స్పోర్టీ గ్రాఫిక్స్‌తో పాటు ఆరెంజ్ హైలైట్‌లతో ఆకర్షణీయమైన లుక్‌ పొందుతుంది. సీటు బ్లాక్ కలర్ లో ఉంది. ఈ బైక్ హై మరియు లో ఫెయిరింగ్‌ పొందటం వల్ల మరింత దూకుడుగా కనిపిస్తుంది. ఈ బైక్ 649 సిసి ఫోర్ సిలిండర్‌ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 64 కిలోవాట్ పవర్ మరియు 57.5 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 6 గేర్‌బాక్స్‌లతో జత చేయబడింది

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ స్పెషల్ ప్రీమియం డీలర్‌షిప్ బిగ్‌వింగ్ టాప్‌లైన్ గురుగ్రామ్, ముంబై, బెంగుళూరు, ఇండోర్, కొచ్చి, హైదరాబాద్ మరియు చెన్నైలలో అందుబాటులో ఉంది, అదే సమయంలో ఇక్కడ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అంతే కాకూండా కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా బుకింగ్ చేయవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

2022 హోండా సిబిఆర్650ఆర్ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2128 మిమీ, వెడల్పు 749 మిమీ, ఎత్తు 1149 మిమీ మరియు వీల్ బేస్ 1449 మిమీ వరకు ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 132 మిమీ వరకు ఉంది. ఈ బైక్ యొక్క బరువు 211 కేజీలు కాగా, దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.4 లీటర్లు వరకు ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

సిబిఆర్650ఆర్ బైక్ యొక్క ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో డబుల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేక్ అమర్చబడింది. దీనితో పాటు డ్యూయల్ ఛానల్ ABS కూడా అందుబటులో ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

ఈ కొత్త బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ బార్ గ్రాఫ్ టాకోమీటర్, డ్యూయల్ ట్రిప్ మీటర్, డిజిటల్ ఫ్యూయెల్ లెవెల్ గేజ్, ఫ్యూయెల్ యూసేజ్ గేజ్, డిజిటల్ క్లాక్, వాటర్ టెంపరేచర్ గేజ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అయిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంది. దీనితో పాటు ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హోండా ఇగ్నిషన్ సెక్యూరిటీ సిస్టమ్, మరియు హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

ఈ బైక్‌ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు స్లిమ్ టెయిల్‌లైట్ వంటి వాటిని పొందుతుంది. ఈ బైక్ దాని బలమైన ఇంజిన్ మరియు గొప్ప పనితీరుకు ప్రసిద్ధి చెందింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ బైక్ కి ఎలాంటి స్పందన లభిస్తుందో వేచి చూడాలి.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా హోండా మోటార్సైకిల్ కంపెనీ 2021 డిసెంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం గత డిసెంబర్‌లో 2,23,621 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో దేశీయంగా 210,612 యూనిట్లు మరియు 13,009 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' భారతీయ మార్కెట్లో తన హోండా షైన్ (Honda Shine) బైక్ ని విడుదల హెసినప్పటినుంచి కూడా ఏకంగా ఇప్పటికి కోటి యూనిట్లను విక్రయించినట్లు అధికారికంగా తెలిపింది. భారతీయ మార్కెట్లో హోదా షైన్ 125 సిఐ విభాగంలో దాదాపు 50 శాతం వాటాలు కలిగి ఉంది. రాబోయే కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

భారత మార్కెట్‌లో 29 శాతం వార్షిక అమ్మకాల వృద్ధితో అగ్రగామిగా ఉన్న హోండా షైన్ 125 సిసి విభాగంలో కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడే 125సీసీ బైక్‌గా మారిందని కంపెనీ తెలిపింది. దేశంలో కోటి అమ్మకాల సంఖ్యను తాకిన తొలి మోటార్‌సైకిల్ బ్రాండ్ హోండా షైన్ 125 కావడం నిజంగా చాలా గొప్ప విషయం.

ఎట్టకేలకు భారత్‌లో 2022 Honda CBR650R బైక్ లాంచ్.. పూర్తి వివరాలు

హోండా షైన్ 125 అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ ఈ మోడల్ ని 2017 వరకు దాదాపు 50 లక్షల యూనిట్లకు విక్రయించింది. ఆ మరుసటి సంవత్సరం ఈ అమ్మకాలు మొత్తం 70 లక్షలకు చేరాయి. కంపెనీ 2019 వ సంవత్సరంలో తన బిఎస్6 హోండా షైన్ 125 విడుదల చేసింది. ఆ సమయంలో కంపేనీ యొక్క ఈ కొత్త బైక్ అమ్మకాలు ఏకంగా 90 లక్షల యూనిట్లకు చేరింది. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
2022 honda cbr650r launched price 9 35 lakh features engine details
Story first published: Tuesday, January 25, 2022, 14:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X