2022 నింజా 400 డెలివరీలు ప్రారంభించిన కవాసకి.. మీరు కూడా బుక్ చేసుకున్నారా?
జపనీస్ బైక్ తయారీ సంస్థ 'కవాసకి' (Kawasaki) ఇప్పటికే దేశీయ మార్కెట్లో తన కొత్త 'నింజా 400' (Ninja 400) బైక్ నుఈ ఏడాది జూన్ నెలలో అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Recommended Video
దేశీయ మార్కెట్లో కవాసకి విడుదల చేసిన ఈ కొత్త బైక్ యొక్క డెలీవరీల ఇప్పుడు ప్రారంభమయ్యాయి. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కవాసకి ఇండియా భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు ఇప్పుడు తన నింజా 400 యొక్క బిఎస్6 వెర్షన్ డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వెలువడ్డాయి.

నిజానికి కవాసకి నింజా 400 సుమారు 2.5 సంవత్సరాల విరామం తర్వాత భారతదేశంలో తిరిగి విడుదల చేయబడింది. ఇది గతంలో 2109 వరకు మార్కెట్లో విక్రయించబడింది. ఆ తరువాత బిఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత 2020 ఏప్రిల్ లో నిలిపివేయబడింది. 2020 తరువాత ఇప్పుడు 2022 లో మళ్ళీ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ అయిన తరువాత దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది.

2022 కవాసకి నింజా400 చూడటానికి చాలా మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి లైమ్ గ్రీన్ మరియు మెటాలిక్ కార్బన్ గ్రే కలర్స్. ఈ రెండు కలర్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

డిజైన్ విషయానికి వస్తే, ఈ లేటెస్ట్ బైక్ డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డిఆర్ఎల్, ఫంకీ రియర్ వ్యూ మిర్రర్స్, వైడ్ హ్యాండిల్‌బార్, విండ్‌స్క్రీన్, స్క్వీకబుల్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు స్ప్లిట్-సీట్ డిజైన్ కలిగి ఉంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఫీచర్స్ పరంగా కూడా కవాసకి చాలా వరకు నవీనీకరించబడింది. కావున ఇందులో డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లే స్థానంలో సెమీ-డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంటేషన్ కలిగి ఉంటుంది. ఇందులో అనలాగ్ టాకొమీటర్, ఎడమవైపున వార్నింగ్ లైట్ ఉంటాయి, కుడివైపు మల్టీ ఫంక్షన్ ఎల్సిడి స్క్రీన్ వంటి కూడా ఉన్నాయి.

అదే సమయంలో ఈ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1,990 మిమీ పొడవు, 710 మిమీ వెడల్పు, 1,120 ఎత్తు మరియు వీల్ బేస్ 1,370 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే.. ఇది 140 మిమీ వరకు ఉంటుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్ల వరకు ఉంటుంది. కావున లాంగ్ రైడ్ సమయంలో కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

2022 'కవాసకి నింజా400' బైక్ 399 సిసి, లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్, డిఓసిహెచ్, 8 వాల్వ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 44.7 బిహెచ్‌పి పవర్ మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మంచి పనితీరుని అందిస్తుంది.

నింజా 400 బైక్ యొక్క సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ వంటి వాటిని గమనించినట్లయితే.. ఈ బైక్ ముందు భాగంలో 120 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో 130 మిమీ స్వింగార్మ్ పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 286 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు 193 మీమీ రియర్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎన్ ప్రామాణికంగా అందుబాటులో ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ మార్కెట్లో కవాసకి ప్రియులు ఎక్కువ సంక్యలోనే ఉన్నారు, ఈ కారణంగా తప్పకుండా కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. 2022 కవాసకి నింజా 400 బైక్ భారతీయ విఫణిలో కెటిఎమ్ ఆర్‌సి390 (KTM RC 390) మరియు టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 (TVS Apache RR310) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








