భారత్‌లో కొత్త బైక్ విడుదలకు సిద్దమవుతున్న కవాసకి: వివరాలు

ప్రముఖ జపనీస్ బైక్ తయారీ సంస్థ 'కవాసకి' (Kawasaki) భారతీయ మార్కెట్లో ఈ నెల చివరి నాటికి కొత్త 'వెర్సిస్ 650' (Versys 650) విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దేశీయ మార్కెట్ కోసం కంపెనీ ఈ కొత్త '2022 కవాసకి వెర్సిస్ 650' (2022 Kawasaki Versys 650) బైక్ ను కొత్త అవతార్‌లో అందించబడే అవకాశం ఉంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

భారత్‌లో కొత్త బైక్ విడుదలకు సిద్దమవుతున్న కవాసకి: వివరాలు

భారతీయ మార్కెట్ కోసం సిద్దమవుతున్న ఈ కొత్త బైక్ ఆధునిక డిజైన్ కలిగి ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అయితే ఈ బైక్ యొక్క ఇంజిన్ లో ఎటువంటి మార్పు లేదు, ఎందుకంటే ఇంజిన్ దాని మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. కానీ ధర మాత్రం స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 30,000 నుంచి రూ. 50,000 ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

భారత్‌లో కొత్త బైక్ విడుదలకు సిద్దమవుతున్న కవాసకి: వివరాలు

త్వరలో దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త కవాసకి వెర్సిస్ 650 దాని వెర్సిస్ 1000 నుండి ప్రేరణ పొందటం వల్ల మరింత ఆధునికంగా కనిపిస్తుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు మరియు ఫోర్ వె అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో కొత్త ఇంజన్ కౌల్ ఉంటుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత భిన్నంగా కనిపిస్తుంది.

భారత్‌లో కొత్త బైక్ విడుదలకు సిద్దమవుతున్న కవాసకి: వివరాలు

2022 కవాసకి వెర్సిస్ 650 యొక్క బాడీ డిజైన్ దాదాపుగా దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇంజిన్ లో ఎటువంటి మార్పులు లేదు. కావున ఈ బైక్ 649 సిసి ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తోనే వస్తుంది. ఈ ఇంజిన్ 66 బిహెచ్‌పి పవర్ మరియు 61 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

భారత్‌లో కొత్త బైక్ విడుదలకు సిద్దమవుతున్న కవాసకి: వివరాలు

ఇంజిన్ మాత్రమే కాకుండా ఇందులోని చాసిస్ మరియు సస్పెన్షన్ వంటివి కూడా స్టాండర్డ్ మోడల్ లో ఉండే విధంగా ఉంటాయి. కావున ఇందులో కూడా ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఈ కొత్త బైక్ కూడా షోవా యొక్క మోనోషాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ నే పొందుతుంది.

భారత్‌లో కొత్త బైక్ విడుదలకు సిద్దమవుతున్న కవాసకి: వివరాలు

బ్రేకింగ్ సిస్టం కూడా మునుపటి మోడల్‌ను పోలి ఉంటుంది. కావున రాబోయే కొత్త బైక్ ముందువైపు డ్యూయల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. బైక్ యొక్క బ్రేక్ సిస్టమ్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ తో అమర్చబడి ఉంటుంది. కావున రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో కొత్త బైక్ విడుదలకు సిద్దమవుతున్న కవాసకి: వివరాలు

భారత మార్కెట్లో విడుదలకానున్న కొత్త కవాసకి వెర్సిస్ 650 ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇది ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే కూడా రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాము. కావున దీని ధర రూ. 6.45 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. భారతీయ మార్కెట్లో ఈ కొత్త బైక్ విడుదలైన తరువాత ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660కి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

భారత్‌లో కొత్త బైక్ విడుదలకు సిద్దమవుతున్న కవాసకి: వివరాలు

ఇదిలా ఉండగా కవాసకి ఇటీవల చిన్నపిల్లల కోసం ఓ సరికొత్త కిడ్స్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకువచ్చింది. ఈ బైక్ 3 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు సులభంగా రైడ్ చేయవచ్చు. కంపెనీ ఇటీవల ప్రపంచ మార్కెట్లో ఆవిష్కరించింది. కవాసకి ఎలక్ట్రోడ్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేసే చిన్న బ్యాలెన్స్ బైక్, ఇది చాలా చిన్న వయస్సులోనే పిల్లలకు మోటార్‌సైకిల్ రైడింగ్ కళలో శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించబడినది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌లో కొత్త బైక్ విడుదలకు సిద్దమవుతున్న కవాసకి: వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో కవాసకి మంచి ప్రజాదరణ పొందిన బైక్ తయారీ సంస్థ. ఈ కంపెనీ ఇప్పుడు మరో కొత్త బైక్ విడుదలతో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. ఈ కొత్త బైక్ గురించి చాలా వివరాలు అందుబాటులో లేదు. కావున ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి కొత్త కార్లు మరియు కొత్త బైకులు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
2022 kawasaki versys 650 to launch in june updates details
Story first published: Thursday, June 16, 2022, 17:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X