ఇండోనేషియాలో అడుగెట్టిన జపనీస్ బ్రాండ్ స్కూటర్: వివరాలు
ప్రముఖ జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha) భారతీయ మార్కెట్లో కొత్త మాక్సీ స్కూటర్ 'ఏరోక్స్ 155' (Aerox 155) ను ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ కొత్త స్కూటర్ యొక్క మరింత అప్డేటెడ్ వెర్షన్ ఇండోనేషియా మార్కెట్లో విడుదలయ్యింది. ఈ కొత్త అప్డేటెడ్ వెర్షన్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మార్కెట్లో యమహా కంపెనీకి పెరుగుతున్న డిమాండ్ కారణంగా, తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే 2022 యమహా ఏరోక్స్ 155 (2022 Yamaha Aerox 155) ఇప్పుడు ఇండోనేషియా మార్కెట్లో అడుగుపెట్టింది. కంపెనీ యొక్క ఈ కొత్త స్కూటర్ మొత్తం ఆరు కొత్త పెయింట్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది.

కంపెనీ యొక్క 2022 యమహా ఏరోక్స్ 155 ABS వేరియంట్ మాట్ బ్లాక్ గోల్డ్ మరియు మాట్ వైట్ గోల్డ్‌లో అందుబాటులో ఉంది. అయితే కనెక్టెడ్ వెర్షన్ మాత్రం మొత్తం నాలుగు పెయింట్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది. అవి బ్లాక్ సియాన్, డార్క్ గ్రే ఎల్లో, బ్లాక్ విత్ రెడ్ యాక్సెంట్ మరియు రెడ్ విత్ కాంట్రాస్ట్ బ్లాక్ పెయింటెడ్ బాడీ ప్యానెల్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్ కొత్త కలర్ ఆప్సన్స్ కాకుండా, డిజైన్ దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ప్రస్తుత తరం మోడల్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఇండోనేషియాలో సరికొత్త అప్డేటెడ్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. కానీ ఈ స్కూటర్ యొక్క పరిమాణం మరియు మెకానికల్ ఫీచర్స్ వంటివాటితో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

భారతదేశంలో యమహా కంపెనీ ఇప్పుడు తమ యమహా ఏరోక్స్ 155 ధరను రూ. 2,000 వరకు పెంచడం వల్ల, ఇందులోని మాన్‌స్టర్ ఎనర్జీ ధర రూ. 1,30,500 (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, మెటాలిక్ బ్లాక్ మరియు గ్రే ధర రూ. 1,31,000 (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

యమహా ఏరోక్స్ 155 అనేది భారత దేశంలోనే మొట్టమొదటి 155 సిసి స్కూటర్. ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, యమహా ఆర్15 బైక్‌లో ఉపయోగించిన అదే 155 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ డిఓహెచ్‌సి ఇంజన్ నే ఈ కొత్త ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ లోనూ ఉపయోగించారు. కాకపోతే, ఇది ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కోసం వేరియబుల్ వాల్వ్ అక్యుమ్యులేషన్ (వివిఏ) టెక్నాలజీని కలిగి ఉంటుంది.

ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 15.36 బిహెచ్‌పి పవర్ ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటి గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ లోని ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి, లేటెస్ట్ యమహా ఆర్15 వి7 4.0 మోడల్ ఉత్పత్తి చేసే శక్తి కంటే 4 బిహెచ్‌పి తక్కువగా ఉంటుంది.

యమహా ఏరోక్స్ 155 యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. కావున ఇది ఆధునిక డిజైన్ మరోయు పరికరాలను పొందుతుంది. ఈ స్కూటర్‌లో LED హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్‌తో పాటు LED DRL లైట్ మరియు టర్న్ ఇండికేటర్ కూడా LED లో ఇవ్వబడ్డాయి.

ఈ కొత్త స్కూటర్ 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీని పొందుతుంది, కావున ఇందులో రెండు స్టాండర్డ్ సైజు హెల్మెట్‌లను సులభంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కోసం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఆపరేషన్, ఛార్జింగ్ సాకెట్ మరియు సింగిల్ ఛానల్ ABS కూడా పొందుతుంది. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనికి రెండు వైపులా 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

యమహా ఏరోక్స్ 155 యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. కావున ఇది ఆధునిక డిజైన్ మరోయు పరికరాలను పొందుతుంది. ఈ స్కూటర్‌లో LED హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్‌తో పాటు LED DRL లైట్ మరియు టర్న్ ఇండికేటర్ కూడా LED లో ఇవ్వబడ్డాయి.

స్కూటర్‌ను యమహా వై-కనెక్ట్ అప్లికేషన్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ స్కూటర్ మైలేజ్, రైడింగ్ హిస్టరీ, పార్కింగ్ లొకేషన్, బ్యాటరీ లెవెల్ మరియు మెయింటెనెన్స్ అలర్ట్‌లతో సహా వివిధ నోటిఫికేషన్‌లను అందిస్తుంది. స్కూటర్‌లో 5.5 లీటర్ కెపాసిటీ గల ఫ్యూయెల్ ట్యాంక్ ఇవ్వబడింది.

యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) మాక్సీ స్కూటర్ ఈ విభాగంలో ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 (Aprilia SXR 160) తో పోటీపడుతుంది. ఈ కొత్త యమహా స్కూటర్ ఆప్రిలియా స్కూటర్ కన్నా (10.9 బిహెచ్‌పి పవర్) శక్తివంతమైనది. ఈ స్కూటర్ ఇప్పటికే థాయ్‌లాండ్ మరియు ఫిలిప్పీన్స్ వంటి అనేక ఆగ్నేయాసియా మార్కెట్‌లలో విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications








