Yamaha నుంచి రానున్న కొత్త అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీదారు 'యమహా మోటార్‌సైకిల్ ఇండియా' (Yamaha Motorcycle India) భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతూ అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. అయితే కంపెనీ ఈ 2022 వ సంవత్సరంలో తన పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేయడానికి సంకల్పించింది. ఇందులో భాగంగానే కంపెనీ త్వరలో దేశీయ విఫణిలో యమహా ఎఫ్‌జెడ్ మోడల్స్ ని మరిన్ని కొత్త అప్‌డేట్లతో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

కంపెనీ నివేదికల ప్రకారం, కొత్త అప్డేటెడ్ రేంజ్ లో 2022 Yamaha FZ, FZ-S మరియు టాప్-స్పెక్ FZ-S డీలక్స్ వంటి మోడల్స్ ఉన్నాయి. అయితే ఇందులోని Yamaha FZ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. అదే విధంగా దీని మిడ్-స్పెక్ మోడల్ Yamaha FZ-S మోడల్ ధరలు రూ. 1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఇక చివరగా టాప్-స్పెక్ FZ-S డీలక్స్ ధర రూ. 1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త Yamaha FZ శ్రేణిలో ప్రధాన మార్పుల విషయానికి వస్తే, ఇది కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో బేస్ ఎఫ్‌జెడ్ మోడల్ డీప్ పర్పుల్ బ్లూ మెటాలిక్ వై మరియు బ్లాక్ మెటాలిక్ ఎక్స్‌ వంటి రెండు కలర్ స్కీమ్స్ ఉన్నాయి.

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

అదే విధంగా FZ-S కూడా రెండు విభిన్న ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో మాట్ డల్ రెడ్ మెటాలిక్ 4 మరియు మాట్ డార్క్ పర్పుల్ బ్లూ మెటాలిక్ 1 ఉన్నాయి. ఇక చివరగా టాప్-స్పెక్ FZ-డీలక్స్ ట్రిమ్ బ్లాక్ మెటాలిక్ X, డీప్ రెడ్ మెటాలిక్ X మరియు పాస్టెల్ డార్క్ గ్రేతో సహా మూడు రంగులలో అందించబడుతుంది.

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

ఈ కొత్త బైక్స్ కేవలం కలర్ ఆప్సన్స్ మాత్రమే కాకుండా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ కొత్త FZ-S బైక్ LED టైల్‌లైట్‌ని పొందుతుంది. అదే విధంగా యమహా FZS డీలక్స్ LED టైల్‌లైట్, కలర్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ సీట్లు మరియు LED ఫ్లాషర్స్ వంటి ఫీచర్లను పొందుతుంది.

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

యమహా యొక్క బేస్ FZ మోడల్‌ ఎటువంటి అదనపు మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందే అవకాశం లేదు. అయితే ఇది ఇప్పటికే నెగటివ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ కలిగి ఉంది. ఇది కాకుండా, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫంక్షన్ మరియు LED హెడ్‌లైట్ వంటి ఫీచర్లు ఈ మోటార్‌సైకిల్‌లో ఇవ్వబడ్డాయి.

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

కొత్త 2022 Yamaha FZ రేంజ్ యొక్క హై-స్పెక్ మోడల్‌లు కొత్త ఫీచర్లతో వస్తాయి. ఇది Yamaha యొక్క బ్లూటూత్-ప్రారంభించబడిన కన్సోల్ వంటి లక్షణాలను కలిగి ఉంది. మొత్తానికి ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

యమహా FZ బైక్స్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఈ కొత్త 2022 Yamaha FZ సిరీస్ యొక్క అన్ని మోడల్స్ ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. ఈ బైక్‌లన్నీ 149 సిసి, 2-వాల్వ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగిస్తాయి. ఇది గరిష్టంగా 12.2 బిహెచ్‌పి పవర్‌ మరియు 13.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటాయి.

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

ఈ కొత్త బైక్స్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ మోనో-షాక్ మరియు రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది, ఇవి డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ తో కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

ఇదిలా ఉండగా యమహా కంపెనీ కొన్ని నెలల క్రితం యమహా ఎఫ్‌జెడ్ శ్రేణికి కొత్త మోటార్‌సైకిల్‌ను జోడించింది. దీనిని యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ అని పిలుస్తారు. ఇది అత్యాధునిక నియో-రెట్రో స్టైలింగ్‌ను పొందింది. ఈ బైక్ స్టాండర్డ్ ఎఫ్‌జెడ్ కంటే 2 కిలోల తక్కువ బరువుతో ఉంటుంది. Yamaha ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రస్తుతం ఒకే వేరియంట్‌లో అందించబడుతుంది. దీని ధర రూ. 1,24,300 (ఎక్స్-షోరూమ్).

Yamaha నుంచి రానున్న అప్డేటెడ్ బైక్స్.. ఇందులో అప్డేట్స్ ఏమంటే?

యమహా కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న సుజుకి యాక్సెస్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్లలో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. అయితే, వీటి ధరల్లో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్ ఇప్పుడు 'మెటాలిక్ డార్క్ గ్రీనిష్ బ్లూ' మరియు 'మెటాలిక్ మ్యాట్ బ్లాక్' అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ స్కూటర్ కొత్త 'గ్లోసీ గ్రే' పెయింట్ స్కీమ్‌ పొందుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 3, 2022, 9:42 [IST]
English summary
2022 yamaha fz fz s and fz deluxe set to launch in new color options details
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+