2022 Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ యమహా ఇండియా (Yamaha India) కొత్త 2022 యమహా ఎఫ్‌జెడ్‌ఎస్ 25 (Yamaha FZS 25) ను కొత్త కలర్ ఆప్సన్స్ తీసుకువచ్చింది. ఇందులో ఒకటి 'మ్యాట్ కాపర్' కాగా మరొకటి 'మ్యాట్ బ్లాక్' కలర్స్. అయితే ప్రస్తుతం ఉన్న ఎఫ్‌జెడ్‌ 25 వేరియంట్ 'రేసింగ్ బ్లూ' మరియు 'మెటాలిక్ బ్లాక్' కలర్‌లలో మార్కెట్లో అందుబటులో ఉన్నాయి. FZ 25 మోడల్ శ్రేణి ప్రారంభ ధర రూ. 1,38,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

కంపెనీ యొక్క ఈ అప్డేటెడ్ బైక్ లో కేవలం కాస్మెటిక్ మార్పులు తప్పా, మెకానికల్ మార్పులు ఏమి జరగలేదు. కావున పవర్ అవుట్ఫుట్ మొదలైనవి దాదాపు దాని మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది చూడటానికి మునుపటి కంటే కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ 'ఈషిన్ చిహానా' మాట్లాడుతూ.. యామహా ఎఫ్‌జెడ్ 25 మోడల్ శ్రేణిని ప్రారంభించినప్పటి నుండి ప్రీమియం విభాగంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. మా కస్టమర్ల యొక్క అభిరుచికి తగిన విధంగా కంపెనీ ఇప్పుడు ఈ కలర్ స్కీమ్ లో తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు.

Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

ఈ కొత్త కలర్ స్కీమ్ కలిగిన మోటార్ సైకిల్స్ బిఎస్6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీనీకరించబడిన అదే 249 సిసి సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటాయి. ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 20.8 బిహెచ్‌పి పవర్‌ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 20.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

ఇక ఈ బైక్స్ లోని సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్‌ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. అదే విధంగా బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉపయోగించబడ్డాయి, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ యూనిట్ ఇందులో స్టాండర్డ్‌గా ఉంటుంది.

Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ, ​​సీటు హైట్ మరియు టైర్ పరిమాణం అన్నీ కూడా బిఎస్4 FZ25 మాదిరిగానే ఉంటాయి. యమహా బిఎస్4 మోడల్ భారతీయ మార్కెట్లో అద్భుతమైన విజయాన్ని పొందగలిగింది. కావున ఇప్పుడు ఈ బిఎస్ 6 కొత్త కలర్ ఆప్సన్స్ కలిగిన బైకులు కూడా తప్పకుండా మంచి ఆదరణ పొందతాయని ఆశిస్తున్నాము.

Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

Yamaha FZS 25 బైక్ బై-ఫంక్షనల్, క్లాస్ డి-టైప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ను హై మరియు లో బీమ్‌ల కోసం ఒకే యూనిట్‌తో పొందుతుంది, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఇందులో ఉంటాయి, అయితే Yamaha FZS 25 కూడా ఎత్తైన విండ్‌షీల్డ్ మరియు నకిల్ గార్డ్‌తో సహా చెప్పుకోదగ్గ అదనపు ఫీచర్ల కూడా ఇది పొందుతుంది.

Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

ఈ బైక్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం నెగటివ్ LCD డిస్‌ప్లే, అండర్‌బెల్లీ కౌల్ మరియు సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ స్విచ్‌ను కూడా పొందుతుంది. మొత్తానికి ఇది వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. రైడింగ్ సమయంలో మరింత అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

ఇదిలా ఉండగా 2022 ప్రారంభంతో, యమహా మోటార్ ఇండియా తన ద్విచక్ర వాహనాల శ్రేణిలోని కొన్ని మోడళ్ల కోసం ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది. ఇందులో Yamaha యొక్క 125 సిసి హైబ్రిడ్ స్కూటర్ మోడల్ శ్రేణి, Yamaha FZ 15 మోడల్ శ్రేణి, Yamaha YZF-R15 V3 మరియు Yamaha YZF-R15 V3 S వంటివి ఉన్నాయి. వీటిపైన కంపెనీ ఇప్పుడు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది.

Yamaha FZS 25 కొత్త కలర్‌లో.. ఇప్పుడు మరింత సూపర్ లుక్ గురూ..!!

కంపెనీ అందిస్తున్న అన్ని ఆఫర్‌లు 2022 జనవరి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఆఫర్‌లలో తక్కువ డౌన్‌పేమెంట్, తక్కువ వడ్డీ రేటు మరియు నిర్దిష్ట మోడళ్లపై క్యాష్ బ్యాక్ వంటి వాటిని పొందవచ్చు. యమహా R15 యొక్క నాల్గవ తరం మోడల్, YZF-R15 V4 కూడా భారత మార్కెట్లో అడుగుపెట్టింది.మొత్తానికి కంపెనీ ఈ Yamaha FZS 25 బైక్ ని కొత్త కలర్ ఆప్సన్స్ లో తీసుకువచ్చింది. అయితే ఈ కొత్త బైక్స్ దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
2022 yamaha fzs 25 launched in india with new colors price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X