రైడింగ్‌కి సిద్దమేనా.. కవాసకి మరో బైక్ లాంచ్ చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

జపనీస్ మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ 'కవాసకి' (Kawasaki) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన '2023 నింజా 650' (Ninja 650) బైక్ లాంచ్ చేసింది. ఇది కంపెనీ యొక్క మిడిల్ వెయిట్ స్పోర్ట్‌బైక్.

కవాసకి కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త లేటెస్ట్ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, మంచి డిజైన్ మరియు పర్ఫామెన్స్ అందించేలా రూపొందించబడింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కవాసకి మరో బైక్ లాంచ్ చేసింది

భారతీయ విఫణిలో అడుగుపెట్టిన 2023 కవాసకి నింజా 650 బైక్ ధర రూ. 7.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి అప్డేట్స్ పొంది ఉంటుంది, కావున దీని ధర మునుపటి మోడల్ కంటే రూ. 51,000 ఎక్కువ.

2023 కవాసకి నింజా 650 బైక్ కేవలం ఒకే కలర్ ఆప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది 'లైమ్ గ్రీన్' కలర్. ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా పొందుతుంది. డిజైన్ దాదాపు కవాసకి నింజా 400 మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో స్పోర్ట్స్ స్లీకర్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ అందుబాటువైలో ఉంటాయి.

కవాసకి మరో బైక్ లాంచ్ చేసింది

2023 కవాసకి నింజా 650 బైక్ 4.3 ఇంచెస్ TFT ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌ను కలిగి ఉంది. దీని ద్వారా రైడర్ బైక్ గురించి మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో కవాసకి రైడియాలజీ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా పొందవచ్చు. మొత్తం మీద ఈ కొత్త బైక్ మంచి రైడింగ్ అనుభూతిని అందించేలా తయారుచేయబడింది.

2023 నింజా 650 బైక్ లిక్విడ్-కూల్డ్ 649 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 68 బిహెచ్‌పి పవర్ మరియు 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది, అదే సమయంలో ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా అందుబాటులో ఉంటుంది.

కవాసకి మరో బైక్ లాంచ్ చేసింది

కొత్త నింజా 650 యొక్క సస్పెన్షన్ సెటప్ మునుపటిలాగే ఉంటుంది. ఈ బైక్ ట్రెల్లిస్ ఫ్రేమ్ సెటప్‌ను కొనసాగిస్తోంది. కావున ఈ బైక్ యొక్క ముందు వైపు 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు వైపు డ్యూయల్ పిస్టన్ కాలిపర్‌లతో 300 మిమీ పెటల్ డిస్క్‌ మరియు వెనుకవైపు సింగిల్ పిస్టన్ కాలిపర్‌లతో 220మీ పెటల్ డిస్క్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABS ని స్టాండర్డ్ గా పొందుతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కవాసకి విడుదల చేసిన 2023 నింజా 650 ఒకే కలర్ ఆప్సన్ లో విడుదలైనప్పటికీ మునుపటి మోడల్స్ కి ఏ మాత్రం తీసిపోని ఫీచర్స్ కలిగి ఉంది. అంతే కాకుండా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఇది కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే అవకాశం ఉంది. కావున ఈ బైక్ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని కథనాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 16, 2022, 10:32 [IST]
English summary
2023 kawasaki ninja 650 launched at rs 7 12 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+