స్కూపీ (Scoopy).. ఇదేమి కుక్కపిల్ల పేరు కాదు.. హోండా నుండి రాబోయే ఓ సరికొత్త స్కూటర్ పేరు!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (HMSI), భారత మార్కెట్లో మరో సరికొత్త స్కూటర్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ టూవీలర్ బ్రాండ్ నుండి రాబోయే కొత్త స్కూటర్ పేరు హోండా స్కూపీ (Honda Scoopy) అని తెలుస్తోంది. ఈ మేరకు హోండా తమ స్కూపీ స్కూటర్ పేరు మరియు డిజైన్ కోసం భారతదేశంలో పేటెంట్ ను కూడా దాఖలు చేసినట్లు సమాచారం. ఓ నివేదిక ప్రకారం, హోండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను గతేడాది మార్చిలోనే పూర్తి చేసింది.

స్కూపీ (Scoopy).. ఇదేమి కుక్కపిల్ల పేరు కాదు.. హోండా నుండి రాబోయే ఓ సరికొత్త స్కూటర్ పేరు!

హోండా సైలెంట్ గా గడచిన సంవత్సరంలోనే స్కూపీ స్కూటర్ డిజైన్ మరియు పేరు కోసం పేటెంట్ దాఖలు చేయగా, దానికి సంబంధించిన సమాచారం ఇప్పుడిప్పుడే వెలుగులోకి రావడం ప్రారంభించింది. భారత టూవీలర్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు, హోండా భారతదేశంలో అనేక రకాల కొత్త వాహనాలను విడుదల చేయాలని యోచిస్తోంది. హోండా నుండి ఇక్కడ విడుదల కాబోయే సరికొత్త వాహనాలలో స్కూపీ స్కూటర్ కూడా ఒకటి.

స్కూపీ (Scoopy).. ఇదేమి కుక్కపిల్ల పేరు కాదు.. హోండా నుండి రాబోయే ఓ సరికొత్త స్కూటర్ పేరు!

పేటెంట్ కోసం హోండా దాఖలు చేసిన డిజైన్ వివరాలను చూస్తే, ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ నుండి రాబోయే సరికొత్త స్కూపీ స్కూటర్, రెట్రో క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉండి, అధునాతన టెక్నాలజీ ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంటే, కంపెనీ ఈ స్కూటర్ ద్వారా అటు పాత తరాన్ని మరియు ఇటు కొత్త తరాన్ని గుర్తుకు తీసుకురావాలని యోచిస్తోంది. హోండా స్కూపీ ఓ ఆధునిక క్లాసిక్ స్కూటర్ గా ఉంటుంది మరియు ఈ స్కూటర్‌లో అనేక రెట్రో స్టైల్ ఫీచర్‌లు కూడా కనిపించనున్నాయి.

స్కూపీ (Scoopy).. ఇదేమి కుక్కపిల్ల పేరు కాదు.. హోండా నుండి రాబోయే ఓ సరికొత్త స్కూటర్ పేరు!

హోండా స్కూపీ ఖచ్చితంగా యువ తరానికి నచ్చుతుందని హోండా భావిస్తోంది. ప్రస్తుతం, హోండా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న యాక్టివా మరియు డియో స్కూటర్ల మాదిరిగానే హోండా స్కూపీ కూడా ఇక్కడి మార్కెట్లో ఓ మంచి సక్సెస్‌ఫుల్ స్కూటర్ కాగలదని కంపెనీ ధీమాగా ఉంది. వాస్తవానికి హోండా ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో స్కూపీ స్కూటర్ ను విక్రయిస్తోంది మరియు ఆయా మార్కెట్లలో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

స్కూపీ (Scoopy).. ఇదేమి కుక్కపిల్ల పేరు కాదు.. హోండా నుండి రాబోయే ఓ సరికొత్త స్కూటర్ పేరు!

హోండా దాఖలు చేసిన పేటెంట్ చిత్రంలో ఈ కొత్త స్కూపీ స్కూటర్ డిజైన్ కు సంబంధించిన కొన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఇది చూడటానికి గ్లోబల్ వెర్షన్ స్కూపీ మాదిరిగానే అనిపిస్తుంది. దీని ముందు భాగంలో కోడిగుడ్డు ఆకారంలో ఉండే పెద్ద హెడ్‌ల్యాంప్‌, అందులోనే ఇమిడి ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ మరియు హెడ్‌ల్యాంప్ కు పక్కగా ఇరువైపులా అమర్చిన టర్న్ ఇండికేటర్లు, ఎత్తులో ఉండే ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు పెద్ద ఫ్రంట్ వీల్‌తో ఇది ముందు వైపు నుండి ప్రస్తుత హోండా స్కూటర్ల కన్నా చాలా విభిన్నంగా కనిపిస్తుంది.

స్కూపీ (Scoopy).. ఇదేమి కుక్కపిల్ల పేరు కాదు.. హోండా నుండి రాబోయే ఓ సరికొత్త స్కూటర్ పేరు!

హోంజా స్కూపీ స్కూటర్‌ కు పూర్తిగా భిన్నమైన ఫ్రంట్ లుక్‌ ను అందించడం కోసం ఇందులో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, స్టెప్‌తో కూడిన విశాలమైన సీట్, బాగా ఎత్తులో ఉండే సైడ్ బాడీ ప్యానెల్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ఫ్రంట్ వీల్ కన్నా పెద్దగా ఉండే రియర్ వీల్, మిడ్-మౌంటెడ్ మోటార్, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు సింగిల్ షాక్ అబ్జార్వర్, ముందు డిస్క్ మరియు వెనుక డ్రమ్ బ్రేక్ వంటి ఇతర డిజైన్ మరియు మెకానికల్ అంశాలు కూడా హోండా స్కూపీ స్కూటర్ లో ఉన్నాయి.

స్కూపీ (Scoopy).. ఇదేమి కుక్కపిల్ల పేరు కాదు.. హోండా నుండి రాబోయే ఓ సరికొత్త స్కూటర్ పేరు!

స్కూపీ స్కూటర్ ని చూడగానే, ఇది యూరోపియన్ మార్కెట్లలో లభించే స్కూటర్ల డిజైన్ ను తలపిస్తుంది. గ్లోబల్ మార్కెట్ల కోసం హోండా విక్రయిస్తున్న స్కూపీ స్కూటర్ లో పెద్ద హెల్మెట్ ను స్టోర్ చేసుకునేంత అండర్ సీట్ స్టోరేజ్, స్మార్ట్ ఫోన్ వంటి గ్యాడ్జెట్లను స్టోర్ చేసుకోవడం కోసం ముందు వైపు యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఇంజన్ ఆన్, ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్‌లైట్, మల్టీ-ఫంక్షన్ హుక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ మరియు సీటు కింద 15.4 లీటర్ల స్టోరేజ్ స్పేస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్కూపీ (Scoopy).. ఇదేమి కుక్కపిల్ల పేరు కాదు.. హోండా నుండి రాబోయే ఓ సరికొత్త స్కూటర్ పేరు!

అదనంగా, హోండా స్కూపీ స్కూటర్ యాంటీ-థెఫ్ట్ అలారం మరియు భద్రతా సమస్యలకు ప్రతిస్పందించే సామర్థ్యంతో కూడిన స్మార్ట్ కీ వంటి సేఫ్టీ ఫీచర్లతో కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి, భారత మార్కెట్లో విడుదల కాబోయే హోండా స్కూపీ స్కూటర్ లో కూడా ఇదేరకమైన ఫీచర్లను మరియు టెక్నాలజీని ఆశించవచ్చు. ఇక ఇంజన్ విషయానికి వస్తే, స్కూప్ ఓ 110 సిసి ఇంజన్ తో అందుబాటులోకి రానుంది. ఇందులోని 109.51 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్ గరిష్టంగా 7.76 పిఎస్ పవర్ ను మరియు 9 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

స్కూపీ (Scoopy).. ఇదేమి కుక్కపిల్ల పేరు కాదు.. హోండా నుండి రాబోయే ఓ సరికొత్త స్కూటర్ పేరు!

హోండా ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న యాక్టివా మరియు డియో స్కూటర్లలో కూడా ఇదే రకమైన ఇంజన్ ను ఉపయోగిస్తోంది. హోండా స్కూపీ మెరుగైన బ్రేకింగ్ కోసం CBS (కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌) తో కూడా వచ్చే అవకాశం ఉంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ లో రైడర్ ఏదైనా ఒక బ్రేక్ అప్లయ్ చేసినా సరే, రెండు బ్రేకులు (ఫ్రంట్ అండ్ రియర్) ఏక కాలంలో పనిచేసి, బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ ఫీచర్ వలన స్టాపింగ్ డిస్టెన్స్ తగ్గి, అత్యవసర సమయాల్లో ప్రమాదాలను నివారించడంలో సహకరిస్తుంది.

Most Read Articles

English summary
A retro classic treat is coming to indian riders honda motorcycle india files patent for scoopy 110cc scooter details
Story first published: Saturday, April 2, 2022, 9:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X