పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) తమ సరికొత్త 2023 మోడల్ ఎఫ్‌జెడ్ 15 (2023 Yamaha FZ 15) మోటార్‌సైకిల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది యమహా నుండి వస్తున్న మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ కలిగిన బైక్. అంటే, కొత్త 2023 యమహా ఎఫ్‌జెడ్ 15 పెట్రోల్ మరియు ఇథనాల్ రెండు ఇంధనాలతో పనిచేస్తుంది.

పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

ప్రపంచ వ్యాప్తంగా వాహన కాలుష్యం మరియు గ్లోబల్ వార్మింగ్ పట్ల పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో, తయారీదారులు తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేసే ఇంజన్లు మరియు వాహనాల తయారీపై దృష్టి సారించాయి. భారతదేశంలో కూడా తయారీదారులు వీలైనంత త్వరగా ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్లకు మారాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే 2023 యమహా ఎఫ్‌జెడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

యమహా ముందుగా ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఎఫ్‌జెడ్ 15 మోడల్ ను బ్రెజిల్‌లో మార్కెట్లో విడుదల చేసింది. వచ్చే ఏడాది యమహా ఎఫ్‌జెడ్ 15 మోటార్‌సైకిల్ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ రూపంలో ఇది భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. బ్రెజిల్‌లో, ఈ మోటార్‌సైకిల్‌కి 'ఫేజర్ ఎఫ్‌జెడ్ 15' (Fazer FZ 15) అని పేరుతో పిలుస్తారు. అక్కడి మార్కెట్లో ఈ 2023 మోడల్ ధర 16,990 బ్రెజిలియన్ రియల్ (అంటే, మనదేశ కరెన్సీలో సుమారు 2.69 లక్షలు) గా ఉంటుంది. ఇందులోని రీఫైన్డ్ ఇంజన్ కారణంగా, దీని ధర కూడా భారీగా పెరిగింది.

పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

బ్రెజిల్ మార్కెట్లో విడుదలైన కొత్త 2023 Yamaha Fazer FZ 15 లోని పవర్‌ట్రెయిన్ చాలా ప్రత్యేకమైనది. ఇది ఈ మోడల్‌లో ఉపయోగించిన మునుపటి పవర్‌ట్రెయిన్‌ల మాదిరిగా కాకుండా, కొత్త 2023 యమహా ఎఫ్‌జెడ్ 15 లోని సరికొత్త ఇంజన్ పెట్రోల్ మరియు ఇథనాల్ రెండింటితోనూ పనిచేసేలా రూపొందించబడింది. అంటే, ఈ బైక్ ను పూర్తిగా పెట్రోల్ ఇంధనంతో కానీ లేదా పూర్తిగా ఇథనాల్ ఇంధనంతో కానీ నడపడం సాధ్యమవుతుంది.

పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

యమహా ఎఫ్‍‌జెడ్ 15 యొక్క 2023 మోడల్ లోని 149 సీసీ, సింగిల్-సిలిండర్, ఎస్ఓ‌హెచ్‌సి, 2-వాల్వ్ ఇంజన్ పెట్రోల్ ఇంధనతో 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 12.2 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 12.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలోని అవుట్‌గోయింగ్ మోడల్‌తో పెట్రోల్ ఇంధనంతో 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 12.4 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కాబట్టి, ఇండియన్ స్పెక్ మోడల్‌తో పోలిస్తే ఈ రెండు సంఖ్యలు కొంచెం తక్కువగా ఉంటాయి.

పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

ఇక ఇదే బైక్‌ను పూర్తిగా ఇథనాల్ ఇంధనంతో నడిపినట్లయితే, ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 12.4 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 13 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అంటే కొత్త 2023 యమహా ఎఫ్‌జెడ్ 15 మోటార్‌సైకిల్ ఇథనాల్‌తో మరింత శక్తివంతమైనదిగా ఉంటుందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

డిజైన్ విషయానికి వస్తే, కొత్త 2023 యమహా ఎఫ్‌జెడ్ 15 మోటార్‌సైకిల్ అవుట్‌గోయింగ్ యమహా ఎఫ్‌జెడ్ 25 మోటార్‌సైకిల్‌తో సమానంగా కనిపించే ఎవల్యూషనరీ డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఇది మొదటి చూపులోనే యమహా ఎఫ్‌జెడ్ లైనప్ మోటార్‌సైకిల్‌గా గుర్తించబడుతుంది. ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన కొత్త ప్రొజెక్టర్-టైప్ ఎల్ఈడి హెడ్‌లైట్‌ మరియు మజిక్యులక్ హెడ్‌ల్యాంప్ కౌల్‌ను కలిగి ఉంటుంది.

పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

ఫ్యూయెల్ ట్యాంక్ పై బలమైన క్రీజ్ లైన్స్, ఫ్యూయెల్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ మరియు వెనుక వైపు ఎత్తుగా ఉండే టెయిల్ సెక్షన్ డిజైన్ తో ఇది అన్ని వైపుల నుండి చాలా మజిక్యులర్ డిజైన్ ను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొత్త 2023 యమహా ఎఫ్‌జెడ్ 15 మోటార్‌సైకిల్ సింగిల్-పీస్ సీట్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. పాత మోడల్ తో పోలిస్తే, ఈ కొత్త మోటార్‌సైకిల్‌లోని టెయిల్ లైట్లను రీపొజిషన్ చేయబడినట్లుగా తెలుస్తోంది.

పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

హార్డ్‌వేర్ విషయానికొస్తే, కొత్త 2023 యమహా ఎఫ్‌జెడ్ 15 బైక్‌ను ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ యొక్క ప్రయత్నించిన మరియు పరీక్షించిన డైమండ్ ఫ్రేమ్ ఛాసిస్ పై నిర్మించారు. ఇందులో ముందు వైపు 41 మిమీ కన్వెన్షనల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక వైపు మోనో-షాక్‌ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. అలాగే, కొత్త 2023 యమహా ఎఫ్‌జెడ్ 15 మోటార్‌సైకిల్ లో ముందువైపు 100/80 R17 టైరు మరియు వెనుకవైపు 140/60 R17 టైరును కలిగి ఉంటుంది.

పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడిచే యమహా ఎఫ్‌జెడ్ 15 వచ్చేసింది.. 2023లో భారత్‌లో విడుదల!

బ్రేకింగ్ విషయానికి వస్తే, కొత్త 2023 యమహా ఎఫ్‌జెడ్ 15 మోటార్‌సైకిల్‌ లో ముందువైపు సింగిల్ 282 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు సింగిల్ 220 మిమీ డిస్క్ బ్రేకులు అమర్చబడి ఉంటాయి. ఇది సింగిల్-ఛానెల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ను సపోర్ట్ చేస్తుంది. ఇక చివరిగా కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, కొత్త 2023 యమహా ఎఫ్‌జెడ్ 15 మోటార్‌సైకిల్ రేసింగ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
All new 2023 yamaha fz 15 unveiled with felx fuel option details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X