రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 (Royal Enfield Scram 411) మోటార్‌సైకిల్ లాంచ్ డేట్ వెల్లడి!
భారతదేశపు క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield), మార్కెట్లో మరో కొత్త ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఐకానిక్ క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 (Royal Enfield Scram 411 ) ను కంపెనీ ఈ నెల 15వ తేదీన (మార్చ్ 15, 2022) కంపెనీ విడుదల చేయనుంది. ఈ మేరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారికంగా ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ ను కంపెనీ యొక్క పాపులర్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ ఆధారంగా చేసుకొని రూపొందించారు. కాబట్టి, ఈ రెండు మోడళ్లలో డిజైన్, ఇంజన్ మరియు పరికరాలలో కొన్ని సారూప్యతలు ఉండే అవకాశం ఉంది. ఇటీవల స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ యొక్క బ్రోచర్ ఒకటి ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఈ బ్రోచర్ ప్రకారం, ఇది చూడటానికి ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan) యొక్క టోన్-డౌన్ వెర్షన్ గా ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ఉపకరణాలు (యాక్ససరీస్) అయిన టీ-షర్టులు మరియు కీచైన్‌లు కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌ల వద్దకు వచ్చాయి. అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్ కూడా ఇప్పుడు కొన్ని ప్రధాన డీలర్‌షిప్ లకు చేరుకుంటోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 యొక్క లీకైన బ్రోచర్ చిత్రాల ను గమనిస్తే, కంపెనీ ఈ బైక్ ను ప్రస్తుత రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ఆధారంగా డిజైన్ చేసినట్లు స్ఫష్టంగా తెలుస్తోంది.

కాకపోతే, ఇది చూడటానికి స్క్రాంబ్లర్ స్టైల్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌పై ఆధారపడి రూపొందినప్పటికీ, కంపెనీ ఇందులో ఆ రెట్రో థీమ్‌ను అలానే ఉపయోగించడం కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. విండ్‌స్క్రీన్ మరియు ఫ్రంట్ ఫెండర్ లేకుండా ఉండే ఈ కొత్త స్క్రాంబ్లర్ స్టైల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ మొదటి చూపులో హిమాలయన్ మాదిరిగా కనిపిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 లో ముందు వైపు గుండ్రటి హెడ్‌ల్యాంప్, ఫోర్క్ గైటర్‌లు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ వంటి డిజైన్ లు కూడా హిమాలయన్ మోడల్ ను తలపిస్తాయి. అయితే, ఇందులోని హెడ్‌ల్యాంప్ యూనిట్ హిమాలయన్‌లోని ఫిక్స్‌డ్ యూనిట్‌లా కాకుండా స్టీరింగ్ తో పాటుగా కదిలే యూనిట్ గా ఉంటుంది. ఇక ఇందులోని ఇతర మార్పులను గమనిస్తే, ముందు వైపున చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ష్రౌడ్‌లు మరియు వెనుకవైపు సింపుల్-పీస్ గ్రాబ్ రైల్ ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌లోని డిజైనర్లు స్క్రామ్ 411ని రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ నుండి వేరు చేయడానికి ఇందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌తో పోల్చితే రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మరింత రోడ్-ఫోకస్డ్ వెర్షన్ అయినందున, కంపెనీ ఇందులో ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ 21 ఇంచ్ ఫ్రంట్ వీల్స్‌కు బదులుగా రోడ్-బయాస్డ్ మరియు ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ అయిన 19 ఇంచ్ ఫ్రంట్ వీల్స్‌ను జోడించింది. ఈ రెట్రో డిజైన్ థీమ్‌ను పూర్తి చేయడానికి, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ రెండు చివర్లలో స్పోక్డ్ వీల్స్‌ను ఉపయోగించింది.

ఈ బైక్ ను ఇటు ఆఫ్-రోడ్ మరియు అటు ఆన్-రోడ్ ప్రయోజనం కోసం ఉపయోగించేలా కంపెనీ ఇందులో రెండు చక్రాలపై డ్యూయల్ పర్పస్ టైర్‌లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ మరియు అల్యూమినియం సంప్ గార్డ్‌లను కలిగి ఉంటుంది. స్క్రామ్ 411 తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఇందులో హిమాలయన్ లో ఉపయోగించిన అదే 411సిసి ఇంజన్ ను ఈ కొత్త మోడల్ లో కూడా ఉపయోగించనుంది.

ప్రస్తుతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ లో 411 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్- ఎస్ఓహెచ్‌సి ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 24.3 బిహెచ్‌పి పవర్ ను మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అయితే, కొత్త స్క్రామ్ 411 లో దాని లైట్ వెయిట్ కారణంగా, అందులో ఉపయోగించే ఇదే ఇంజన్ యొక్క ఈ పవర్ మరియు టార్క్ గణాంకాలు స్వల్పంగా మారే అవకాశం ఉంది.

ఇక ఇందులోని మెకానికల్ అంశాలను గమనిస్తే, ముందువైపు 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ల ద్వారా బ్రేకింగ్ విధులు నిర్వహించబడే అవకాశం ఉంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ యొక్క రోడ్-ఫోకస్డ్ స్వభావానికి అనుగుణంగా దానిని సస్పెన్షన్ సెటప్ ను రీట్యూన్ చేసే అవకాశం ఉంది. స్క్రామ్ 411 బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ ఈ నెల 15వ తేదీన వెల్లడించే అవకాశం ఉంది. ఈ బైక్ కి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








