TVS తో బంధం ఏర్పరచుకున్న Amazon.. పక్కా ప్రణాళిక & నిర్దిష్టమైన వ్యూహం

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమైంది మరియు శరవేగంగా ముందుకు కూడా సాగుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా కొన్ని ఈ కామర్స్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగమిస్తోంది.

ఇటీవల అమెజాన్ ఈ కామర్స్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించడానికి టీవీఎస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కావున అమెజాన్ త్వరలోనే టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

TVS తో బంధం ఏర్పరచుకున్న చేసుకున్న Amazon.. పక్కా ప్రణాళిక

నివేదికల ప్రకారం, టీవీఎస్ కంపెనీతో అమెజాన్ కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెజాన్ రానున్న రోజుల్లో టీవీఎస్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించనుంది. అంటే కంపెనీ యొక్క టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమెజాన్ వినియోగించడానికి ముందడుగు వేస్తోంది.

అమెజాన్ కంపెనీ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే వినియోగించడానికి ప్రధానం కారణం కూడా ఒకటి ఉంది. అదేమిటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. కావున వినియోగదారుడు త్వరగా బ్యాటరీని మార్చుకుని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

tvs motor

అమెజాన్ కంపెనీ యొక్క కార్యకలాపాల వల్ల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కూడా తగిన విధంగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2025 నాటికి 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను మరియు 2030 నాటికి 1,00,000 ఎలక్ట్రిక్ వాహనాల వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుందని అమెజాన్ ఇండియా, కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్, సప్లై చైన్ మరియు గ్లోబల్ స్పెషాలిటీ ఫుల్‌ఫిల్‌మెంట్ డైరెక్టర్ అభినవ్ సింగ్ తెలిపారు.

బిజినెస్-టు-బిజినెస్ (B2B) సెగ్మెంట్ కోసం ఎలక్ట్రిక్ టూ-వీలర్ మరియు త్రీ-వీలర్స్ ఉపయోగించాలనే అమెజాన్ నిర్ణయం హర్షించదగ్గది. అమెజాన్ యొక్క కార్యకలాపాలకు టీవీఎస్ ఐక్యూబ్ తప్పకుండా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది తప్పకుండా వాతావరణ సమతుల్యతను కూడా కాపాడుతుంది.

ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది మొత్తం మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఐక్యూబ్ (iQube), ఐక్యూబ్ ఎస్ (iQube S) మరియు ఐక్యూబ్ ఎస్‌టి (iQube ST) వేరియంట్లు. ఇందులో ఐక్యూబ్ వేరియంట్ ధర రూ. 98,564 కాగా, ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ధర రూ. 1,08,690 గా ఉంది (అన్ని ధరలు ఆన్ రోడ్, ఢిల్లీ). అయితే ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్ మరియు ఐక్యూబ్ ఎస్ రెండు వేరియంట్లు కూడా ఒకే రకమైన 3.4 kwh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటాయి. ఇవి రెండూ పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 100 కిమీ రేంజ్ అందిస్తాయి. అయితే కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ లో పెద్ద 5.1 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 140 కిలోమీటర్ల రియల్ టైమ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

టీవీఎస్ తమ కొత్త 2022 మోడల్ ఐక్యూబ్ కోసం చార్జర్ ఆప్షన్లను కూడా అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ వేరియంట్లు రెండూ కూడా 650W మరియు 950W ఛార్జర్ లను సపోర్ట్ చేస్తాయి. ఇవి 650W ఛార్జర్‌తో చార్జ్ చేసినప్పుడు 4:30 గంటల వ్యవధిలో 0-100 శాతం ఛార్జ్ అవుతాయి. అదే 950W ఛార్జర్ తో కేవలం 2:30 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, November 10, 2022, 8:00 [IST]
English summary
Amazon india partnered with tvs motor to deploy evs for last mile deliveries details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+