ఆగని మంటలు.. తాజాగా తమిళనాడులో మరొక ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం..!

ఎలక్ట్రిక్ టూవీలర్ల అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఇటు ప్రభుత్వం అటు తయారీదారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, దేశంలో ఏదో ఒక చోట నిత్యం ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా, తమిళనాడులోని హోసూర్ నగరంలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో రైడర్ సురక్షితంగా తప్పించుకున్నప్పటికీ, అతడి ఒకినావా ఐ-ప్రైజ్ ప్లస్ (Okinawa i-Praise+ ) ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది.

ఆగని మంటలు.. తాజాగా తమిళనాడులో మరొక ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం..!

వివరాల్లోకి వెళితే, హోసూర్ నగర శివార్లలో ఉన్న జుజువాడికి చెందిన సతీష్ అనే 29 ఏళ్ల వ్యక్తి తన ఓకినావా ఐ-ప్రైజ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. కర్ణాటకలోని బెంగుళూరు నగరంలో పనిచేస్తున్న సతీష్, తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బెంగుళూరు వెళ్తుండగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. స్కూటర్ సీటు క్రింది భాగం నుండి పొగలు రావడాన్ని గుర్తించిన సతీష్, వెంటనే తన ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పక్కకు దూకేశాడు. అదృష్టవశాత్తు అతడికి ఎలాంటి గాయాలు కాలేదు.

ఆగని మంటలు.. తాజాగా తమిళనాడులో మరొక ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం..!

స్థానికుల సాయంతో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, సదరు స్కూటర్ మాత్రం పొగను చిమ్ముతూనే ఉంది. ఈ ప్రమాదంలో స్కూటర్ చాలా వరకూ కాలిపోయింది. సతీష్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేసి ఏడాది మాత్రమే అయింది. అప్పటి నుంచి తాను ఈ ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ ను నడుపుతున్నాడు. ఇంతవరకూ ఇలాంటి సమస్యను ఎదుర్కోలేదు, కానీ ఇప్పుడు హఠాత్తుగా ఇందులో మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికి ఈ మంటలు అంటుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.

బహుశా అతను తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎక్కువ సమయం ఉపయోగించడం వలన బ్యాటరీ లేదా అందులోని కంట్రోలర్ యూనిట్ వేడెక్కి మంటలు అంటుకొని ఉండొవచ్చని భావిస్తున్నారు. ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఉత్తర తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో, రాత్రి సమయంలో ఇంటి లోపల చార్జ్ చేస్తున్న ఓ ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో వాహనం ఛార్జింగ్‌లో ఉండగా మంటలు వ్యాపించాయి.

ఆగని మంటలు.. తాజాగా తమిళనాడులో మరొక ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం..!

దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో స్కూటర్ యజమాని మరియు అతని కుమార్తె ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కుమార్తె కాలేజీకి వెళ్లి రావడానికి వీలుగా ఉండేందుకు అతను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేశాడు. అయితే, అగ్ని ప్రమాదం అర్థరాత్రి సమయంలో జరగడం మరియు ఆ సమయంలో వారిద్దరూ గాఢ నిద్రలో ఉండటంతో, ఊపిరి ఆడక వారు మరణించారు. అయితే, ఈ ప్రమాదానికి కొత్త ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ కారణమా లేక ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఆగని మంటలు.. తాజాగా తమిళనాడులో మరొక ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం..!

గత రెండు నెలల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 10 వరకూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఓకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి ఇది రెండవ అధికారిక సంఘటన. గతంలో ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఈవీ, జితేంద్ర వీలతో పాటుగా మరికొన్ని ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలకు చెందిన అగ్ని ప్రమాదాలలో పలువురు మరణించగా, కొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రమాద ఘటనలు నమోదయ్యాయి. ఇటీవల తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో ప్యూర్ ఈవీ బ్యాటరీ పేలిన కారణంగా ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు.

ఆగని మంటలు.. తాజాగా తమిళనాడులో మరొక ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం..!

విజయవాడలో ఓ కార్బెట్ 14 ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి ఓ వ్యక్తి చనిపోగా, అతడి భార్య మరియు కుమార్తెలు గాయపడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు అంటుకోవడానికి అసలు కారణం తెలియనప్పటికీ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలను తాకడంతో ఎండ వేడి గరిష్టస్థాయికి చేరుకుంటోంది. ఇలాంటి అధిక వేడి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎండలో పార్క్ చేయడం లేదా ఎండలో చార్జింగ్ చేయడం కూడా మంచిది కాదు. వేడి వాతావరణం కారణంగా బ్యాటరీ ప్యాక్‌లు కూడా వేడెక్కి మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉంది.

వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో, ఒకినావా సంస్థ తాజాగా తమ వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ మొత్తం 3,215 యూనిట్ల ప్రైజ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. ఒకినావా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్ల నుంచి రీకాల్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ ఓసారి క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఏవైనా లోపాలు ఉంటే సరిచేయనుంది. ఈ రీకాల్ పూర్తిగా స్వచ్ఛందమైనది మరియు రీకాల్ కోసం కంపెనీ కస్టమర్‌లపై ఎలాంటి ఒత్తిడి చేయదు. ఒకినావా ఈ రీకాల్ గురించి తమ కస్టమర్లకు తెలియజేస్తోంది.

ఆగని మంటలు.. తాజాగా తమిళనాడులో మరొక ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం..!

ఆసక్తిగల కస్టమర్లు ఒకినావా అధీకృత సర్వీస్ సెంటరును సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ రీకాల్‌లో భాగంగా, కంపెనీ సర్వీస్ సెంటర్లకు కస్టమర్లు తీసుకువచ్చే వాహనాలను తనిఖీ చేసి, స్కూటర్ ‌లో మంటలు రావడానికి గల కారణాన్ని అన్వేషిస్తుంది. ఒకినావా ప్రైస్ ప్రో రీకాల్ ప్రోగ్రామ్‌ లో భాగంగా, కంపెనీ ఈ స్కూటర్లలో ఉపయోగించిన బ్యాటరీ, కనెక్టర్లు మరియు వైరింగ్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ భాగాలను పరిశీలిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రైస్ ప్రో కస్టమర్లకు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా నిర్వహించబడుతుంది. రీకాల్ కోసం కస్టమర్ ఒకినావాలోని సమీప డీలర్‌షిప్ లేదా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.

Most Read Articles

English summary
Another ev fire accident reported in tamil nadu this time okinawa i praise plus catches fire on the road
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X