ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విజయవాడలో కూడా లభ్యం.. అడ్రస్ ఎక్కడంటే..?

బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఇప్పుడు, తమ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విజయవాడ వాసులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా, ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా, ఏథర్ ఎనర్జీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం విజయవాడలోని కెపి నగర్‌లో ఉన్న చంద్రలోక్ కాంప్లెక్స్‌లో తమ కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విజయవాడలో కూడా లభ్యం.. అడ్రస్ ఎక్కడంటే..?

ఏథర్ స్పేస్ (Ather Space) అనే కాన్సెప్ట్‌తో కంపెనీ ప్రారంభిస్తున్న ఈ బ్రాండ్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు, వినియోగదారులకు ఓ ప్రత్యేకమైన యాజమాన్య అనుభవాన్ని అందిస్తాయని, పూర్తి డిజిటల్ రూపంలో కాంటాక్ట్‌లెస్ సేవలు అందిస్తాయని కంపెనీ తెలిపింది. విజయవాడలో ప్రారంభించిన ఈ షోరూమ్‌లో ఏథర్ 450 ఎక్స్ మరియు ఏథర్ 450 ప్లస్ రెండు స్కూటర్లను డిస్‌ప్లేలో ఉంచింది. అంతేకాకుండా, ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కంపెనీ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ సేవలను కూడా అందిస్తోంది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విజయవాడలో కూడా లభ్యం.. అడ్రస్ ఎక్కడంటే..?

ఏథర్ ఎనర్జీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 30 అనుభవ కేంద్రాలు (ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను) ప్రారంభించగా, తాజాగా విజయవాడలో ప్రారంభించినది 31వది అవుతుంది. ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లలో కస్టమర్‌లు ఈ బ్రాండ్ అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ డీలర్‌షిప్‌లో కంపెనీ ఛార్జింగ్ పాయింట్‌ను కూడా ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఛార్జింగ్ మౌళిక సదుపాయాలను మెరుగుపరచడంలో పనిచేస్తున్న కొన్ని కంపెనీలలో ఏథర్ ఎనర్జీ కూడా ఒకటి.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విజయవాడలో కూడా లభ్యం.. అడ్రస్ ఎక్కడంటే..?

ఈ షోరూమ్ లను సందర్శించడం ద్వారా, వినియోగదారులు ఏథర్ వాహనాలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఇక్కడ వాహనం యొక్క అన్ని భాగాలను విడివిడిగా చూపించి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. కస్టమర్లు ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించే ముందు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా స్కూటర్ టెస్ట్ రైడ్‌ లను కూడా బుక్ చేసుకోవచ్చు. కస్టమర్‌లకు ఈ స్కూటర్లకు గురించి ఏవైనా సందేహాలు ఉంటే ఏథర్ డీలర్‌షిప్‌ ద్వారా వాటిని నివృత్తి చేసుకోవచ్చు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విజయవాడలో కూడా లభ్యం.. అడ్రస్ ఎక్కడంటే..?

నగరంలో ఏథర్ ఎనర్జీ ఏర్పాటు చేసే ఛార్జింగ్ గ్రిడ్‌లలో కస్టమర్లు ఉచితంగా ఛార్జింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. సమాచారం ప్రకారం, ఏథర్ ఎనర్జీ తన ఛార్జింగ్ గ్రిడ్‌లో ఫ్రీ ఛార్జింగ్ సౌకర్యాన్ని జూన్ 30, 2022 వరకు పొడిగించింది. కంపెనీ ఈ సదుపాయాన్ని 2021 సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది. ఇది అన్ని బ్రాండ్ స్కూటర్లకు వర్తిస్తుందని సమాచారం. అలాగే, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కంపెనీ అందిస్తున్న ఫ్రీ కనెక్టివిటీ సౌకర్యాన్ని మే 2022 వరకూ పొడిగించింది, ఇది నవంబర్ 15 న ప్రారంభించబడింది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విజయవాడలో కూడా లభ్యం.. అడ్రస్ ఎక్కడంటే..?

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 450ఎక్స్ మరియు 450 ప్లస్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1,52,401 కాగా, ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1,33,391 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, విజయవాడ)గా ఉంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, నాగోల్, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో ఏథర్ ఎనర్జీ షోరూమ్‌లు ఉన్నాయి.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విజయవాడలో కూడా లభ్యం.. అడ్రస్ ఎక్కడంటే..?

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ మరియు 2.9 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్ ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విజయవాడలో కూడా లభ్యం.. అడ్రస్ ఎక్కడంటే..?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడ్ మరియు ఎకో అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి ఈ టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటుంది. ఎకో మోడ్‌లో, ఇది 85 కిమీ మరియు రైడ్ మోడ్‌లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు విజయవాడలో కూడా లభ్యం.. అడ్రస్ ఎక్కడంటే..?

ఏథర్ ఎనర్జీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోల ఉపయోగించే బ్యాటరీపై మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 3 ఏళ్ల సమగ్ర వారంటీని అందిస్తోంది. ఈ స్కూటర్ లో 4G నెట్‌వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. రైడర్ తన స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా స్కూటర్‌కు రిమోట్ గా కనెక్ట్ కావచ్చు మరియు దాని సాయంతోనే స్కూటర్‌ను మరియు అందులోని అనేక ఫీచర్లను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. తెలుగులో లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 29, 2022, 16:47 [IST]
English summary
Ather electric scooters now available in vijayawada new dealership opened
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+