Just In
- 10 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 11 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 15 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 19 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు నాగ్‌పూర్‌లో కూడా లభ్యం.. 450ఎక్స్ స్పెషాలిటీ ఏంటంటే..?
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఇప్పుడు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను నాగ్‌పూర్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కంపెనీ మహారాష్ట్రలో తమ నాల్గవ షోరూమ్‌ను ప్రారంభించింది. నాగ్‌పూర్‌లోని ధరంపేత్ ప్రాంతంలో కంపెనీ ఈ కొత్త షోరూమ్ ని ప్రారంభించింది. గత కొంత కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఏథర్ ఎనర్జీ తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను నిరంతరం విస్తరిస్తోంది.

తాజాగా, నాగ్‌పూర్ లో ప్రారంభించిన కొత్త ఏథర్ షోరూమ్ 2022లో ఏథర్ ప్రారంభించి మొదటి షోరూమ్, కంపెనీ గత సంవత్సరం అనేక షోరూమ్‌లను ప్రారంభించిన విషయం తెలిసినదే. ఏథర్ స్పేస్ (Ather Space) అనే పేరుతో ప్రారంభించబడిన ఈ షోరూమ్ లు వినియోగదారులకు ఓ ప్రత్యేకమైన యాజమాన్య అనుభవాన్ని అందిస్తాయని, పూర్తి డిజిటల్ రూపంలో కాంటాక్ట్‌లెస్ సేవలు అందిస్తాయని కంపెనీ తెలిపింది.

ఈ షోరూమ్ లను సందర్శించడం ద్వారా, వినియోగదారులు వాహనానికి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఇక్కడ వాహనం యొక్క అన్ని భాగాలను విడివిడిగా చూపించి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. కస్టమర్లు ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను సందర్శించే ముందు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా స్కూటర్ టెస్ట్ రైడ్ లను కూడా బుక్ చేసుకోవచ్చు.

ఏథర్ ఎనర్జీ గడచిన సంవత్సరం తన నెట్వర్క్ పరిధిని గణనీయంగా విస్తరించింది. ఇందులో భాగంగా ముంబై, పూణే, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, తిరుచ్చి, విశాఖపట్నం, జైపూర్, కోజికోడ్, ఇండోర్ మరియు నాసిక్‌లలో షోరూమ్‌లను ప్రారంభించింది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కూడా కంపెనీ నిరంతరం నిమగ్నమై ఉంది. ఇటీవల కర్ణాటకలోని మైసూర్లో కొత్త షోరూమ్ ప్రారంభించబడింది, గత కొన్ని నెలలుగా కంపెనీ నిరంతరం కొత్త షోరూమ్‌లను ప్రారంభిస్తూ వస్తోంది.

నగరంలోని ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రిక్ వాహనాన్ని సజావుగా వినియోగించుకునేందుకు వీలుగా భవిష్యత్తులో నగరంలో మరిన్ని అదనపు చార్జింగ్ పాయింట్లను ఏథర్ ఎనర్జీ ఏర్పాటు చేయనుంది. అదే సమయంలో, Ather Energy మీ అపార్ట్మెంట్ మరియు భవన సముదాయాల్లో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంలో కూడా సహాయపడుతుంది. ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ స్టేషన్లను ప్రారంభించింది.

అంతేకాకుండా, ఏథర్ ఎనర్జీ తన కస్టమర్లకు కంపెనీ ఏర్పాటు చేసే ఛార్జింగ్ గ్రిడ్‌లో ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. సమాచారం ప్రకారం, ఏథర్ ఎనర్జీ తన ఛార్జింగ్ గ్రిడ్‌లో ఫ్రీ ఛార్జింగ్ సౌకర్యాన్ని 2022 జూన్ 30 వరకు పొడిగించింది. కంపెనీ ఈ సదుపాయాన్ని 2021 సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది. అంతే కాకుండా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఫ్రీ కనెక్టివిటీ సౌకర్యం 2022 మే వరకు పొడిగించింది. ఇది నవంబర్ 15 న ప్రారంభించబడింది.

భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనే కాకుండా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు ఇటీవల ప్రకటించబడిన కంపెనీలలో ఏథర్ ఎనర్జీ కూడా ఒకటి. కంపెనీ ప్రతి నెలా కనీసం 45 ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్లను జోడిస్తూ వస్తోంది. దీనితో పాటుగా కంపెనీ ఓ కొత్త ప్లాంట్‌ను కూడా ప్రారంభించబోతోంది. ఏథర్ ఎనర్జీ భారతదేశంలోని తమిళనాడులోని హోసూర్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. కంపెనీ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్తగా రెండవ ప్లాంట్‌ను ప్రారంభించనుంది.

ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు తర్వాత, ఏథర్ ఎనర్జీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 4,00,000 యూనిట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 450ఎక్స్ మరియు 450 ప్లస్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1,44,500 కాగా, ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1,25,490 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 2.9 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్పి పవర్ ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడ్ మరియు ఎకో అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది.

రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి ఈ టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటుంది. ఎకో మోడ్‌లో, ఇది 85 కిమీ మరియు రైడ్ మోడ్‌లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లోని బ్యాటరీని ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 3 ఏళ్ల సమగ్ర వారంటీని అందిస్తోంది. ఈ స్కూటర్ లో 4G నెట్వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని సాయంతోనే స్కూటర్‌ను మరియు అందులోని ఫీచర్లను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు.