రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) ఉత్పత్తిలో ఒక కొత్త మైలురాయిని సాధించింది. ఇటీవల కంపెనీ తన హోసూర్ ప్లాంట్ నుంచి 25,000 వ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన వైట్ ఏథర్ 450ఎక్స్ ఫోటోలు తన సోషల్ మీడియా హ్యాండిల్‌ షేర్ చేయబడ్డాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

భారతీయ మార్కెట్లో 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) యొక్క Ather 450X ఉత్పత్తి 2020 జనవరి 28 న ప్రారంభమైంది. కంపెనీ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికి ఈ కొత్త రికార్డ్ సాధించింది. దీనికి కంపెనీకి దాదాపు రెండు సంవత్సరాల కాలం పట్టింది. కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో కంపెనీ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఉత్పత్తిలో 25,000 మైలురాయిని చేరుకుంది.

రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

2020 ఏథర్ ఎనర్జీ సంవత్సరంలో తన ఏథర్ 450X డెలివరీలను ప్రారంభించింది. ఆ తరువాత కాలంలో ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ కి ఎక్కువ డిమాండ్ ఏర్పడటంతో కంపెనీ యొక్క హోసూర్ ప్లాంట్ లో ఉత్పత్తిని పెంచింది. ఆ తరువాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఉత్పత్తి చాలా వేగవంతమైంది.

రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

దేశంలోని కొన్ని నగరాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీలను అందిస్తున్నాయి. కావున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధరలో చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది. సబ్సిడీల అనంతరం ముంబై నగరంలో, ఏథరి 450 ప్లస్ ధర రూ. 1.09 లక్షలుగా ఉంటే, ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ మరియు 2.9 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్ ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

అంతే కాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడ్ మరియు ఎకో అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి ఈ టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటుంది. ఎకో మోడ్‌లో, ఇది 85 కిమీ మరియు రైడ్ మోడ్‌లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది.

రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

ఇదిలా ఉండగా గత కొంత కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఏథర్ ఎనర్జీ తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను నిరంతరం విస్తరిస్తోంది. తాజాగా, నాగ్‌పూర్ లో ప్రారంభించిన కొత్త ఏథర్ షోరూమ్ 2022లో ఏథర్ ప్రారంభించి మొదటి షోరూమ్, కంపెనీ గత సంవత్సరం అనేక షోరూమ్‌లను ప్రారంభించిన విషయం తెలిసినదే. ఏథర్ స్పేస్ (Ather Space) అనే పేరుతో ప్రారంభించబడిన ఈ షోరూమ్ లు వినియోగదారులకు ఓ ప్రత్యేకమైన యాజమాన్య అనుభవాన్ని అందిస్తాయని, పూర్తి డిజిటల్ రూపంలో కాంటాక్ట్‌లెస్ సేవలు అందిస్తాయని కంపెనీ తెలిపింది.

రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

ఏథర్ ఎనర్జీ గడచిన సంవత్సరం తన నెట్‌వర్క్ పరిధిని గణనీయంగా విస్తరించింది. ఇందులో భాగంగా ముంబై, పూణే, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, తిరుచ్చి, విశాఖపట్నం, జైపూర్, కోజికోడ్, ఇండోర్ మరియు నాసిక్‌లలో షోరూమ్‌లను ప్రారంభించింది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కూడా కంపెనీ నిరంతరం నిమగ్నమై ఉంది. ఇటీవల కర్ణాటకలోని మైసూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించబడింది, గత కొన్ని నెలలుగా కంపెనీ నిరంతరం కొత్త షోరూమ్‌లను ప్రారంభిస్తూ వస్తోంది.

రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

అంతే కాకూండా ఇటీవల కంపెనీ కర్నాటకలో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటు కోసం గత నెలలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో భాగంగానే దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్టేషన్స్ అన్ని అందుబాటులోకి వస్తే, ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఛార్జింగ్ సమస్యలు తీరిపోతాయి.

రోజురోజుకి పరుగుతున్న డిమాండ్.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న Ather Energy

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వినియోగించక పోవడానికి ప్రధాన కారణం కావాల్సిన సంఖ్యలో మౌలిక సదుపాయాలు అందుబటులో లేకపోవడమే, ఈ సమస్యను పరిష్కరించాడనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటుచేసుకుంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఎలక్ట్రిక్ వాహన వినియోగం కూడా పెరుగుతుంది.

Most Read Articles

English summary
Ather energy rolled out 25000th electric scooter from hosur plant details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X