అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతూ.. తన విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిలో ఒక కొత్త రికార్డ్ నెలకొల్పింది.

Recommended Video

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

ఇంతకీ కంపెనీ ఇప్పటికి ఎన్ని స్కూటర్లను ఉత్పత్తి చేసింది, అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, తన హోసూరు తయారీ కేంద్రంలో 50,000 వ ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దీనికి సంబందించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది నిజంగా కంపెనీ సాధించిన ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పాలి.

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

నిజానికి ఏథర్ ఎనర్జీ తన హోసూర్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని 2020 జనవరి నెలలో ప్రారంభించింది. అయితే 2022 మార్చి నెల నాటికి 25,000 యూనిట్ల బుకింగ్స్ పొందింది. అయితే ఇప్పటికి, అంటే 6 నెలల కాలంలో మరో 25,000 యూనిట్లను తాయారు చేసి మొత్తానికి 50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది.

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో రెండు స్కూటర్లను విక్రయిస్తోంది. అవి ఒకటి 450 ప్లస్ కాగా, మరొకటి 450X ఎలక్ట్రిక్ స్కూటర్లు. అయితే కంపెనీ ఇటీవల Gen 3 మోడల్‌లను కూడా అవికరించింది. కంపెనీ యొక్క ఈ స్కూటర్లను మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే ఈ స్కూటర్లు మంచి స్పందన పొందుతున్నాయి.

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

మార్కెట్లో ఏథర్ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా విక్రయాలు పెరుగుతున్నాయి, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తోంది. ఈ కారణంగానే ఇప్పటికి 50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది.

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

ఇక అమ్మకాల విషయానికి వస్తే కంపెనీ 2022 మే నెలలో 3807 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. కాగా ప్రతి నెలా కూడా సగటున మూడువేల స్కూటర్లను విక్రయిస్తున్నట్లు కంపెనీ నివేదికలు చెబుతున్నాయి. ఈ అమ్మకాలు రానున్న రోజుల్లో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం ఒక సంవత్సరానికి 1.2 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ని కలిగి ఉంది. అక్కడ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. అయితే రానున్న రోజుల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి మరో కొత్త ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీనికోసం కంపెనీ 100 ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నంలో ఉంది.

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

కొత్త ప్లాంట్ కోసం ఏథర్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ మరియు కర్ణాటక ప్రభుత్వాలతో చర్చలు కొనసాగిస్తోంది. కొత్త ప్లాంట్ పూర్తయిన తరువాత ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 15 లక్షల యూనిట్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ మంచి విక్రయాలు జరుపుతోంది, మరియు బుకింగ్స్ కూడా మంచి సంఖ్యలోనే పొందుతుంది.

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం 32 నగరాల్లో 38 ఎక్స్పీరియన్స్ సెంటర్లను కలిగి ఉంది. అయితే 2023 చివరి నాటికి 100 నగరాల్లో 150 కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాకూండా ప్రస్తుతం ఉన్న రెండు మోడళ్లను నాలుగు మోడళ్లకు విస్తరించాలని కూడా యోచిస్తోంది.

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

ఇదిలా ఉండగా ఇటీవల ఏథర్ ఎనర్జీ (Ather Energy), తన 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త తరం మోడళ్లను విడుదల చేసింది. ఏథర్ 450ఎక్స్ (Ather 450X) మరియు ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) మోడళ్లలో కంపెనీ మూడవ తరం (Gen 3) మోడళ్లను పరిచయం చేసింది. ఇందులో Gen 3 ప్రారంభ ప్రారంభ ధర రూ. 116,101 (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ప్రారంభ రూ. 137,612 (ఎక్స్-షోరూమ్).

అప్పుడే 50,000 యూనిట్లు చేరుకున్న ఏథర్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్లను విడుదల చేస్తున్నాయి. అయితే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లలతో పోలిస్తే దేశీయ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి నమ్మికైనవిగా ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా కంపెనీ ఇదే అమ్మకాలతో ముందుకు పోతుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Wednesday, August 31, 2022, 10:36 [IST]
English summary
Ather energy rolls out 50000th electric scooter details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+