ఉత్పత్తి పెరుగుదలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న Ather Energy: వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొంది ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరుపుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy). ఏథర్ ఎనర్జీ ఫదేశీయ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించుకోవడానికి అనునిత్యం కొత్త కొత్త ప్రణాళికలను వేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక కొత్త ప్రణాళికను వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం సంవత్సరానికి 4 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2025 నాటికి 10 లక్షల యూనిట్లకు పెంచాలనుకుంటున్నట్లు యోచిస్తోంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కావున డిమాండ్ ని బట్టి సరఫరా కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సరఫరాకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం కంపెనీకి ఎంతైనా ఉంది. కావున కంపెనీ ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తోంది.

ఏథర్ ఎనర్జీ కంపెనీ 2013 లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 160 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది. గత సంవత్సరంలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరిగిందని కంపెనీ తెలిపింది. మునుపటికంటే కూడా ఇప్పుడు ఐదు రెట్లు డిమాండ్ పెరిగింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరగడం. ఇది సామాన్య ప్రజలమీద ఎక్కువ భారాన్ని మోపుతున్న కారణంగా వారు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకంటే కూడా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది.

గత ఏడాది భారతదేశంలో విక్రయించబడిన మొత్తం 1.45 మిలియన్ మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కేవలం 1 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే చమురు దిగుమతులను తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నందున 2030 నాటికి ఇది 40 శాతానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ కారణంగాగానే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపైన భారీ రాయితీలను మరియు డిస్కౌంట్ వంటి వాటిని అందిస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, ఏథర్ ఎనర్జీ తమిళనాడులోని హోసూర్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 4 లక్షల యూనిట్లుగా ఉంటుంది. ప్రస్తుతం ఒకే ప్లాంట్ ద్వారా ఏడాదికి 1.20 లక్షల యూనిట్ల స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది.

ఏథర్ ఎనర్జీ భారతీయ మార్కెట్లో ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. అవి ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450 ప్లస్. ఏథర్ 450ఎక్స్ కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ స్కూటర్. ఇది 2.9 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఈ మోటార్ గరిష్టంగా 8 bhp శక్తిని మరియు 26 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలో గంటకు 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 116 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇది రెండు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి రైడ్ మరియు ఎకో మోడ్. ఎకో మోడ్‌లో, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 85 కి.మీ పరిధిని మరియు రైడ్ మోడ్‌లో ఇది 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అంతే కాకూండా ఏథర్ ఎనర్జీ భారతదేశంలో తన విక్రయాలను మరింత పెంచుకోవడానికి దేశంలోని ప్రధాన నగరాల్లో తన రిటైల్ స్టోర్లను విస్తరిస్తోంది. ప్రస్తతం మొత్తం 21 నగరాల్లో 25 రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. ఈ సంఖ్య 2023 మార్చి నాటికి మొత్తం 100 నగరాల్లో 150 రిటైల్ స్టోర్లకు విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

కంపెనీ ఇప్పటివరకు దేశంలోని 22 కంటే ఎక్కువ నగరాల్లో మరియు 220కి పైగా స్థానాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. అదే సమయంలో, 2022 నాటికి 500 కొత్త ప్రదేశాలలో ఛార్జింగ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికపై పనిచేస్తోంది. కావున ఇది కూడా చాలా వేగంగానే అందుబాటులోకి వచ్చేస్తుంది.
ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్య కూడా ఉండే అవకాశం ఉండదు. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే కాకుండా కార్లు వంటి వాటికీ కూడా అనుకూలంగా ఉంటాయి. మొత్తానికి కంపెనీ యొక్క ఈ ప్రణాళిక అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంతో కాలం లేదు.


Click it and Unblock the Notifications








