ఏథర్ 450ఎక్స్ పై ఎక్కువ దూరం రైడ్ చేయాలా..? అయితే వెయిట్ చేయండి, లాంగ్ రేంజ్ వేరియంట్ వస్తోంది!

బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy), దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ (Ather 450X) లో ఓలాంగ్-రేంజ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏథర్ ఎనర్జీ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కూడిన రెండు వేరియంట్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తాజాగా లీకైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ పత్రాల ప్రకారం, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంగ్-రేంజ్ వెర్షన్ ప్రస్తుత మోడల్‌కు శక్తినిచ్చే 2.9kWh బ్యాటరీ ప్యాక్‌కు బదులుగా పెద్ద 3.66kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

ఏథర్ 450ఎక్స్ పై ఎక్కువ దూరం రైడ్ చేయాలా..? అయితే వెయిట్ చేయండి, లాంగ్ రేంజ్ వేరియంట్ వస్తోంది!

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొత్త లాంగ్-రేంజ్ వెర్షన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని దిగువ వేరియంట్‌లో అదనపు పనితీరును అందించే వార్ప్ మోడ్ వంటి కొన్ని ఫీచర్లను కోల్పోయే అవకాశం ఉంది. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మరింత ప్రీమియం వేరియంట్ 5 రైడ్ మోడ్‌లను కలిగి ఉండనుంది. వీటిలో ఎకో మోడ్, స్మార్ట్ ఎకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్ మరియు వార్ప్ మోడ్స్ ఉన్నాయి. ఈ వేరియంట్ పూర్తి ఛార్జీపై గరిష్టంగా 146 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది.

ఏథర్ 450ఎక్స్ పై ఎక్కువ దూరం రైడ్ చేయాలా..? అయితే వెయిట్ చేయండి, లాంగ్ రేంజ్ వేరియంట్ వస్తోంది!

కాగా, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రాబోయే లాంగ్ వెర్షన్ లోని దిగువ వేరియంట్‌లో కేవలం 4 రైడ్ మోడ్‌లను మాత్రమే కలిగి ఉండనుంది. వీటిలో ఎకో మోడ్, స్మార్ట్ ఎకో మోడ్, రైడ్ మోడ్ మరియు స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. ఈ వేరియంట్ యొక్క క్లెయిమ్ రేంజ్ 108 కిలోమీటర్లుగా రేట్ చేయబడింది. అలాగే, ఈ కొత్త వేరియంట్లలోని కొత్త బ్యాటరీ ప్యాక్ నికెల్ కోబాల్ట్-ఆధారిత లిథియం-అయాన్ యూనిట్ 19 కిలోల బరువు కలిగి ఉంటుందని మరియు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6.4kW పీక్ పవర్‌తో 3-ఫేజ్ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారుతో పనిచేస్తుందని లీక్ అయిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.

ఏథర్ 450ఎక్స్ పై ఎక్కువ దూరం రైడ్ చేయాలా..? అయితే వెయిట్ చేయండి, లాంగ్ రేంజ్ వేరియంట్ వస్తోంది!

రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్థూల వాహన బరువు (GVW) 243 కేజీలుగా ఉంటుంది మరియు దీని పొడవు 1,837 మిమీ, వెడల్పు 739 మిమీ మరియు ఎత్తు 1,114 మిమీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వీల్‌బేస్ 1,296 మిమీగా ఉంటుంది. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఏథర్ 450ఎక్స్ (Ather 450X) మరియు ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) మోడళ్లు ఉన్నాయి. ఇందులో కొత్తగా మరో వేరియంట్‌లను ప్రారంభించడంతో కంపెనీ దాని ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో 4 ఉత్పత్తులను కలిగి ఉంటుంది, ఇది వినియోగదారులకు మరిన్ని ఎక్కువ ఆప్షన్లను అందిస్తుంది.

ఏథర్ 450ఎక్స్ పై ఎక్కువ దూరం రైడ్ చేయాలా..? అయితే వెయిట్ చేయండి, లాంగ్ రేంజ్ వేరియంట్ వస్తోంది!

ప్రస్తుత మోడళ్లలో, ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ ప్రీమియం వేరియంట్ కాగా, ఏథర్ 450 ప్లస్ బేస్ వేరియంట్. ఈ బేస్ వేరియంట్ 22Nm పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేసే 5.4 kW ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఈ మోటార్ 2.4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇకపోతే, 450ఎక్స్ ప్రీమియం వేరియంట్ 26Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన 6kW ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగిస్తుంది మరియు ఇది పెద్ద 2.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.

ఏథర్ 450ఎక్స్ పై ఎక్కువ దూరం రైడ్ చేయాలా..? అయితే వెయిట్ చేయండి, లాంగ్ రేంజ్ వేరియంట్ వస్తోంది!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ (సర్టిఫైడ్ రేంజ్) పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇది ఫాస్ట్ మరియు స్టాండర్డ్ చార్జింగ్ లను సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. అలాగే, 3 గంటల 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

ఏథర్ 450ఎక్స్ పై ఎక్కువ దూరం రైడ్ చేయాలా..? అయితే వెయిట్ చేయండి, లాంగ్ రేంజ్ వేరియంట్ వస్తోంది!

ఎథర్ ఎనర్జీ తయారు చేసే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అంతర్నిమిత (బిల్ట్-ఇన్) ఆటో కట్-ఆఫ్ మరియు సర్జ్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది చార్జ్ పూర్తవగానే ఆటోమేటిక్ పవర్ తీసుకోవడాన్ని నిలిపివేస్తుంది ఫలితంగా ఓవర్‌హీటింగ్ సమస్యను నివారిస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో యూజర్లు తమ స్కూటర్ యొక్క బ్యాటరీ స్థితిని కుడా రిమోట్‌గా చెక్ చేసుకోవచ్చు. కంపెనీ ఇటీవలే ఈ స్కూటర్ల కోసం కొత్త స్మార్ట్ ఎకో (SmartEco) మోడ్ ను ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్ ద్వారా విడుదల చేసింది. ఈ కొత్త ఎకో మోడ్ సాయంతో రైడర్లు ఇతర మోడ్‌లలో కన్నా ఎక్కువ రేంజ్‌ను పొందుతారని కంపెనీ తెలిపింది.

ఏథర్ 450ఎక్స్ పై ఎక్కువ దూరం రైడ్ చేయాలా..? అయితే వెయిట్ చేయండి, లాంగ్ రేంజ్ వేరియంట్ వస్తోంది!

ఈ రెండు వేరియంట్లలో పెద్ద 7 ఇంచ్ TFT టచ్‌స్క్రీన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆల్-ఎల్ఈడి లైటింగ్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, రివర్స్ మోడ్, లైవ్ ట్రాకింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లలోని బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కూడా IP67 రేట్ చేయబడినవి. ఇందులోని బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ 3 ఏళ్ల అపరిమిత వారంటీని అందిస్తుంది. కాగా, కొత్తగా రాబోయే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్‌లలో డిజైన్ పరంగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. అయితే, ప్రస్తుత మోడళ్లతో వీటిని వేరుగా ఉంచేందుకు కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను జోడించవచ్చని మేము ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Ather energy to launch long range variant of 450x electric scooter soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X