ఇది కదా పండుగంటే.. ఒకే రోజు 250 యూనిట్ల 'ఏథర్ 450ఎక్స్' డెలివరీలు: ఎక్కడనుకుంటున్నారా..?
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందిన కంపెనీ. ఈ కంపెనీ దేశీయ విఫణిలో ఏథర్ 450 మరియు 450ఎక్స్ అనే రెండు స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇటీవల కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిలో ఒక కొత్త రికార్డ్ నెలకొల్పింది. కాగా ఇప్పుడు డెలివరీలలో కూడా మరో అరుదైన రికార్డుని కైవసం చేసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఏథర్ ఎనర్జీ దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 23 న మొత్తమ్ 250 యూనిట్ల 'ఏథర్ 450X' ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. ఒకే రోజు ఇన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయడం బహుశా ఇదే మొదటిసారి అవ్వొచ్చు.

కస్టమర్ల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన 'ఏథర్ ఎనర్జీ' యొక్క అమ్మకాలు నత్తనడకన సాగేవి, అయితే క్రమంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క అమ్మకాలు మరీ జోరందుకున్నాయి. కాగా ఇప్పుడు దేశంలో దాదాపు 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లు రోడ్డుపైన తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

విజయ దశమి మరియు దీపావళి పండుగల సందర్భంగా ఎక్కువమంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటారు. ఈ కారణంగానే ఎక్కువ సంఖ్యలో కొత్త వాహనాలు అమ్ముడవవుతాయి. సాధారణ రోజుల్లో పోలిస్తే, పండుగల సీజన్లో వాహనాల యొక్క అమ్మకాలు రెట్టింపుగా ఉంటాయి.

ఏథర్ ఎనర్జీ ప్రారభించిన ఈ మెగా డెలివరీ సమయంలో కస్టమర్లతో కోలాహలంగా మారింది. ఇందులో కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అన్ని కలర్స్ చూడవచ్చు. మొత్తం మీద కంపెనీ ఒకే రోజు 250 మంది కస్టమర్లకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అందించింది.

ఇదిలా ఉండగా ఏథర్ కంపెనీ ఇటీవల కొత్త 2022 మోడల్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 (Ather 450X Gen 3) మోడల్ విడుదల చేసింది. ఇది 3.7 kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ 19 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ పైన గరిష్టంగా 146 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సర్టిఫైడ్ చేయబడింది. అయితే వస్తావ ప్రపంచంలో దీని రేంజ్ 105 కిమీ కంటే తగ్గే అవకాశం లేదు.

2022 మోడల్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 (Ather 450X Gen 3) మోడల్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్ల నుండి గంటకు 90 కిలోమీటర్లకు పెరిగింది. కావున ఇది రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఏథర్ 450ఎక్స్ జెన్ 3 మోడల్ డిజైన్ మరియు పరికరాలు దాదాపు దాని మునుపటి మోడల్ ని పోలి ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు ఇందులో గమనించవచ్చు. ఇందులో కొత్తగా అమర్చిన సైడ్ మిర్రర్లు, కొత్త సైడ్ స్టెప్స్ మొదలైనవి ఉన్నాయి. కావున వీటి క్వాలిటీ మునుపటి కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.

ఈ కొత్త మోడల్ లో గమనించదగిన అతి పెద్ద అప్డేట్ ఇందులోనే టైర్లు. ఏథర్ 450ఎక్స్ యొక్క మూడవ తరం మోడల్ ఇప్పుడు స్టాండర్డ్‌గా 22 శాతం అధిక గ్రిప్ ను కలిగి ఉండే MRF టైర్‌లతో వస్తుంది. ఈ టైర్లను ఏథర్ మరియు ఎమ్ఆర్ఎఫ్ సంస్థలు ప్రత్యేకంగా తయారు చేశాయి. ఇవి మెరుగైన యాక్సిలరేషన్, కార్నరింగ్ మరియు బ్రేకింగ్ పనితీరులో సహాయపడతాయని ఏథర్ తెలిపింది. ఈ టైర్లు ఇప్పుడు టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (TPMS) ను కూడా సపోర్ట్ చేస్తాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఇంచెస్ టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. కానీ దీని RAM సైజు 1GB నుండి 2GB కి పెంచారు. ఇది కూడా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో వాయిస్ కమాండ్స్ మరియు మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ వంటివి కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది, కావున ఇవి రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ప్రారంభ ధర రూ. 1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ, అన్ని సబ్సిడీల తర్వాత). అయితే ఈ ధరలు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. కానీ ఈ కొత్త మోడల్ ధరలు దాని మునుపటి మోడల్ కంటే కూడా సుమారు 1,000 నుంచి 7,000 ఎక్కువ ఉంటుంది.


Click it and Unblock the Notifications








