ఆటమ్‌మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్‌కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్‌పై 100 కిమీ పైగా రేంజ్!

హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ కంపెనీ ఆటమ్మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Atumobile) భారత మార్కెట్లో తమ రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్ విడుదల చేసేందుకు సిద్దమైంది. ఈ బ్రాండ్ రూపొందించిన ఆటమ్‌వాడెర్ (AtumVader) కోసం ఈ కంపెనీ ఆటోమొబైల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) నుండి ధృవీకరణను పొందింది. ఇదొ కేఫ్ రేసర్ డిజైన్ కలిగిన బైక్, కంపెనీ దీనిని తెలంగాణలోని ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనుంది.

ఆటమ్‌మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్‌కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్‌పై 100 కిమీ పైగా రేంజ్!

ఈ మేడ్ ఇన్ ఇండియా టూవీలర్ బ్రాండ్ గడచిన సెప్టెంబర్ 2020 నెలలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ "ఆటమ్ 1.0"ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ పరిచయ ప్రారంభ ధర కేవలం రూ.50,000 మాత్రమే. అయితే, గడచిన రెండేళ్లలో ఈ ఎలక్ట్రిక్ బైక్ కు డిమాండ్ పెరగడంతో కంపెనీ దీని ధరను కూడా భారీగా పెంచింది. దేశీయ మార్కెట్లో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ.74,999 (ఎక్స్-షోరూమ్) గాఉంది.

ఆటమ్‌మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్‌కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్‌పై 100 కిమీ పైగా రేంజ్!

ఇకపోతే, కంపెనీ కొత్తగా ధృవీకరణ పొందిన AtumVader ఇ-బైక్ విషయానికి వస్తే, ఇది 2.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేయనుంది. ఈ బైక్ ట్యూబ్లర్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది మరియు అన్ని లైట్లు కూడా ఎల్ఈడి రూపంలో ఉంటాయి. కొత్త AtumVader దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్ అవుతుందని, దీనిని భారతదేశంలో డిజైన్ చేసి ఇక్కడే స్థానికంగా నిర్మించనున్నామని కంపెనీ పేర్కొంది.

ఆటమ్‌మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్‌కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్‌పై 100 కిమీ పైగా రేంజ్!

సమాచారం ప్రకారం, ఈ ఇ-బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లుగా ఉంటుంది మరియు ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ కెఫే రేసర్ బైక్లో హ్యాండ్ క్లచ్ మరియు లెగ్ బ్రేక్ ఉండదు. బైక్ ను ఆపడానికి హ్యాండ్ బ్రేక్ ఇవ్వబడుతుంది. ఈ బైక్‌లో అనేక ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. వాటిలో పూర్తి ఎల్‌సిడి డిజిటల్ స్క్రీన్, రెండు డిస్క్ బ్రేక్‌లు, యాంటీ-థెఫ్ట్ అలారం, జియో-ఫెన్సింగ్, బ్లూటూత్, రిమోట్ లాక్ వంటి మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి.

ఆటమ్‌మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్‌కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్‌పై 100 కిమీ పైగా రేంజ్!

ఆటంమొబైల్ ఈ వాడెర్ ఇ-బైక్ తయారీలో స్థానికంగా లభించే విడిభాగాలలో దాదాపు 90 శాతం వాటిని ఉపయోగించడం ద్వారా దీని తయారీ ఖర్చును తక్కువగా ఉంచాలని చూస్తోంది. ఆటంవాడెర్ భారత మార్కెట్లో ఈ కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ బైక్ అవుతుంది. ఇంతకుముందు, ఈ కంపెనీ ఆటమ్ 1.0 ఇ-బైక్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది మరియు ఈ మోడల్ అమ్మకాలు సానుకూలంగానే సాగుతున్నాయి.

ఆటమ్‌మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్‌కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్‌పై 100 కిమీ పైగా రేంజ్!

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పాతకాలపు కేఫ్-రేసర్ మోటార్‌సైకిల్ మాదిరిగా డిజైన్ చేయబడి ఉంటుంది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా మరియు మినిమలిస్టిక్‌గా ఉంటుంది. ఇది టీనేజర్లు, యువకులు వయోజనలు వంటి అన్ని వర్గాల కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని, అందుబాటు ధరలో ఉండేలా తయారు చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఈ మోటార్‌సైకిల్‌ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఎటి) తక్కువ-వేగవంతమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా ధృవీకరించింది. కాబట్టి దీనిని నడపడానికి లైసెన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ అవసరం ఉండదు.

ఆటమ్‌మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్‌కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్‌పై 100 కిమీ పైగా రేంజ్!

ఈ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 48 వోల్ట్ 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇది పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ సాయంతో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క గరిష్టం వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లోని లిథియం-అయాన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుందని, దీనిని స్టాండర్డ్ 3-పిన్ సాకెట్ ఉపయోగించి ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఆటమ్‌మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్‌కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్‌పై 100 కిమీ పైగా రేంజ్!

ఆటమ్ 1.0 ఇ-బైక్ చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ, ఇందులో కంపెనీ అనేక ఫీచర్లను అందిస్తోంది. వీటిలో ప్రధానంగా ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి టర్న్ ఇండికేటర్స్, స్టైలిష్ కేఫ్-రేసర్ డిజైన్, సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీట్, బిగ్ ఫ్యాట్ టైర్లు, బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ (280 మి.మీ) ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం డిజిటల్ డిస్‌ప్లే మొదలైనవి ఉన్నాయి.

ఆటమ్‌మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్‌కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్‌పై 100 కిమీ పైగా రేంజ్!

ఆటొమ్మొబైల్స్ ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్‌లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేయడం కోసం కేవలం 1 యూనిట్ విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుందని, అంటే సగటున ఇది 100 కిలోమీటర్లకు రోజుకు కేవలం 7 నుండి 10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుందని కంపెనీ తెలిపింది. సాంప్రదాయక పెట్రోల్ ఇంజన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. పెట్రోల్ ఇంజన్ల విషయంలో 100 కిలోమీటర్లకు సుమారు 80 - 100 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి రూ.999 మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Atumobile atumvader electric bike gets arai certification launch expected soon details
Story first published: Saturday, June 18, 2022, 17:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X