Just In
- 18 min ago
ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!
- 1 hr ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 1 hr ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 3 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
Don't Miss
- Lifestyle
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
- Movies
Macherla Niyojakavargam day 4 collections: మాస్ ఇమేజ్ తో నితిన్ పోరాటం.. తట్టుకున్నాడు కానీ?
- Sports
India Playing XI vs ZIM 1st ODI: రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! ఇసాన్ కిషన్ డౌట్!
- News
ఆంధ్రప్రదేశ్ వైపు అదానీ అడుగులు... వెల్లడించిన సీఎం జగన్
- Technology
ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్వేర్ అప్డేట్ని పిక్సెల్ ఫోన్ల కోసం విడుదల చేసిన గూగుల్...
- Finance
SBI: ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు.. ఆ కస్టమర్లకు నెలకు మూడుసార్లు.. 10 రకాల సేవలు ఉచితంగా..
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
ఆటమ్ వాడెర్ ఇ-బైక్‌ని లాంచ్ చేసిన హైదరాబాద్ కంపెనీ.. మొదటి 1000 మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్!
హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ కంపెనీ ఆటమ్మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ (Atumobile Private Limited) తమ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ "ఆటమ్ వాడెర్" (Atum Vader) ను మార్కెట్లో విడుదల చేసింది. ఒకే చార్జ్ పై 100 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేసే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను కంపెనీ కేవలం రూ.99,999 పరిచయ ప్రారంభ ధరకే విక్రయిస్తోంది. ఈ ధర ముందుగా బుక్ చేసుకునే మొదటి 1,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని, ఆ తర్వాత కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరలు వర్తిస్తాయని కంపెనీ చెబుతోంది.

ఆటమ్ వాడెర్ ఇ-బైక్ చూడటానికి కంపెనీ రెండేళ్ల క్రితం విడుదల చేసిన ఆటమ్ 1.0 ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ బైక్ మాదిరిగానే ఉంటుంది. ఈ బైక్ ను కంపెనీ అక్టోబర్ 5, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్, ప్రారంభంలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం రూ.50,000 లకే విక్రయించింది. ఆటమ్ 1.0 ఇ-బైక్ నడపడానికి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ అవసరం లేదు. ఎందుకంటే, దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్ల కన్నా తక్కువగానే ఉంటుంది.

కాగా, కంపెనీ ఇప్పుడు ఆటమ్ 1.0 ఎంట్రీ-లెవల్ బైక్ అమ్మకాలను నిలిపివేసి, దాని స్థానంలో అప్‌గ్రేడ్ చేయబడిన ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ఆటమ్ వాడెర్ ను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఆటమ్ వాడెర్ ఒక హై-స్పీడ్ ఇ-బైక్, ఇది గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కెఫే రేసర్ స్టైల్‌లో కనిపించే సింపుల్ లుకింగ్ ఇ-మోటార్‌సైకిల్. ఈ నెల ప్రారంభంలో, ఆటోమ్మొబైల్ ఈ కొత్త కేఫ్ రేసర్ మోడల్ కోసం ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నుండి ఆమోదం కూడా పొందింది.

ఆటమ్ వాడెర్ ఈ బ్రాండ్ నుండి వస్తున్న మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ధర పరంగా, ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ లక్ష రూపాయల లోపే ఉంటుంది. మొదటి 1000 మంది కస్టమర్లకు కంపెనీ ఎర్లీ బర్డ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ వెయ్యి మంది కస్టమర్లు ఆటమ్ వాడెర్ ఇ-బైక్ ను రూ.999 బుకింగ్ అమౌంట్ తో బుక్ చేసుకొని, దాని ధరను రూ.99,999 లాక్ చేసుకోవచ్చు.

ఆటమ్ వాడెర్ ఎలక్ట్రిక్ బైక్ లో 2.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది పూర్తి చార్జ్ పై 100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పటిష్టమైన ట్యూబ్య్లుర్ ఛాసిస్ పై నిర్మించబడింది. ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు మరియు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఇందులో 14 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం కూడా ఉంది. బ్యాటరీ రేంజ్, స్పీడ్ మరియు బ్యాటరీ ఉష్ణోగ్రతను తెలియజేసే సింపుల్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది.

ఓవరాల్‌గా ఆటోమ్మొబైల్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ ను చాలా సింపుల్ గా ఉండేలా డిజైన్ చేసింది. ఇతర ఫ్యాన్సీ మోటార్‌సైకిళ్లతో పోలిస్తే దీని డిజైన్ చాలా సాదాసీదాగా ఉంటుంది. ఇంకా ఇందులో సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీట్, పెద్ద టైర్లు, బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ (280 మి.మీ), ముందు వైపు డిస్క్ బ్రేక్ వెనుక వైపు డ్రమ్ బ్రేక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఆటోమ్మొబైల్ ఆటమ్ వాడెర్ ను కంపెనీ హైదరాబాద్ లోని పటాన్‌చెరువులో ఉన్న నెట్ జీరో తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఇటీవలే ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 25,000 యూనిట్ల నుండి గరిష్టంగా 3,00,000 యూనిట్లకు పెంచారు. అక్టోబర్ 2020లో, ఆటోమ్మొబైల్ విడుదల చేసిన తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఆటమ్ 1.0 కి ఇది కొనసాగింపుగా ఉంటుంది. కంపెనీ ఈ లో-స్పీడ్ కేఫ్ రేసర్ మోడల్ ను ఇప్పటివరకు 1,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది మరియు ఈ విభాగంలో లభిస్తున్న ఇతర ఇ-టూవీలర్లు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. ఈ విభాగంలో మార్కెట్‌లో ఇప్పటికే స్కూటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం అవన్నీ కూడా ఆటమ్ వాడెర్ మోటార్‌సైకిల్ కంటే కూడా చాలా ఎక్కువ ధరకు రిటైల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆటమ్ వాడెర్ కు దాని ధర చాలా ప్లస్ పాయింట్ అవుతుంది.

ఆటమ్ వాడెర్ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు వంశీ జి కృష్ణ మాట్లాడుతూ.. తాము ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తమ R&D (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) నిపుణుల సహాయంతో మరియు స్వదేశీ సౌరశక్తితో నడిచే జీరో-ఎమిషన్ సదుపాయాలతో భారతీయ రోడ్లు మరియు రైడర్‌లను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని, ఇది నిజమైన గ్రీన్ మరియు స్థిరమైన ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చబడిందని ఆయన అన్నారు. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.