భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

భారత టూవీలర్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. దేశంలో అనేక కొత్త మోడళ్లు నిత్యం మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. బ్రాండ్ ఇమేజ్, సరసమైన ధర, అధిక రేంజ్ మరియు విశ్వసనీయత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కస్టమర్లు ఆయా బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

Recommended Video

Ola Electric స్కూటర్ల కోసం విడుదల కానున్న Move OS2: వివారాలు #AutoNews

గత నెలలో భారతదేశంలో పెట్రోల్ ద్విచక్ర వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. జూలై 2022లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఆ టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

1. ఒకినావా ప్రైస్ ప్రో (Okinawa Praise Pro)

ఒకినావా గడచిన జూలై నెలలో మొత్తం 10,041యూనిట్ల ప్రైస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. జూలై 2021లో విక్రయించిన 2,171 యూనిట్ల కంటే ఇది 362 శాతం ఎక్కువ. ఒకినావా ప్రైజ్ ప్రో గత నెలలో కంపెనీ అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ గా అగ్రస్థానంలో నిలిచింది. ఒకినావా ప్రైస్ ప్రో ఒక హై-స్పీడ్, లాంగ్ రేంజ్ సిటీ కమ్యూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అధునాతన ఫీచర్లు మరియు పరికరాలతో అందిస్తోంది. మార్కెట్లో ఒకినావా ప్రైస్ ప్రో ఇ-స్కూటర్ ధర రూ.87,593 ఎక్స్-షోరూమ్ గా ఉంది.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

ఒకినావా ప్రైస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లో వేరు చేయగల (డిటాచబల్) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీని స్కూటర్ నుండి విడిగా తీసి, సాధారణ హోమ్ వాల్ అవుట్‌లెట్ సాయంతో చార్జ్ చేసుకోవచ్చు. ఈ లిథియం-అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 6 నుండి 8 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిమీల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కీలెస్ ఎంట్రీ, సైడ్ స్టాండ్ సెన్సార్లు, యాంటీ థెఫ్ట్ అలారం, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లో బ్యాటరీ ఇండికేటర్ మరియు పాస్ లైట్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

2. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల తమ అప్‌డేటెడ్ 2022 ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో విడుదల చేసిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. గడచిన జూలై 2022 నెలలో మొత్తం 6,304 యూనిట్ల టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయించబడ్డాయి. కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ ఐక్యూబ్ (iQube), ఐక్యూబ్ ఎస్ (iQube S) మరియు ఐక్యూబ్ ఎస్‌టి (iQube ST) అనే మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ ధర రూ. 1.15 లక్షలు కాగా, ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ధర రూ. 1,21 లక్షలు గా ఉంది (అన్ని ధరలు ఆన్ రోడ్, హైదరాబాద్). కాగా, ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఐక్యూబ్ బేస్ మరియు ఐక్యూబ్ ఎస్ వేరియంట్లు రెండూ కూడా ఒకే రకమైన 3.4 kwh బ్యాటరీ ప్యాక్ తో వస్తాయి. ఇవి రెండూ పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 100 కిమీ రేంజ్ ను అందిస్తాయి. కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ఐక్యూబ్ ఎస్‌టి లో పెద్ద 5.1 kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది మరియు ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 140 కిలోమీటర్ల రియల్ టైమ్ రేంజ్ ను అందిస్తుంది.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

3. బజాజ్ చేతక్ (Bajaj Chetak)

బజాజ్ ఆటో అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ఈవీ కూడా అమ్మకాల పరంగా ముందంజలో ఉంది. గడచిన జూలై 2022 నెలలో మొత్తం 3,0022 యూనిట్ల బజాజ్ చేతక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 kWh సామర్థ్యం కలిగిన IP67 రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 4kW పవర్‌ను మరియు 16 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో రెండు విభిన్న రైడింగ్ మోడ్‌లు (స్పోర్ట్ మరియు ఎకో) ఉంటాయి.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

ఎకో మోడ్‌లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 95 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుండగా, స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా 85 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇతర స్మార్ట్ స్కూటర్ల మాదిరిగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లేటెస్ట్ కెనెక్టింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులోని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది మరియు క్విక్ ఛార్జింగ్ సహాయంతో, కేవలం 1 గంటలో 25 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,34,814 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

4. ఏథర్ 450ఎక్స్ (Ather 450X)

ఏథర్ ఎనర్జీ కూడా ఇటీవలే తమ కొత్త 2022 మోడల్ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీంతో ఈ మోడల్ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గడచిన జూలై 2022 నెలలో ఏథర్ ఎనర్జీ మొత్తం 2,714 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. కొత్తగా వచ్చిన ఈ 2022 మోడల్ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటుంది మరియు ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 146 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. కొత్త బ్యాటరీ ప్యాక్ కారణంగా దాని రేంజ్ మునుపటి కన్నా 25 శాతం పెరిగింది.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

మార్కెట్లో కొత్త 2022 మోడల్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ప్రారంభ ధర రూ. 1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ, అన్ని సబ్సిడీల తర్వాత) గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెరిగిన బ్యాటరీ కారణంగా, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్‌ పవర్ కూడా పెరిగింది. ఏథర్ 450ఎక్స్ జెన్ 3 లోని ఫ్యాన్-కూల్డ్ మోటార్ గతంలో 6kW గరిష్ట పవర్ ను జనరేట్ చేస్తే, ఇప్పుడు అది 6.2 kW గరిష్ట పవర్ ను జనరేట్ చేస్తుంది. ఫలితంగా, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్ల నుండి గంటకు 90 కిలోమీటర్లకు పెరిగింది. ఇది కేవలం 6.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

5. ఒకినావా రిడ్జ్ ప్లస్ (Okinawa Ridge+)

ఒకినావా అందిస్తున్న మరొక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిడ్జ్ ప్లస్. గడచిన జులై 2022 నెలలో మొత్తం 1,302 యూనిట్ల ఒకినావా రిడ్జ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 55 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌ పై 120 కిమీ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో, రీఛార్జిబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ మరియు 800W వాటర్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంటాయి. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్ ఫీచర్‌ కూడా ఉంటుంది.

భారత ఈవీ మార్కెట్లో ప్రస్తుతం ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

ఒకినావా రిడ్జ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యాంటీ తెఫ్ట్ అలారం, కీలెస్ స్టార్ట్, ఈబిఎస్, సెంట్రల్ లాకింగ్, జిపిఎస్ నావిగేషన్, ఫైండ్ మై స్కూటర్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందించబడ్డాయి. ఇంకా ఇందులో అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు మరియు టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా ఉంటుంది. ఈ స్కూటర్‌ రిమూవబల్ బ్యాటరీ సెటప్ తో వస్తుంది, దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 2 నుండి 3 గంటలు పడుతుంది. ఈ స్కూటర్‌పై కంపెనీ 3 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది.

Most Read Articles

English summary
August 2022 ev sales top 5 best selling electric scooters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X