బజాజ్ పల్సర్ ఎన్250 మరియు ఎఫ్250 బైక్స్ ఇప్పుడు డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో లభ్యం!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పవర్‌ఫుల్ పల్సర్ బైక్స్ ఎన్250 (N250) మరియు ఎఫ్250 (F250) ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్ తో లభ్యం కానున్నాయి. స్టాండర్డ్ సింగిల్ ఛానెల్ ఏబిఎస్ తో పోలిస్తే, ఈ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్ల ధర దాదాపు రూ.5,000 అధికంగా ఉంటుంది. ఈ రెండు మోడళ్లలో ఈ ఒక్క మార్పు మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు.

బజాజ్ పల్సర్ ఎన్250 మరియు ఎఫ్250 బైక్స్ ఇప్పుడు డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో లభ్యం!

బజాజ్ ఆటో తమ కొత్త పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) మోడల్ ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, కంపెనీ తమ పల్సర్ N250 మరియు పల్సర్ F250 మోడళ్లలో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ వెర్షన్ బజాజ్ పల్సర్ 250 బైక్స్ కేవం బ్రూక్లిన్ బ్లాక్ కలర్ స్కీమ్‌ లో మాత్రమే అందించబడుతాయి. ఇదే కలర్ ఆప్షన్ కొత్తగా విడుదల చేయబడి బజాజ్ పల్సర్ ఎన్160లో కూడా అందుబాటులో ఉంది మరియు ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ సింగిల్- ఛానల్ ఏబిఎస్ వేరియంట్ కంటే 5,000 ఖరీదైనది.

బజాజ్ పల్సర్ ఎన్250 మరియు ఎఫ్250 బైక్స్ ఇప్పుడు డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో లభ్యం!

గత ఏడాది చివర్లో బజాజ్ తమ పల్సర్ బ్రాండ్ వాహనాలను 250సీసీ విభాగానికి కూడా విస్తరించింది. ప్రారంభ సమయంలో మార్కటె్లో కొత్త పల్సర్ N250 మరియు F250 ధరలు వరుసగా రూ. 1.38 లక్షలు మరియు రూ. 1.40 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉండేవి. ఆ తర్వాత వివిధ కారణాల వలన కంపెనీ వీటి ధరలను పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం, బజాజ్ పల్సర్ N250 మరియు F250 డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్‌ల ప్రారంభ ధరలు రూ. 1,49,978 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) గా ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్250 మరియు ఎఫ్250 బైక్స్ ఇప్పుడు డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో లభ్యం!

కాగా, ఇందులో సింగిల్ ఛానెల్ వెర్షన్ పల్సర్ ఎన్250 ధర రూ. 1,43,680 మరియు పల్సర్ ఎఫ్250 ధర రూ. 1,44,979 (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఇదిలా ఉంటే, కంపెనీ తాజాగా మార్కెట్లో విడుదల చేసిన 160సీసీ పల్సర్ ఎన్160 బైక్‌ని కూడా కంపెనీ సింగిల్ ఛానెల్ మరియు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫీచర్లతో అందిస్తోంది. కాగా, ఈ క్వార్టర్-లీటర్ పల్సర్ 250 ట్విన్స్ లో కంపెనీ కొత్త కలర్ స్కీమ్ మరియు మెరుగైన భద్రతను మినహాయించి ఈసారి ఎలాంటి మార్పులను చేయలేదు.

బజాజ్ పల్సర్ ఎన్250 మరియు ఎఫ్250 బైక్స్ ఇప్పుడు డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో లభ్యం!

కొత్త 2022 బజాజ్ పల్సర్ N250 మరియు F250 ఇప్పుడు టెక్నో గ్రే, రేసింగ్ రెడ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో పల్సర్ ఎన్250 ఒక నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ కాగా, ఎఫ్250 ఓ సెమీ ఫెయిర్డ్ వెర్షన్ గా ఉంటుంది. కంపెనీ గతంలో విక్రయించిన పల్సక్ 200ఎఫ్ స్థానాన్ని ఈ కొత్త పల్సర్ ఎఫ్250 భర్తీ చేస్తుంది. పనితీరు విషయానికొస్తే, ఇవి రెండూ కూడా 249.07 సిసి సింగిల్-సిలిండర్ ఫోర్-స్ట్రోక్ ఎస్ఓహెచ్‌సి 2-వాల్వ్ ఆయిల్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి.

బజాజ్ పల్సర్ ఎన్250 మరియు ఎఫ్250 బైక్స్ ఇప్పుడు డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో లభ్యం!

ఈ ఇంజన్ గరిష్టంగా 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 24.5 పిఎస్ పవర్ అవుట్‌పుట్ ను మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 21.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ కాంస్టాంట్ మెష్ ట్రాన్స్‌మిషన్‌తో అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. బ్రేకింగ్ డ్యూటీలను గమనిస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ ఉంటాయి. ఇది సింగిల్ ఛానెల్ లేదా డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇక సస్పెన్షన్ సెపట్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు నైట్రోక్స్ మోనోషాక్ సస్పెన్షన్‌ సెటప్ ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్250 మరియు ఎఫ్250 బైక్స్ ఇప్పుడు డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో లభ్యం!

బజాజ్ పల్సర్ 250 బైక్స్ లోని కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 14 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం మొదలైనవి ఉన్నాయి. బజాజ్ పల్సర్ 250 ట్విన్స్ రెండూ కూడా ముందు వాపు 100/80-17 ట్యూబ్‌లెస్ టైర్ మరియు వెనుక వైపు 130/70-17 ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉంటుంది. ఈ బైక్ వీల్‌బేస్ పొడవు 1,351 మిమీ కాగా, సీటు ఎత్తు 795 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ గా ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్250 మరియు ఎఫ్250 బైక్స్ ఇప్పుడు డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో లభ్యం!

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) గురించి క్లుప్తంగా..

ఇటీవలే విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160 (Pulsar N160) విషయానికి వస్తే, ఇది 'సింగిల్ ఛానల్ ఏబీఎస్' కాగా, మరొకటి 'డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్'. వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1,22,854 మరియు రూ. 1,27,853 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి. బజాజ్ పల్సర్ ఎన్160 డిజైన్ పరంగా దాదాపు పల్సర్ ఎన్250 బైక్ ను పోలి ఉంటుంది. అయితే ఇది నేక్డ్ స్ట్రీట్ బైక్ మాదిరిగా ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకు పై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Bajaj auto launches pulsar n250 and f250 with dual channel abs feature details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X