Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) 2021 డిసెంబర్ నెల అమ్మకాల నివేదికలను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, 2021 డిసెంబర్ నెలలో 3 శాతం తగ్గుదలను నమోదు చేసినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

బజాజ్ ఆటో వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2021 డిసెంబర్ నెలలో మొత్తం 3,62,470 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. ఇదే నెల 2020 సంవత్సరంలో కంపెనీ 3,72,532 యూనిట్లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే 2020 డిసెంబర్ అమ్మకాల కంటే కూడా 2021 డిసెంబర్ అమ్మకాలు 3 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

కంపెనీ యొక్క దేశీయ విక్రయాలు 2020 డిసెంబర్ నెలలో 1,39,606 యూనిట్లు కాగా 2021 డిసెంబర్ లో 1,45,979 యూనిట్లకు చేరి 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే కంపెనీ యొక్క మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 6 శాతం క్షీణించి 2021 డిసెంబర్‌లో 3,38,584 యూనిట్ల నుంచి 3,18,769 యూనిట్లకు పడిపోయాయి.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

అదే విధంగా కంపెనీ యొక్క దేశీయ మరియు ఎగుమతి అమ్మకాలు వరుసగా ఒక శాతం మరియు తొమ్మిది శాతం క్షీణించాయి. ఇదే సమయంలో, బజాజ్ ఆటో యొక్క మొత్తం కమర్షియల్ వెహికల్ అమ్మకాలు, ఎగుమతులతో సహా డిసెంబర్ 2020 లో విక్రయించబడిన 33,948 యూనిట్ల నుండి 29 శాతం పెరిగి 43,701 యూనిట్లకు చేరుకున్నాయి.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

ద్విచక్ర వాహన తయారీదారుల మొత్తం ఎగుమతులు కూడా క్షీణించాయి. కంపెనీ మొత్తం ఎగుమతులు డిసెంబర్ 2020లో 2,32,926 యూనిట్ల నుంచి 2021 డిసెంబర్‌లో 7 శాతం తగ్గి 2,16,491 యూనిట్లకు పడిపోయాయి. మొత్తానికి కంపెనీ యొక్క అమ్మకాలు 2020 కంటే కూడా 2021 లో తగ్గుదలను నమోదు చేశాయి.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

బజాజ్ ఆటో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన విభాగంపై ద్రుష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పూణెలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనుంది. దీనికోసం కంపెనీ ఏకంగా రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కంపెనీ ఈ కొత్త ప్లాంట్ అకుర్దిలో ఏర్పాటు కానుంది. ఇందులో 2022 నుంచి వాహనాల యొక్క ఉత్పత్తి ప్రారంభం కానుంది.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

కొత్త ప్లాంట్ లో ఉత్పత్తి చేయబడే ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయబడతాయి. ఈ కొత్త ప్లాంట్ సంవత్సరానికి 5,00,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

బజాజ్ ఆటో ప్రారంభించనున్న ఈ కొత్త ఫ్యాక్టరీలో దాదాపు 800 మందికి ఉపాధి లభించే అవకాశం కూడా ఉంది. ఈ ప్లాంట్ లాజిస్టిక్స్ నుండి మెటీరియల్ హ్యాండ్లింగ్, ఫ్యాబ్రికేషన్ మరియు పెయింటింగ్, అసెంబ్లీ మరియు నాణ్యత హామీ వరకు రోబోటిక్ మరియు ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థలన్నీ కూడా సౌకర్యవంతమైన ఉత్పత్తుల కోసం రూపొందించబడ్డాయి.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

బజాజ్ ఆటో యొక్క ఈ కొత్త ప్లాంట్ కి మరో రూ. 250 కోట్లను విక్రేతలు పెట్టుబడి పెడతారు. ఈ కొత్త ఫ్యాక్టరీ బజాజ్ ఆటో యొక్క R&D కేంద్రంతో అనుబంధించబడింది. కంపెనీ యొక్క ఈ కొత్త ఫ్యాక్టరీని ఎలక్ట్రిక్ వాహనాల డిజైన్, డెవలప్‌మెంట్ మరియు తయారీకి హబ్‌గా మార్చడానికి అనుకూలంగా ఉంటుంది.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

ఇదిలా ఉండగా, బజాజ్ ఆటో కంపెనీ ఇటీవల కాలంలో తన పల్సర్ 250సీసీ బైక్ శ్రేణిని విడుదల చేసింది. కంపెనీ కొత్త పల్సర్ శ్రేణిని పల్సర్ ఎఫ్250 మరియు ఎన్250 అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. పల్సర్ ఎఫ్250 బైక్ సెమీ ఫెయిర్డ్ బైక్ అయితే పల్సర్ ఎన్250 అనేది నేక్డ్ లుక్‌లో అందించబడుతుంది. ఈ బైక్స్ విడుదలైనప్పటినుంచి కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Bajaj Pulsar N250 ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అదే విధంగా Bajaj Pulsar F250 ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్స్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Bajaj Auto: 2021 డిసెంబర్ అమ్మకాల్లో బేజారు

Bajaj Pulsar 250 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 249.07 సిసి సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను అందించింది. ఇది 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 24.1 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 21.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Most Read Articles

English summary
Bajaj auto sales december 2021 decreases by 3 percent details
Story first published: Tuesday, January 4, 2022, 12:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X