డొమినార్ 250 (Dominar 250) బైక్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన బజాజ్ ఆటో.. ఆ అప్‌డేట్ ఏంటంటే..?

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto), భారత మార్కెట్లో డొమినార్ సిరీస్ క్రింద రెండు మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా. కంపెనీ ఇప్పుడు బజాజ్ డొమినార్ (Bajaj Dominar) మోటార్‌సైకిల్ యొక్క 250 సీసీ వేరియంట్ ను సైలెంట్ గా అప్‌డేట్ చేసింది. ఆ అప్‌డేట్ ఏంటంటే, కొత్త బజాజ్ డొమినార్ 250 ఇప్పుడు స్టైలిష్ బ్లాక్-అవుట్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో లభిస్తుంది.

డొమినార్ 250 (Dominar 250) బైక్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన బజాజ్ ఆటో.. ఆ అప్‌డేట్ ఏంటంటే..?

ఈ ఒక్క మార్పు మినహా కొత్త బజాజ్ డొమినార్ 250లో వేరే ఏ ఇతర మార్పులు లేవు. డిజైన్ పరంగా చూస్తే, కొత్త బజాజ్ డొమినార్ 250 (Bajaj Dominar 250) మరియు బజాజ్ డొమినార్ 400 రెండూ కూడా చాలా దగ్గర పోలికను కలిగి ఉంటాయి. ఈ రెండింటిలో ప్రధానమైన మార్పు దాని ఇంజన్ రూపంలో ఉంటుంది. డొమినార్ 400 (Dominar 400) లో తాజాగా చేసిన అప్‌డేట్ (టూరింగ్ యాక్సెసరీలను స్టాండర్డ్‌గా జోడించడం) కారణంగా ఈ రెండు మోటార్‌సైకిళ్లను వేరు చేయడం సులభం అయ్యింది.

డొమినార్ 250 (Dominar 250) బైక్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన బజాజ్ ఆటో.. ఆ అప్‌డేట్ ఏంటంటే..?

ఇక బజాజ్ డొమినార్ 250 విషయానికి వస్తే, ఇది మూడు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. వీటిలో రేసింగ్ రెడ్ విత్ మ్యాట్ సిల్వర్, షైనీ బ్లాక్ విత్ మ్యాట్ సిల్వర్ మరియు సిట్రస్ రెడ్ విత్ మ్యాట్ సిల్వర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే, ఈ బైక్ లో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఈ క్వార్టర్-లీటర్ మోటార్‌సైకిల్ లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, స్పోర్టీ-లుకింగ్ రియర్‌వ్యూ మిర్రర్స్ మరియు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు ఉంటాయి.

డొమినార్ 250 (Dominar 250) బైక్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన బజాజ్ ఆటో.. ఆ అప్‌డేట్ ఏంటంటే..?

అలాగే, ఈ బైక్ బైక్ భాగంలో అప్ సైడ్ డౌన్ (USD) ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్, సింగిల్ సైడ్ ట్విన్-బ్యారెల్ ఎగ్జాస్ట్ మరియు స్ప్లిట్ సీట్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ డొమినార్ 250 లో రైడ్ కంఫర్ట్ ని అందించే విషయం ఏంటంటే, దాని సౌకర్యవంతమైన సీట్ హైట్. డొమినార్ 250 బైక్ 800 మిమీల సీట్ ఎత్తు కలిగి ఉండి, మంచి ప్రీమియం కమ్యూటర్ మోటార్‌సైకిల్ గా ఉంటుంది.

డొమినార్ 250 (Dominar 250) బైక్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన బజాజ్ ఆటో.. ఆ అప్‌డేట్ ఏంటంటే..?

బజాజ్ డొమినార్ 250 లో ఉపయోగించిన ఇంజన్ విషయానికి వస్తే, కంపెనీ తమ ఆస్ట్రియన్ బైక్ పార్ట్‌నర్ అయిన కెటిఎమ్ 250 మోడళ్లలో (డ్యూక్) ఉపయోగిస్తున్న అదే ఇంజన్ ను ఇందులోనూ ఉపయోగించింది. అయితే, ఈ ఇంజన్ ను బజాజ్ డొమినార్ 250 (Bajaj Dominar 250) మోడల్ కు అనుగుణంగా రీట్యూన్ చేయబడింది. ఇందులోని 250 సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ డిఓహెచ్‌సి ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 26.6 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 23.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

డొమినార్ 250 (Dominar 250) బైక్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన బజాజ్ ఆటో.. ఆ అప్‌డేట్ ఏంటంటే..?

ఇంజన్ నుండి విడుదలయ్యే ఈ పవర్ మరియు టార్క్ ను స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రానికి పంపిణీ చేయబడుతుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ బైక్ కేవలం 10.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 132 కిలోమటర్ల వేగంతో పరులుగు తీస్తుంది. బజాజ్ డొమినార్ 250 మొత్తం బరువు 180 కిలోలుగా ఉంటుంది.

డొమినార్ 250 (Dominar 250) బైక్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన బజాజ్ ఆటో.. ఆ అప్‌డేట్ ఏంటంటే..?

కొత్త Baja Dominar 250 యొక్క ఇతర స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఈ బైక్ ముందువైపు 10/80 సెక్షన్ టైర్, వెనుకవైపు 130/70 సెక్షన్ టైర్, ముందు వైపు 37 మిమీ ట్రావెల్‌తో కూడిన USD ఫోర్కులు, వెనుక వైపు మల్టీస్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బజాజ్ డొమినార్ 250 భారత మార్కెట్లోని 250 సీసీ విభాగంలో సుజుకి జిక్సర్ 250 (Suzuki Gixxer 250) మరియు యనహా ఎఫ్‌జీ25 (Yamaha FZ25) వంటి క్వార్టర్-లీటర్ మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలుస్తుంది.

డొమినార్ 250 (Dominar 250) బైక్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన బజాజ్ ఆటో.. ఆ అప్‌డేట్ ఏంటంటే..?

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar NS160)లో కూడా అప్‌డేట్స్..

ఇదిలా ఉంటే, బజాజ్ ఆటో విక్రయిస్తున్న 'పల్సర్ ఎన్ఎస్160' (Pulsar NS160) బైక్ లో కూడా కంపెనీ కొన్ని కీలకమైన అప్‌డేట్స్ చేసింది. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 నేక్డ్ స్పోర్ట్స్ బైక్ కూడా ఇప్పుడు స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ మరియు కొత్త పెయింట్ స్కీమ్ లో అందుబాటులో ఉంటుంది. పల్సర్ ఎన్ఎస్160 లో కంపెనీ కొత్తగా బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్ ను పరిచయం చేసింది. కొత్త పెయింట్ స్కీమ్ మరియు సరికొత్త అల్లాయ్ వీల్స్ తో వచ్చిన కొత్త బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar NS160) ఇప్పుడు మునుపటి కన్నా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

డొమినార్ 250 (Dominar 250) బైక్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన బజాజ్ ఆటో.. ఆ అప్‌డేట్ ఏంటంటే..?

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా, మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. ఇందులోని 160 సీసి సింగిల్ సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ గరిష్టంగా 15.3 బిహెచ్‌పి పవర్ ను మరియు 14.6 ఎన్ఎమ్ టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Source:AUTOHOLIC MANISH

Most Read Articles

English summary
Bajaj auto silently updates dominar 250 now gets new alloy wheels
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X