బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ (Bajaj Pulsar N250 Black Edition) వస్తోంది.. టీజర్ విడుదల!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పల్సర్ 250 మోడల్‌లో మరో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. బ్లాక్ ఎడిషన్ పేరిట కంపెనీ ఓ కొత్త బజాజ్ పల్సర్ ఎన్250 (Bajaj Pulsar N250 Black Edition) ను విడుదల చేయనుంది. ప్రస్తుతం, బజాజ్ పల్సర్ 250 రెండు వేరియంట్లలో (ఎఫ్250 మరియు ఎన్250) విక్రయించబడుతోంది. ఇందులో ఎఫ్250 అనేది పూర్తిగా ఫెయిరింగ్స్ (బాడీ ప్యానెల్స్) కలిగిన వేరియంట్ కాగా, ఎన్250 అనేది ఫెయిరింగ్స్ లేని నేక్డ్ వెర్షన్ గా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ (Bajaj Pulsar N250 Black Edition) వస్తోంది.. టీజర్ విడుదల!

బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ గురించి ప్రస్తుతానికి ఈ టీజర్ మినహా వేరే ఏ ఇతర వివరాలు అందుబాటులో లేవు. సమాచారం ప్రకారం, ఇది ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న పల్సర్ ఎన్250 ఆధారంగా ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి, ఇందులో మెకానికల్ గా మరియు ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవు. అయితే, స్టాండర్డ్ మోడల్ పల్సర్ ఎన్250 కి మరియు ఈ బ్లాక్ ఎడిషన్ పల్సర్ ఎన్250 కి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.

బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ (Bajaj Pulsar N250 Black Edition) వస్తోంది.. టీజర్ విడుదల!

పేరుకి తగినట్లుగానే బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్‌లో ఎక్కు భాగం బ్లాక్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉంది మరియు ఇది ప్రత్యేకమైన డార్క్ బాడీ కలర్ పెయింట్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు తప్ప ఇందులే వేరే ఇతర మార్పులు ఉండకపోవచ్చు. బజాజ్ పల్సర్ 250 బైక్స్ యొక్క రెండు వేరియంట్లలో కంపెనీ ఒకేరకమైన ఇంజన్ ను ఉపయోగిస్తోంది. ఈ రెండు బైక్‌లు కూడా పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్ మరియు టూ-వాల్వ్ ఇంజన్‌తో పరిచయం చేయబడ్డాయి.

బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ (Bajaj Pulsar N250 Black Edition) వస్తోంది.. టీజర్ విడుదల!

బజాజ్ పల్సర్ 250 బైక్ లో 249.07 సిసి సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 24.1 బిహెచ్‌పి పవర్‌ను మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. డిజైన్ పరంగా చూస్తే, బజాజ్ తమ పల్సర్ 250 శ్రేణిని ఇతర పల్సర్ బైక్‌ల నుండి వేరు చేయడానికి వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది.

బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ (Bajaj Pulsar N250 Black Edition) వస్తోంది.. టీజర్ విడుదల!

పల్సర్ ఎఫ్250 సెమీ ఫెయిరింగ్ డిజైన్ ను కలిగి మజిక్యులర్ 14-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, స్టెప్-అప్ సీట్లు, స్ప్లిట్-స్టైల్ టైల్‌లైట్, ట్విన్-బ్యారెల్ ఎగ్జాస్ట్‌ మరియు పొడవైన విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇక పల్సర్ ఎన్250 విషయానికి వస్తే, ఇది ఫెయిరింగ్ లేకుండా వస్తుంది. ఈ ప్రధాన మార్పు మినహా మిగిలిన అన్ని డిజైన్ ఎలిమెంట్స్ దాని ఎఫ్250 మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఇవి రెండూ కూడా ఇతర పల్సర్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే చాలా సాంప్రదాయిక డిజైన్‌ను కలిగి ఉంటాయి.

బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ (Bajaj Pulsar N250 Black Edition) వస్తోంది.. టీజర్ విడుదల!

అయితే, సెమీ-ఫెయిరింగ్‌తో కూడిన కొత్త బజాజ్ ఎఫ్250 దాని నేక్డ్ కౌంటర్ పార్ట్ అయిన బజాజ్ ఎన్250 కంటే కొంచెం పెద్దదిగా మరియు టూరింగ్-ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపిస్తుంది. వీటిలో ఎన్250 బరువు 162 కిలోలుగా ఉంటే, మరియు ఎఫ్250 164 కిలోలుగా ఉంటుంది. పల్సర్ 250లోని ఇతర కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది బ్లాక్, సిల్వర్ మరియు రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఇందులో ఇటీవలే కరేబియన్ బ్లూ అనే నాల్గవ కలర్ ఆప్షన్ ను కూడా పరిచయం చేసింది.

బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ (Bajaj Pulsar N250 Black Edition) వస్తోంది.. టీజర్ విడుదల!

పల్సర్ ఎన్250 మరియు ఎఫ్250 బైక్స్ యొక్క మెకానికల్స్ ఫీచర్లను గమనిస్తే, ఈ రెండు మోడళ్లలో ముందు వైపు 37 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు నైట్రోక్స్ మోనో షాక్‌ సస్పెన్షన్ సెటప్‌ ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ రెండు మోడళ్లలో ముందు వైపు 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రెండూ సింగిల్ ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఇరువైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ (Bajaj Pulsar N250 Black Edition) వస్తోంది.. టీజర్ విడుదల!

ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త బజాజ్ పల్సర్‌ 250 సింగిల్ పాడ్ ఎల్ఈడి హెడ్‌లైట్ ను కలిగి ఉంటుంది, ఇది ప్రొజెక్షన్ మరియు పొజిషన్ రెండింటికీ పనిచేస్తుంది. ఇకపోతేస బైక్ వెనుక భాగంలో స్ప్లిట్-స్టైల్ ఎల్ఈడి టైల్‌లైట్‌ ఉంటుంది. ఈ బైక్ లో టాకోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, గేర్-పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ ఫ్యూయల్ గేజ్, క్లాక్ మొదలైన వివరాలను తెలియజేసే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్250 బ్లాక్ ఎడిషన్ (Bajaj Pulsar N250 Black Edition) వస్తోంది.. టీజర్ విడుదల!

చివరగా ధర విషయానికి వస్తే, ఇటీవలే కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్250 ప్రారంభ ధర రూ.1,43,680 (ఎక్స్-షోరూమ్) ఉంటే, పల్సర్ ఎఫ్250 ధర రూ.1,44,979 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే బ్లాక్ ఎడిషన్ బజాజ్ పల్సర్ ఎన్250 ధర దీని కన్నా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Bajaj auto teases pulsar 250 black edition launch expected soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X