బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా, ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచడమే కాకుండా దేశంలో మరింత ఎక్కువగా విస్తరించడానికి ఎప్పటికప్పుడు సన్నాహాలు సిద్ధం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ బజాజ్ (Bajaj) తన పోర్ట్‌ఫోలియోలోని బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్ ను దేశంలో చాలా వేగంగా విస్తరిస్తోంది.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

ఇటీవల కాలంలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఢిల్లీ మరియు గోవా ప్రాంతాల్లో స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పటికి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 20 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇందులో 12 కొత్త నగరాలు జోడించబడ్డాయి. అంతకుముందు మొత్తం 8 నగరాల్లో అందుబాటులో ఉండేది. ఇప్పుడు మొత్తం 20 నగరాల్లో తన ఉనికిని చాటుకుంటోంది.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వెయిటింగ్ పీరియడ్ 4 నుంచి 8 వారాల వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ముంబై, న్యూఢిల్లీ, గోవా, మదురై, కోయంబత్తూర్, కొచ్చి, హుబ్లీ, విశాఖపట్నం, నాసిక్, వసాయ్ మరియు సూరత్‌ మొదలైన ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 149,350 (ఎక్స్-షోరూమ్). అయితే ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి అర్బన్ మరియు ప్రీమియం వేరియంట్లు. మార్కెట్లో ఎంట్రీ లెవల్ అర్బన్ వేరియంట్ ధర రూ. 1.42 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే) గా ఉన్నాయి.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

గత కొంతకాలంగా ఆటో మొబైల్ మార్కెట్లో సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా బుకింగ్స్ తాత్కాలికంగా నిలివేయడం జరిగింది. అయితే ఈ సమస్య కొంత తగ్గుముఖం పట్టడం వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ మళ్ళీ మొదలయ్యాయి.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఐకానిక్ బ్రాండ్ రెట్రో మోడ్రన్ లుక్ తో ఉంటుంది. ముందు వైపు నుండి మోడ్రన్ స్కూటర్ లా మరియు సైడ్ నుండి రెట్రో క్లాసిక్ చేతక్ స్కూటర్ లా కనిపిస్తుంది. ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ ఉంటాయి.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

ఇంకా ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్, యుఎస్‌బి పోర్ట్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ మరియు లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కంపెనీ పూణేలోని ప్లాంట్‌లో తయారు చేస్తోంది.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుంది. యాప్ స్టోర్ లో అందుబాటులో ఉండే మొబైల్ అప్లికేషన్ సాయంతో కస్టమర్లు తమ ఫోన్ ద్వారా ఈ స్కూటర్ కు రిమోట్ గా కనెక్ట్ కావచ్చు మరియు దానిని లైవ్ ట్రాక్ చేయవచ్చు.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. దీనికోసం ఇందులో 3 kWh IP 67 లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్ కు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్‌పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ రిమూవబల్ కాదు, కావున బయటకు తీయడానికి అవకాశం లేదు.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు ఎకో మోడ్‌ లో గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్ మోడ్‌ లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు. ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది.

బుకింగ్ ప్రైస్ కేవలం రూ. 2000.. త్వరపడండి Bjaja Chetak ఇప్పుడు మరిన్ని నగరాల్లో

ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో ఇందులోని బ్యాటరీలను 1 గంట పాటు చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్ బ్యాటరీని 5 amp పవర్ సాకెట్ తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది. Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో TVS iQube, Ather 450X, Ola S1మరియు Simple 1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 18, 2022, 10:03 [IST]
English summary
Bajaj chetak bookings open in 12 new cities details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+