దేశ రాజధానిలో మొదలైన Bajaj Chetak బుకింగ్స్.. ఆ నగరంలో కూడా బుకింగ్స్ షురూ!!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ ఈవి (Bajaj Chetak EV) యొక్క బుకింగ్స్ ఇప్పుడు దేశ రాజధాని నగరం ఢిల్లీ మరియు గోవా నగరాల్లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కంపెనీ కేవలం మొత్తం 10 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌ను తీసుకుంటోంది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం బజాజ్ చేతక్ స్కూటర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 2,000 చెల్లించి కంపెనీ యొక్క వెబ్‌సైట్ లో కెటిఎమ్ డీలర్‌షిప్‌లను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయి. కంపెనీ తన ఉనికిని దేశ వ్యాప్తంగా విస్తరించడంతో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త నగరాల్లో విడుదల చేస్తోంది.

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న 'బజాజ్ చేతక్' బుకింగ్ ప్రస్తుతం ఢిల్లీ మరియు గోవాతో పాటు ఆంధ్రప్రదేశ్, డామన్ మరియు డయ్యూ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు మరియు తెలంగాణల ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.

ఇది మొత్తం నాలుగు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంచబడింది మరియు దీని ధర రూ. 149,350 (ఎక్స్-షోరూమ్)గా ఉంచబడింది. చిప్ లేకపోవడంతో కొన్ని నెలలుగా బుకింగ్‌ను నిలిపివేసిన కంపెనీ, ఇప్పుడు మళ్లీ ప్రారంభించింది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి అర్బన్ మరియు ప్రీమియం వేరియంట్లు. మార్కెట్లో ఎంట్రీ లెవల్ అర్బన్ వేరియంట్ ధర రూ. 1.42 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే) గా ఉన్నాయి.

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 kWh IP 67 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్ కు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్‌పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను తొలగించడానికి వీలు లేదు (రిమూవబల్ బ్యాటరీ కాదు).

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు ఎకో మోడ్ లో గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్ మోడ్ లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు.

ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో ఇందులోని బ్యాటరీలను 1 గంట పాటు చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్ బ్యాటరీని 5 amp పవర్ సాకెట్ తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఐకానిక్ బ్రాండ్ రెట్రో మోడ్రన్ లుక్ తో ఉంటుంది. ముందు వైపు నుండి మోడ్రన్ స్కూటర్ లా మరియు సైడ్ నుండి రెట్రో క్లాసిక్ చేతక్ స్కూటర్ లా కనిపిస్తుంది. ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ ఉంటాయి.

ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్, యుఎస్‌బి పోర్ట్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ మరియు లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ పూణేలోని ప్లాంట్‌లో తయారు చేస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుంది. యాప్ స్టోర్ లో అందుబాటులో ఉండే మొబైల్ అప్లికేషన్ సాయంతో కస్టమర్లు తమ ఫోన్ ద్వారా ఈ స్కూటర్ కు రిమోట్ గా కనెక్ట్ కావచ్చు మరియు దానిని లైవ్ ట్రాక్ చేయవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో TVS iQube, Ather 450X, Ola S1మరియు Simple 1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది. బజాజ్ చేతక్ ఉత్పత్తి ఇప్పుడు సాధారణ స్థాయికి చేరుకుంది. కావున కంపెనీ మరిన్ని నగరాల్లో బుకింగ్‌ను ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications








