Bajaj Chetak EV vs TVS iQube EV: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణంగా రోజురోజుకి పెరిగిపోతున్న ఇంధన ధరలే. ప్రస్తుతం, మనదేశంలో అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో విశ్వసనీయమైన టూవీలర్ బ్రాండ్లు అయిన బజాజ్ మరియు టీవీఎస్ కంపెనీలు కూడా సాధారణ పెట్రోల్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విక్రయిస్తున్నాయి. ఈ రెండు బ్రాండ్ల నుండి బజాజ్ చేతక్ ఈవీ మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఈవీలు అందుబాటులో ఉన్నాయి.

Bajaj Chetak EV vs TVS iQube EV: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

గడచిన ఫిబ్రవరి 2022 నెలలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు భారతీయ వినియోగదారుల నుండి గొప్ప స్పందన లభించింది, ఫలితంగా ఆ నెలలో ఈ రెండు మోడళ్ల అమ్మకాలు కూడా బాగానే పెరిగాయి. బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఈ విభాగంలో ఒకదానికొకటి గట్టి పోటీని ఇస్తాయి. అయితే, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయాన్ని మనం ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

Bajaj Chetak EV vs TVS iQube EV: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే అమ్మకాల పరంగా 2000 యూనిట్ల మార్కును దాటి, గత సంవత్సరంతో పోల్చితే ఫిబ్రవరి 2022 నెల అమ్మకాలలో గొప్ప వృద్ధిని సాధించింది. బజాజ్ చేతక్ (Bajaj Chetak) విషయానికి వస్తే, అధిక డిమాండ్ కారణంగా కంపెనీ దీని బుకింగ్‌లను కొంతకాలం క్రితం నిలిపివేసింది, కానీ ఇప్పుడు తిరిగి ప్రారంభించబడింది. ఎలక్ట్రానిక్ చిప్ సమస్య కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు కంపెనీ తిరిగి దీని ఉత్పత్తిని ప్రారంభించింది.

Bajaj Chetak EV vs TVS iQube EV: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

ఫిబ్రవరి 2021లో కంపెనీ కేవలం 150 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయిస్తే, గత ఫిబ్రవరి 2022 నెలలో ఇవి 1110 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, వీటి ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ పూణెలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీని స్థాపించడానికి కంపెనీ సుమారు రూ.300 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. ఈ కొత్త ప్లాంట్ లో ప్రధానంగా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయబడుతుంది మరియు ఈ కొత్త ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి జూన్ 2022 నుండి ప్రారంభమవుతుందని సమాచారం.

Bajaj Chetak EV vs TVS iQube EV: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

ఇక టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాల విషయానికి వస్తే, ఫిబ్రవరి 2022లో ఇవి 2238 యూనిట్లు విక్రయించబడ్డాయి, ఇది ఫిబ్రవరి 2021లో విక్రయించిన 203 యూనిట్ల కంటే పది రెట్లుకు పైగా వృద్ధిని సాధించింది. కాబట్టి, అమ్మకాల పరంగా చూసుకుంటే, ఈ రెండు మోడళ్లలో కస్టమర్లు ఎక్కువగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, టీవీఎస్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం తమిళనాడులో ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టీవీఎస్ తమిళనాడు ప్రభుత్వంతో ఓ ఎంఓయూపై సంతకం కూడా చేసింది.

Bajaj Chetak EV vs TVS iQube EV: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ : బ్యాటరీ, రేంజ్, ఫీచర్లు

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో 4.4 కిలోవాట్ల హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించింది. ఇందులో 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. వీటి సాయంతో ఈ ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది మరియు ఇది పూర్తి చార్జ్‌పై 80 కిలోమీటర్ల రేంజ్‌ను (ఎకో మోడ్‌లో) ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

Bajaj Chetak EV vs TVS iQube EV: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

చార్జింగ్ సమయాన్ని పరిశీలిస్తే, ఈ స్కూటర్ లోని బ్యాటరీలను కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. వీటిని పూర్తి ఛార్జ్ చేయటానికి సుమారు ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో లభిస్తుంది. దీని సాయంతో స్కూటర్‌కు సంబంధించిన అనేక అంశాలను స్మార్ట్ ఫోన్ ద్వారా యాక్సెస్ చేసుకోవ్చచు. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, పెద్ద టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, క్యూ-పార్క్ అసిస్ట్ మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Bajaj Chetak EV vs TVS iQube EV: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

బజాజ్ చేతక్ ఈవీ : బ్యాటరీ, రేంజ్, ఫీచర్లు

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.8 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఐపి67 రేటెడ్ 3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్‌పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ (ఎకో మోడ్‌లో)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Bajaj Chetak EV vs TVS iQube EV: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

బజాజ్ చేతక్ ఈవీ గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో ఇది రెట్రో-మోడ్రన్ స్టైల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్ మోడ్‌లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు. ఇందులోని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటానికి 5 గంటల సమయం పడుతుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్, యుఎస్‌బి పోర్ట్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 1, 2022, 11:54 [IST]
English summary
Bajaj chetak ev vs tvs iqube ev electric scooter sales in february 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+