మార్కెట్లో బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X) విడుదల.. ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో మార్కెట్లో సమ సరికొత్త 125సీసీ ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X) విడుదల చేసింది. భారత విపణిలో ఈ కొత్త మోటార్‌సైకిల్ ధర రూ. 71,354 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

బజాజ్ ఆటో గతంలో విక్రయించిన డిస్కవర్ 125, ఎక్స్‌సిడి 125 మోటార్‌సైకిళ్లను కంపెనీ డిస్‌కంటిన్యూ చేసిన తర్వాత ఈ విభాగంలో కంపెనీ నుండి వచ్చిన సరికొత్త 125సీసీ బైక్ ఈ సిటి125ఎక్స్.ఈ ధర వద్ద, ఇది దేశంలోనే అత్యంత సరసమైన 125 సిసి బైక్‌గా మారింది.

మార్కెట్లో బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X) విడుదల.. ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొత్త బజాజ్ సిటి125ఎక్స్ మూడు రంగులలో అందుబాటులోకి వచ్చింది. వీటిలో గ్రీన్ అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ మరియు బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుత బజాజ్ CT110X యొక్క 125సీసీ వెర్షనే ఈ కొత్త బజాజ్ CT125X. కాబట్టి, ఇది డిజైన్ మరియు స్టైలింగ్ చూడటానికి సిటి110ఎక్స్ మాదిరిగానే ఉంటుంది. బైక్ ముందు భాగంలో హాలోజన్ బల్బ్‌తో కూడిన గుండ్రటి హెడ్‌లైట్, హెడ్‌లైట్ పైన అమర్చిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ వంటి బేసిక్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ బైక్ స్టాండర్డ్ సిటి110 మాదిరిగానే అదే విధమైన నేక్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

మార్కెట్లో బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X) విడుదల.. ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఇందులోని V- ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆల్-బ్లాక్ ఎఫెక్ట్‌తో కూడిన హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్ సెటప్‌తో ఈ మోటార్‌సైకిల్ కొంచెం స్పోర్టీగా కనిపిస్తుంది. అయితే, కొత్త బజాజ్ సిటి125ఎక్స్‌ దాని 110సీసీ మోడల్ కన్నా ఎక్కువ పవర్ మరియు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కొత్త బజాజ్ మోటార్‌సైకిల్ పై '125X' బ్యాడ్జింగ్, కొద్దిగా భిన్నమైన గ్రాఫిక్స్, రిబ్బెడ్ సీట్ మరియు బ్లాక్ కలర్ కిక్ రాడ్ వంటి కొన్ని మార్పులను ఉన్నాయి. అలాగే, ఇందులో టైప్-A యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌ కూడా ఉంటుంది.

మార్కెట్లో బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X) విడుదల.. ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఇంకా ఇందులో ఇంజన్ దిగువ భాగంలో ఇంజన్ మరియు సైలెన్సర్లను రక్షించే క్రాష్ గార్డ్, సైలెన్సర్ ఎగువన జోడించిన లగేజీ క్యారియర్, సైడ్ క్రాష్ గార్డ్, హ్యాండిల్‌బార్‌పై రబ్బర్ గ్రిప్‌లు, ముందు మరియు వెనుక భాగంలో సెమీ-నాబీ టైర్లు, ఫోర్క్ లలోకి దుమ్ము, దూళి చేరకుండే ఉండేందుకు ఫోర్క్ గైటర్‌లు మరియు వెనుక గ్రాబ్ రెయిల్ పై అమర్చిన లగేజ్ క్యారియర్‌ వంటి విశిష్టమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

మార్కెట్లో బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X) విడుదల.. ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

మెకానికల్స్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ గ్యాస్ ఛార్జ్డ్ స్ప్రింగ్ లోడ్ రియర్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. మెరుగైన బ్రేకింగ్‌ కోసం ముందు భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటాయి. ఈ బైక్‌ లో ముందు వైపు 80/100 ప్రొఫైల్ టైర్ మరియు వెనుక వైపు 100/90 ప్రొఫైల్ టైరు ఉంటాయి. ఇవి రెండూ కూడా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ పై అమర్చబడి ఉంటాయి. బెటర్ రోడ్ గ్రిప్ మరియు కంట్రోల్ కోసం బైక్ వెనుక టైర్ పెద్దదిగా ఉంటుంది.

మార్కెట్లో బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X) విడుదల.. ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త బజాజ్ సిటి125ఎక్స్ 125సీసీ డిటిఎస్-ఐ, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 10 బిహెచ్‌పి పవర్ ను మరియు 11 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. బజాజ్ ఆటో నుండి కొత్తగా వచ్చిన సిటి125ఎక్స్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలోని 125సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లైన హోండా ఎస్‌పి125, హోండా షైన్, హీరో గ్లామర్, హీరో సూపర్ స్ప్లెండర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

మార్కెట్లో బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X) విడుదల.. ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న బజాజ్ సిటి100ఎక్స్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇది 115సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8.5 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 9.81 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ మోడల్ కేవలం 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. మార్కెట్లో Bajaj CT110X మోటార్‌సైకిల్ ధరలు రూ. 66,298 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి. కాగా, ఈ పాత సిటి110ఎక్స్ మోడల్ కన్నా కొత్త సిటి125ఎక్స్ ధర కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఎక్కువగా ఉంటుంది.

మార్కెట్లో బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X) విడుదల.. ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఇదిలా ఉంటే, బజాజ్ ఆటో 350cc మిడిల్-వెయిట్ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. సమాచారం ప్రకారం, బజాజ్ ఆటో ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిళ్లకు పోటీగా బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ భాగస్వామ్యంతో ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ అభివృద్ధి దశలో ఉంది, ఇది ఇటీవల యూకేలో పరీక్షిస్తున్నట్లు గుర్తించబడింది. ఈ మోడల్ పేరు ఇంకా ఖరారు కాలేదు. నివేదికల ప్రకారం, ఇరు కంపెనీలు ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను ఈ ఏడాది చివరి లోపుగా భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Bajaj ct 125x commuter motorcycle launched price specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X