ధరల పెరుగుల జాబితాలో చేరిన Bajaj Dominar: ఇప్పుడు ప్రారంభ ధర ఎంతంటే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' (Bajaj Auto) తన ఉత్పత్తులలో ఒకటైన డామినార్ యొక్క ధరలను పెంచినట్లు తెలిపింది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు తమ ఉత్పతుల ధరలను పెంచాయి, ఇప్పుడు ఆ బాటలోనే బజాజ్ కూడా డామినార్ ధరలను పెంచింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కంపెనీ నివేదికల ప్రకారం, బజాజ్ డామినార్ 250 (Bajaj Dominar 250) బైక్ ధర ఇప్పుడు రూ. 5,000 పెరిగింది. ధరల పెరుగుదల తరువాత డామినార్ 250 ప్రారంభ ధర రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). అదే విధంగా బజాజ్ డామినార్ 400 (Bajaj Dominar 400) ధర రూ. 4,000 వరకు పెరిగింది. కావున ఇప్పుడు డామినార్ 400 ప్రారంభ ధర రూ. రూ. 2.17 లక్షలు (ఎక్స్-షోరూమ్).

బజాజ్ డామినార్ 250 మోటార్‌సైకిల్‌లో 248సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 26.6 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 23.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో జతచేయబడి ఉంటుంది.

బజాజ్ డామినార్ 400 విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్‌లో 373 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 39.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో జతచేయబడి ఉంటుంది.

బజాజ్ డామినార్ రేంజ్ బైకులు కేవలం రెండు కలర్ ఆప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి ఆరో గ్రీన్ మరియు చార్కోల్ బ్లాక్. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున బైక్ రైడర్ కి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి.

బజాజ్ డామినార్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది, ఇందులో ఎల్ఈడీ ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందుబటులో ఉన్నాయి. ఇందులోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బైక్ గురించి చాలా సమాచారాన్ని రైడర్ కి తెలియజేస్తుంది.

డామినార్ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ మరియు వెనుకవైపు మల్టీ-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్‌ను పొందుతుంది. అదే విధంగా ఏ బైక్ యొక్క ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 230 మిమీ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అమర్చబడి ఉంటుంది.

డామినార్ బైక్ 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, బైక్ యొక్క ముందు భాగంలో 100/80-17 ట్యూబ్‌లెస్ టైర్లు మరియు వెనుకవైపు 130/70-17 టైర్లను కలిగి ఉంటాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14-లీటర్ల వరకు ఉంటుంది. కావున ఇది లాంగ్ డ్రైవ్ సమయంలో కూడా వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇదిలా ఉండగా భారత మార్కెట్లో తన డామినార్ 250 యొక్క కొత్త స్పెషల్ డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త డామినార్ 250 బైక్ ధర రూ. 1,54,176 (ఎక్స్-షోరూమ్). బజాజ్ డామినార్ 250 యొక్క డ్యూయల్ టోన్ వేరియంట్‌ను ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఇందులో రేసింగ్ రెడ్ & మ్యాట్ సిల్వర్, సిట్రస్ రష్ & మ్యాట్ సిల్వర్ మరియు స్పార్కింగ్ బ్లాక్ & మ్యాట్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి.

కంపెనీ తన కొత్త బజాజ్ డామినార్ 250 శ్రేణిని మార్కెట్లో మరింత విస్తరించేందుకు మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. బజాజ్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త కలర్ బైకులలో కొత్త కలర్ ఆప్సన్స్ తప్పా, మిగిలిన ఎలాంటి మార్పులు జరగలేదు. కొత్త బజాజ్ డామినార్ 250 డ్యూయల్ టోన్ ఎడిషన్‌లో కనిపించే స్పెషల్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బైక్‌కు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు రివర్స్ ఎల్సిడి స్క్రీన్ ఇవ్వబడింది. ఇది రైడింగ్ సమయంలో వాహన వినియోగదారునికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








