'ప్లాటినా 110 ABS' లాంచ్ చేసిన బజాజ్ ఆటో: ధర రూ. 72,224

దేశీయ మార్కెట్లో బజాజ్ ఆటో ఎట్టకేలకు తన అప్‌డేట్ 'ప్లాటినా 110 ఏబీఎస్' (Platina 110 ABS) లాంచ్ చేసింది. ఈ అప్డేటెడ్ బైక్ ధర రూ. 72,224 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశీయ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ అనేది 110 సీసీ సెగ్మెంట్‌లో ABS పొందిన బైక్. ఇది 115.45 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ పొందుతుంది. ఇంజిన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ప్లాటినా 110 ABS లాంచ్ చేసిన బజాజ్ ఆటో

అప్డేటెడ్ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ (Bajaj Platina 110 ABS) ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇది బైక్ గురించి రైడర్ కి చాలా సమాచారం అందిస్తుంది. ఇందులో ఏబీఎస్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు గేర్ గైడెన్స్ ఫంక్షన్‌ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ బైక్ నాలుగు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి ఎబోనీ బ్లాక్, గ్లోస్ ప్యూటర్ గ్రే, కాక్‌టెయిల్ వైన్ రెడ్ మరియు సఫైర్ బ్లూ. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కావున కొనుగోలుదారులు ఇందులో తమకు నచ్చిన కలర్ ఆప్సన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం బజాజ్ ప్లాటినా 110 ABS తన విభాగంలో ఖరీదైన బైక్ గా మారిపోయింది.

ప్లాటినా 110 ABS మంచి సౌకర్యవంతమైన సీట్లు కలిగి ఉంటుంది. కావున ఇది ఇది రైడింగ్ సమయంలో మంచి కంఫర్ట్ అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఆధునిక హెడ్‌లైట్‌ సెటప్ ఉండటం వల్ల రైడర్ కి స్పష్టమైన దృశ్యమానతను అందిస్తాయి. ఈ అప్డేటెడ్ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జార్బర్‌ వంటి వాటిని పొందుతుంది.

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు వెనుక భాగంలో డ్రమ్‌తో ముందు భాగంలో డిస్క్ కలిగి ఉంటుంది. కావున బ్రేకింగ్ సిస్టం చాలా షార్ప్ గా ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ మంచి సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ సిస్టం వంటివి పొందటంతో పాటు ఆధునిక ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.

అప్డేటెడ్ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ లాంచ్ సందర్భంగా బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనాడే మాట్లాడుతూ.. భారతదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 45 శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. కావున ప్రయాణికులు భయాందోళనలకు గురవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్లాటినా 110 ABSతో రావడం వల్ల క్లిష్టతరమైన రైడింగ్ పరిస్థితులను కూడా ఇది అధిగమించగలదు. కావున బ్రేకింగ్ టెక్నాలజీ పరంగా ఇది సురక్షితమైనదిగా ఉంటుందని అన్నారు.

'బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్'పై మా అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే 110 సీసీ సెగ్మెంట్‌లో ABS పొందిన బైక్ బజాజ్ ప్లాటినా 110 కావడం సంతోషించదగ్గ విషయం. రానున్న రోజుల్లో మరిన్ని ద్విచక్ర వాహనాలు ఈ విభాగంలో చేరే అవకాశం కూడా ఉందని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 20, 2022, 11:48 [IST]
English summary
Bajaj platina 110 abs launched price feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+