'బజాజ్ ప్లాటినా 110 ABS' లో తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు, ఇవే: ఇక్కడ చూడండి

ఇటీవల భారతీయ మార్కెట్లో బజాజ్ ఆటో తన ప్లాటినా 110 ABS మోటార్‌సైకిల్‌ విడుదల చేసింది. 110 సీసీ సెగ్మెంట్‌లో ABS పొందిన మొదటి బైక్ ఈ ప్లాటినా 110. ఈ బైక్ కొనాలనుకునే వారు తప్పకుండా తెలుసుకోవలసిన 5 విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ధర:

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త అప్డేటెడ్ 'ప్లాటినా 110 ఏబీఎస్' (Platina 110 ABS) ధర రూ. 72,224 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ ధర దాని స్టాండర్డ్ 'బజాజ్ ప్లాటినా 110' కంటే కూడా రూ. 3,680 ఎక్కువ ఖరీదైనది. అయితే ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బైకులో ఇప్పుడు 'ఏబీఎస్' (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం) అందుబాటులో ఉంది.

బజాజ్ ప్లాటినా 110 ABS లో తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు

ఫీచర్స్:

కొత్త అప్డేటెడ్ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ (Bajaj Platina 110 ABS) ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇది బైక్ గురించి రైడర్ కి చాలా సమాచారం అందిస్తుంది. ఇందులో ఏబీఎస్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు గేర్ గైడెన్స్ ఫంక్షన్‌ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇంజిన్ & పర్ఫామెన్స్:

అప్డేటెడ్ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ (Bajaj Platina 110 ABS) 115.45 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ పొందుతుంది. ఇంజిన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.

కలర్ ఆప్సన్స్:

బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ బైక్ నాలుగు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి ఎబోనీ బ్లాక్, గ్లోస్ ప్యూటర్ గ్రే, కాక్‌టెయిల్ వైన్ రెడ్ మరియు సఫైర్ బ్లూ. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కావున కొనుగోలుదారులు ఇందులో తమకు నచ్చిన కలర్ ఆప్సన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం బజాజ్ ప్లాటినా 110 ABS తన విభాగంలో ఖరీదైన బైక్ గా మారిపోయింది.

ఇతర వివరాలు (బ్రేకింగ్ & సస్పెన్షన్):

ప్లాటినా 110 ABS బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జార్బర్‌ వంటి వాటిని పొందుతుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు వెనుక భాగంలో డ్రమ్‌తో ముందు భాగంలో డిస్క్ కలిగి ఉంటుంది. కావున బ్రేకింగ్ సిస్టం చాలా షార్ప్ గా ఉంటుంది. కావున రైడింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రత్యర్థులు:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త అప్డేటెడ్ బజాజ్ ప్లాటినా 110 ABS మోటార్‌సైకిల్, హోండా మోటార్‌సైకిల్ కంపెనీ యొక్క సిడి 110 డ్రీమ్, హీరో ప్యాషన్ ప్రో మరియు TVS స్టార్ సిటీ ప్లస్ వంటి ఇతర కమ్యూటర్ మోటార్‌సైకిళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అదే సమయంలో ఇది దాని స్టాండర్డ్ మోడల్ ప్లాటినా 110 కి కూడా ప్రత్యర్థిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కావున మార్కెట్లో కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

భారతదేశంలో చాలా కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే 110 సీసీ సెగ్మెంట్‌లో ABS పొందిన మొదటి బైక్ బజాజ్ ప్లాటినా 110 కావడం సంతోషించదగ్గ విషయం. రానున్న రోజుల్లో మరిన్ని ద్విచక్ర వాహనాలు తప్పకుండా ఈ విభాగంలో చేరే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 24, 2022, 6:30 [IST]
English summary
Bajaj platina 110 abs top highlights in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+