పల్సర్ ప్రేమికుల కోసం.. బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌: ధర ఎంతంటే?

ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' దేశీయ మార్కెట్లో 'పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌' విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర, వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌' ప్రారంభ ధర రూ. 89,254 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి సింగిల్ సీట్ వేరియంట్ మరియు స్ప్లిట్ సీట్ వేరియంట్స్.

పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌ లాంచ్ చేసిన బజాజ్

బజాజ్ యొక్క కొత్త పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌ సింగిల్ సీట్ వేరియంట్ ధర రూ. 89,254 కాగా, స్ప్లిట్ సీట్ వేరియంట్ ధర రూ. 91,642 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అదే సమయంలో ఈ బైక్ బ్లూ మరియు రెడ్ అనే రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అయితే ఈ రెండు వెర్షన్లు బ్లాక్ కలర్ కోటింగ్ పొందుతాయి. కాగా వీల్స్, ఫ్యూయల్ ట్యాంక్, వెనుక ప్యానెల్‌లతో సహా వివిధ బాడీ ప్యానెల్‌లపై కార్బన్ ఫైబర్ గ్రాఫిక్‌లను చూడవచ్చు.

ఈ బైక్ యొక్క గ్రాఫిక్ డిజైన్ కాకుండా ఇందులో ఎటువంటి ఇంజిన్ అప్డేట్స్ లేదు. కావున ఈ కొత్త 'బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌' అదే 124.4 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.64 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.80 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌ లాంచ్ చేసిన బజాజ్

కొత్త పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయెల్ షాక్ అబ్జార్బర్ పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 240 మిమీ డిస్క్ బ్రేక్ (ముందు వైపు), 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ (వెనుక వైపు) పొందుతుంది.

బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ 80/100 x 17 (ముందు భాగంలో) మరియు 100/90-17 (వెనుక భాగంలో) ట్యూబ్‌లెస్ టైర్‌లతో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. ఇక డిజైన్ మరియు ఫీచర్స్ దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. అయితే పల్సర్ 125 యొక్క స్ప్లిట్ సీట్ వెర్షన్ స్ప్లిట్ గ్రాబ్ రైల్స్‌ పొందుతుంది, సింగిల్ సీట్ వెర్షన్‌లో వన్-పీస్ గ్రాబ్ రైల్ మాత్రమే లభిస్తుంది.

పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌ లాంచ్ చేసిన బజాజ్

భారాతీయ మార్కెట్లో టూ వీలర్ విభాగంలో బజాజ్ పల్సర్ మంచి అమాంకాలతో ముందుకు సాగుతోంది. ఈ సమయంలో కంపెనీ మరో అప్డేటెడ్ బైక్ విడుదక చేయడం వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే ఈ కొత్త బైక్ ఎలాంటి అమ్మాకాలను పొందుతుంది అనే వివరాలు తెలియాలి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్' తన పల్సర్ 125 నియాన్ ఎడిషన్‌తో పాటు విక్రయించబడే అవకాశం ఉంటుంది. ఈ కొత్త బైక్ దేశీయ విఫణిలో హోండా SP125 మరియు హీరో గ్లామర్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి ఎప్పటికప్పడు సమాచారం తెలుసుకోవడం కోసం 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 16, 2022, 12:07 [IST]
English summary
Bajaj pulsar 125 carbon fibre edition launched price and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+