పల్సర్ 150 బైక్ నిలిపివేసిన బజాజ్.. మరి ఆ స్థానములో ఉన్న బైక్ ఏదో తెలుసా?
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్' యొక్క 'పల్సర్' బైకులు గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. అయితే కంపెనీ ఇప్పుడు పల్సర్ సిరీస్ లో 'పల్సర్ 150' బైకుని నిలిపివేయడానికి సన్నద్దమయిపోయింది.
గత 20 సంవత్సరాలుగా మార్కెట్లో తిరుగులేని అమ్మకాలు పొందిన బజాజ్ 'పల్సర్ 150' ఇప్పుడు ఆశాజనకమైన అమ్మకాలు పొందలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు లేదా అప్డేటెడ్ బైకులు విడుదల కావడమనే చెప్పాలి. అయితే కంపెనీ తమ పల్సర్ 150 ని నిలిపివేయడానికి ముందే కంపెనీ ఆ స్థానంలో 'పల్సర్ పి150' భర్తీ చేసింది. ఈ బైకు ఇటీవలే దేశీయ మార్కెట్లో విడుదలైంది.

బజాజ్ ఆటో తమ పల్సర్ శ్రేణిని విస్తరించడంతో భాగంగానే ఈ పల్సర్ 150 ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగానే కంపెనీ 2022 ఆగష్టు నెలలో తన పల్సర్ 180 ఉత్పత్తిని మరియు 2021 లో పల్సర్ 220 ఉత్పత్తిని నిలిపివేసింది. పల్సర్ 180 మరియు పల్సర్ 220 స్థానంలో పల్సర్ ఎన్ 160 మరియు పల్సర్ 250ఎఫ్ వచ్చాయి. కాగా ఇప్పుడు 2022 లో తాజాగా పల్సర్ 150 నిలిపేయాలని నిర్ణయించుకుంది.
బజాజ్ పల్సర్ 150 బైక్ పల్సర్ 150 నియాన్, పల్సర్ 150 ఎస్‌డి (సింగిల్ డిస్క్), మరియు బజాజ్ పల్సర్ 150 టిడి (ట్విన్ డిస్క్) అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ బజాజ్ పల్సర్ 150 బైక్ యొక్క మూడు వేరియంట్లలో నియాన్ వేరియంట్ అత్యంత సరసమైనది, దీని ధర రూ. 1.04 లక్షలు, కాగా పల్సర్ 150 SD మరియు పల్సర్ 150 TD ధరలు వరుసగా రూ.1.11 లక్షలు మరియు రూ.1.14 లక్షలు (ఎక్స్-షోరూమ్).
బజాజ్ పల్సర్ 150 స్థానంలో విడుదలైన పల్సర్ పి150 విషయానికి వస్తే, దీని ధర రూ. 1,16,755 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ సింగిల్ డిస్క్ (సింగిల్ సీట్) మరియు ట్విన్ డిస్క్ (స్ప్లిట్ సీట్) వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. కొత్త పల్సర్ P150 బైక్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ డిజైన్ దాని మునుపటి మోడల్స్ N160 మరియు N250 నుంచి ప్రేరణ పొందటం జరిగింది.
పల్సర్ పి150 బైక్ బై ఫంక్షనల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్ మరియు చిన్న విండ్‌స్క్రీన్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఇంజన్ కౌల్స్ మరియు ఎల్ఈడీ టైల్‌లైట్స్ ఉన్నాయి. సింగిల్ డిస్క్ వేరియంట్ సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్‌తో పాటు ఒకే సీటును కలిగి ఉంటుంది. కానీ ట్విన్ డిస్క్ మోడల్ స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్‌తో పాటు స్ప్లిట్ సీటును పొందుతుంది.
బజాజ్ పల్సర్ పి150 బైక్ 149 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.5 హెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు కాగా బరువు కేవలం 140 కేజీలు వరకు ఉంటుంది.
కొత్త పల్సర్ పి150 బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సిస్టం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం మీద పల్సర్ 150 నిలిపివేసినప్పటికీ దాని స్థానంలో పల్సర్ పి150 అందుబాటులో ఉంటుంది. కావున పల్సర్ ప్రేమికులు ఏ మాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని కథనాలు ఎప్పటికప్పుడు తెలుసు కోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








