బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో లభ్యం; ధర రూ.1.43 లక్షలు!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj Auto) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పల్సర్ 250 మోడల్‌లో కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. బజాజ్ పల్సర్ 250 శ్రేణిలోని N250 మరియు F250 మోడళ్లు ఇప్పుడు కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో లభ్యం కానున్నాయి. ఈ కొత్త కలర్ స్కీమ్‌తో వచ్చిన రెండు మోడళ్లలో కూడా డిజైన్‌ పరంగా ఎలాంటి మార్పులు లేవు. కరీబియన్ బ్లూ కలర్‌లోని పల్సర్ ఎన్250 ప్రారంభ ధర రూ.1,43,680 కాగా, పల్సర్ ఎఫ్250 ధర రూ.1,44,979 (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో లభ్యం; ధర రూ.1.43 లక్షలు!

కొత్త కరేబియన్ బ్లూ కలర్ ఆప్షన్‌తో పాటుగా కంపెనీ ఈ బైక్ యొక్క అల్లాయ్ వీల్స్‌పై మ్యాచింగ్ కలర్ స్టిక్కర్‌ను కూడా జోడించింది. ఇందులో కొత్త పెయింట్ స్కీమ్ మినహా వేరే ఎలాంటి మార్పులు చేయలేదు. పల్సర్ 250 బైక్స్ విషయానికి వస్తే, ఈ రెండు బైక్‌లు కూడా పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్ మరియు టూ-వాల్వ్ ఇంజన్‌తో పరిచయం చేయబడ్డాయి. ఈ బైక్‌లు 249.07 సిసి సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 24.1 బిహెచ్‌పి పవర్‌ను మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో లభ్యం; ధర రూ.1.43 లక్షలు!

డిజైన్ పరంగా చూస్తే, బజాజ్ తమ పల్సర్ 250 శ్రేణిని ఇతర పల్సర్ బైక్‌ల నుండి వేరు చేయడానికి వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. పల్సర్ ఎఫ్250 సెమీ ఫెయిరింగ్ డిజైన్ ను కలిగి మజిక్యులర్ 14-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, స్టెప్-అప్ సీట్లు, స్ప్లిట్-స్టైల్ టైల్‌లైట్, ట్విన్-బ్యారెల్ ఎగ్జాస్ట్‌ మరియు పొడవైన విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇక పల్సర్ ఎన్250 విషయానికి వస్తే, ఇది ఫెయిరింగ్ లేకుండా వస్తుంది. ఈ ప్రధాన మార్పు మినహా మిగిలిన అన్ని డిజైన్ ఎలిమెంట్స్ దాని ఎఫ్250 మోడల్ మాదిరిగానే ఉంటాయి.

బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో లభ్యం; ధర రూ.1.43 లక్షలు!

ఈ రెండు మోడళ్లలో ఎఫ్250 సెమీ-ఫైర్డ్ వెర్షన్ కాగా, ఎస్250 మోడల్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ వెర్షన్. ఈ రెండు బైక్‌లు కూడా ఇతర పల్సర్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే చాలా సాంప్రదాయిక డిజైన్‌ను కలిగి ఉంటాయి. వీటిపై షార్ప్ లైన్‌లు మరియు మరింత ట్రెడిషనల్‌గా కనిపించే వైఖరి ఉంటుంది. అయితే, సెమీ-ఫెయిరింగ్‌తో కూడిన కొత్త బజాజ్ ఎఫ్250 దాని నేక్డ్ కౌంటర్ బజాజ్ ఎన్250 కంటే కొంచెం పెద్దదిగా మరియు టూరింగ్-ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపిస్తుంది. వీటిలో ఎన్250 బరువు 162 కిలోలుగా ఉంటే, మరియు ఎఫ్250 164 కిలోలుగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో లభ్యం; ధర రూ.1.43 లక్షలు!

పల్సర్ 250లోని ఇతర కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది బ్లాక్, సిల్వర్ మరియు రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఇందులో కరేబియన్ బ్లూ అనే నాల్గవ కలర్ ఆప్షన్ ను పరిచయం చేశారు. కాగా, కంపెనీ భవిష్యత్తులో మరిన్ని ఇతర కలర్ ఆప్షన్లను జోడించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త పల్సర్ 250 ట్యూబులర్ ఛాసిస్‌పై నిర్మించబడింది.

బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో లభ్యం; ధర రూ.1.43 లక్షలు!

ఇక మెకానికల్స్ విషయానికి వస్తే, ఈ రెండు మోడళ్లలో ముందు వైపు 37 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు నైట్రోక్స్ మోనో షాక్‌ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ ఫీచర్లను గమనిస్తే, ఈ రెండు మోడళ్లలో ముందు వైపు 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రెండూ సింగిల్ ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఇరువైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో లభ్యం; ధర రూ.1.43 లక్షలు!

కొత్త పల్సర్‌లో సింగిల్ పాడ్ LED హెడ్‌లైట్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఈ హెడ్‌లైట్ ప్రొజెక్షన్ మరియు పొజిషన్ రెండింటికీ పనిచేస్తుంది. బైక్ వెనుక భాగంలో స్ప్లిట్-స్టైల్ LED టైల్‌లైట్‌ సెటప్ ఉంటుంది. బజాజ్ పల్సర్ 250 బైక్స్ లో టాకోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, గేర్-పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ ఫ్యూయల్ గేజ్, క్లాక్ మొదలైన వివరాలను తెలియజేసే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఈ లేటెస్ట్ మోడళ్లలో అధునాతన కనెక్టివిటీ ఫీచర్ లేకపోవడం గమనార్హం.

బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు కొత్త కరేబియన్ బ్లూ కలర్‌లో లభ్యం; ధర రూ.1.43 లక్షలు!

ఆరు నెలల్లో 10,000 యూనిట్ల పల్సర్ 250 బైక్స్ విక్రయం

బజాజ్ ఆటో తమ పల్సర్ 250సిసి బైక్స్ (Pulsar N250 మరియు Pulsar F250)ని విడుదల చేసి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. ఈ ఆరు నెలల వ్యవధిలో కంపెనీ ఇప్పటి వరకూ 10,000 యూనిట్లకు పైగా పల్సర్ ఎన్250 మరియు పల్సర్ ఎఫ్250 బైక్‌లను విక్రయించినట్లు తెలిపింది. ప్రకటించింది. బజాజ్ ఆటో ప్రకారం, ఈ పల్సర్ 250 ట్విన్స్ 10,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన 250cc మోటార్‌సైకిల్‌గా అని కంపెనీ తెలిపింది. ఇవి ఈ విభాగంలో Yamaha FZ25 మరియు Suzuki Gixxer 250 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.

Most Read Articles

English summary
Bajaj pulsar 250 now available in caribbean blue colour details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X