స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో బజాజ్ ఆటో (Bajaj Auto) రెండు సరికొత్త బజాజ్ పల్సర్ (Bajaj Pulsar) బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి Pulsar N250 బైక్ కాగా, మరొకటి Pulsar F250. విడుదల సమయంలో వీటి ధరలు వరుసగా రూ. 1.38 లక్షలు మరియు రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే కంపెనీ ఇప్పుడు ఈ బైకుల ధరలను పెంచినట్లు తెలిపింది దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం, బజాజ్ పల్సర్ ఎన్250 ధర రూ. 1,117 పెరిగింది. ధరల పెరుగుదల తరువాతజ ఈ బైక్ ధర రూ. 1,39,117. అదే విధంగా బజాజ్ పల్సర్ ఎఫ్250 ధర రూ. 915 పెరిగి రూ. 1,40,915 కి చేరుకుంది. ధరల పెరుగుదల జాబితాలో బజాజ్ యొక్క పల్సర్ శ్రేణి కూడా ఇప్పుడు చేరిపోయింది.

స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

Pulsar N250 మరియు Pulsar F250 ధరలు తక్కువ మొత్తంలోనే పెరగటం వల్ల ఇవి కొనుగోలుదారులపైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం లేదు. బజాజ్ యొక్క ఈ రెండు బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కొత్త Bajaj Pulsar 250 బైకులు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటాయి.

స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

Bajaj Pulsar 250 బైకులు ఇప్పుడు ట్యూబ్‌లెస్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడ్డాయి. ఇది చూడటానికి చాలా ఏరోడైనమిక్‌గా రూపొందించింది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ మరియు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈ బైక్ ముందు భాగం అగ్రెసివ్ లుక్ లో ఉంటుంది. ఈ బైక్ యొక్క ప్రధాన హెడ్‌లైట్‌కి రెండు వైపులా లైట్లు ఉన్నాయి.

స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

కొత్త Bajaj Pulsar 250 బైక్స్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని టాకోమీటర్ దాని మునుపటి మోడల్ నుంచి తీసుకోబడింది. ఐతే కాకుండా ఈ బైక్ డిజిటల్ స్క్రీన్ కూడా పొందుతుంది. ఈ స్క్రీన్ బైక్ యొక్క పరిధి, గేర్ పొజిషన్ మరియు డిస్టెన్స్ టూ ఎంప్టీ వాటి సమాచారాన్ని అందిస్తుంది.

స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

ఇప్పుడు ఈ కొత్త అప్డేటెడ్ బైకులలో USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్‌ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడు 14 లీటర్లు, మరియు సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంది. మొత్తానికి ఈ బైక్ స్టైలిష్ గా మరియు వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

Bajaj Pulsar యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో టెలీస్కోపిక్ ఫోర్క్స్ మరియు కొత్త మోనోషాక్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది, కావున ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ అసిస్ట్ మరియు స్లీపర్ క్లచ్‌తో కూడా వస్తుంది, కావున ఇది వేగవంతమైన గేర్‌షిఫ్ట్‌లలో సహాయపడుతుంది.

స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

Bajaj Pulsar 250 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 24.5 బిహెచ్‌పి పవర్ మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

ఈ కొత్త బైక్స్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. అంతే కాకుండా ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌కు దాదాపు 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది. Bajaj Pulsar 250 ముందువైపు 100/80 ప్రొఫైల్ టైర్లను మరియు వెనుకవైపు 17-ఇంచెస్ వీల్స్ తో 130/70 ప్రొఫైల్‌ను పొందుతుంది.

స్వల్పంగా పెరిగిన Bajaj Pulsar 250 ధరలు.. పూర్తి వివరాలు

ఈ బైక్ ఇప్పుడు టెక్నో గ్రే మరియు రేసింగ్ రెడ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క పనితీరు మునుపటికంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. భారతదేశంలో, పల్సర్ 250 బైకులు, సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250, యమహా FZ 25, కెటిఎమ్ 250 డ్యూక్ మరియు హస్క్‌వర్నా విట్‌పిలెన్ 250 వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.ఏది ఏమైనా ఇప్పుడు పెరిగిన ధరలు కంపెనీ యొక్క అమ్మకాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అం విషయం కూడా త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 14, 2022, 16:31 [IST]
English summary
Bajaj pulsar 250 range price increased upto rs 1117 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+