ట్రేడ్‌మార్క్ కోసం రెండు కొత్త పేర్లు.. బజాజ్ నుండి కొత్త క్లాసిక్ పల్సర్ బైక్‌లు రానున్నాయా..?

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీలలో ఒకటైన బజాజ్ ఆటో (Bajaj Auto), దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ మోటార్‌సైకిల్ పల్సర్ (Bajaj Pulsar) లో కంపెనీ త్వరలోనే మరో రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా, బజాజ్ ఆటో భారతదేశంలో రెండు కొత్త పల్సర్ పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది, వీటిలో 'పల్సర్ ఎలాన్' (Pulsar Elan) మరియు 'పల్సర్ ఎలిగాంజ్' (Pulsar Eleganz) అనే పేర్లు ఉన్నాయి. కంపెనీ ఈ పేర్ల ట్రేడ్‌మార్క్ కోసం మార్చి 2022లో ఫైలింగ్ చేసింది.

ట్రేడ్‌మార్క్ కోసం రెండు కొత్త పేర్లు.. బజాజ్ నుండి కొత్త క్లాసిక్ పల్సర్ బైక్‌లు రానున్నాయా..?

ఈ పేర్లను బట్టి చూస్తుంటే, బజాజ్ ఆటో నుండి రానున్న ఈ రెండు కొత్త మోటార్‌సైకిళ్లు ప్రస్తుత పల్సర్ మోడల్ సిరీస్‌లోనే భాగంగా ఉంటాయని తెలుస్తోంది. కాకపోతే, ఇవి క్లాసిక్ పల్సర్ మోడళ్లుగా ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. బజాజ్ ఆటోకి ప్రస్తుతం రెట్రో-థీమ్ తో ఉండే మోటార్‌సైకిళ్లు లేవు. ఇటీవలి కాలంలో భారతదేశంలో రెట్రో-థీమ్ మోటార్‌సైకిళ్ల మార్కెట్ స్థిరంగా పెరుగుతోంది. కాబట్టి బజాజ్ నుండి రాబోయే పల్సర్ ఎలాన్ మరియు పల్సర్ ఎలిగాంజ్ మోడళ్లు రెట్రో రూపాన్ని కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

ట్రేడ్‌మార్క్ కోసం రెండు కొత్త పేర్లు.. బజాజ్ నుండి కొత్త క్లాసిక్ పల్సర్ బైక్‌లు రానున్నాయా..?

అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిళ్లలో ఒకటి 200 సిసి లేదా 250 సిసి పవర్‌ట్రెయిన్‌తో కూడా అందించబడుతుందని తెలుస్తోంది. కాగా, ఇతర మోడల్ మరింత పొదుపుగా ఉండే 150 సిసి లేదా 180 సిసి ఇంజన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుత, నివేదికల ప్రకారం, బజాజ్ ఇప్పుడు ఎలాంటి కొత్త ఉత్పత్తిని అభివృద్ధి చేస్తున్నట్లు కనిపించడం లేదు. బహుశా, భవిష్యత్తులో బజాజ్ ఆటో తీసుకురాబోయే కొత్త మోడళ్ల ప్రయోజనాల కోసం ఈ పేర్లను లాక్ చేయడానికి గానూ ఈ ఫైలింగ్ దాఖలు చేసిఉండచ్చని సమాచారం.

ట్రేడ్‌మార్క్ కోసం రెండు కొత్త పేర్లు.. బజాజ్ నుండి కొత్త క్లాసిక్ పల్సర్ బైక్‌లు రానున్నాయా..?

ఇదిలా ఉంటే, ఇటీవల బజాజ్ ఆటో తమ పల్సర్ ఎఫ్250 మోటార్‌సైకిల్‌ లో కొత్త ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్ ను కూడా పరిచయం చేసింది. కొత్తగా పరిచయం చేయబడిన ఈ కలర్ ఆప్షన్ డార్క్ బ్లూ కలర్ లో ఉంది. ఇది ఇతర బజాజ్ మోటార్‌సైకిళ్లైన పల్సర్ 220F, పల్సర్ NS200, పల్సర్ 150, పల్సర్ NS125, ప్లాటినా 110ES మరియు CT100 వంటి వాటిలో ఉపయోగించిన బ్లూ కలర్ కన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ కొత్త బ్లూ కలర్ ఆప్షన్‌ను పరిచయం చేయడానికి ముందు, కొత్తగా ప్రవేశపెట్టిన బజాజ్ N250 మరియు F250 మోటార్‌సైకిళ్లు కేవలం రెండు కలర్ ఆప్షన్లలో (టెక్నో గ్రే మరియు రేసింగ్ రెడ్) మాత్రమే విక్రయించబడేవి.

ట్రేడ్‌మార్క్ కోసం రెండు కొత్త పేర్లు.. బజాజ్ నుండి కొత్త క్లాసిక్ పల్సర్ బైక్‌లు రానున్నాయా..?

కొత్త బజాజ్ పల్సర్ ఎఫ్250 బైక్ లో ఎల్ఈఢి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ముందు మరియు వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి మరిన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లతో పాటు, కొత్త బజాజ్ పల్సర్ ఎఫ్250 సాంప్రదాయ అనలాగ్ టాకోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, గేర్-పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ ఫ్యూయల్ గేజ్, గడియారం మరియు యూఎస్‌బి చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

ట్రేడ్‌మార్క్ కోసం రెండు కొత్త పేర్లు.. బజాజ్ నుండి కొత్త క్లాసిక్ పల్సర్ బైక్‌లు రానున్నాయా..?

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త బజాజ్ పల్సర్ ఎఫ్250 లో సరికొత్త 249 సిసి, సింగిల్-సిలిండర్, 2-వాల్వ్, ఆయిల్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 23.5 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 21.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్ క్లచ్‌తో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ లో ముందువైపు 300 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 230 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ సింగిల్-ఛానల్ ABS ను సపోర్ట్ చేస్తాయి.

ట్రేడ్‌మార్క్ కోసం రెండు కొత్త పేర్లు.. బజాజ్ నుండి కొత్త క్లాసిక్ పల్సర్ బైక్‌లు రానున్నాయా..?

డొమినార్ 250 (Dominar 250) లో కొత్త అల్లాయ్ వీల్స్

బజాజ్ బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ కంపెనీ భారత మార్కెట్లో డొమినార్ సిరీస్ క్రింద రెండు మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా. కంపెనీ ఇప్పుడు ఇందులో బజాజ్ డొమినార్ (Bajaj Dominar) మోటార్‌సైకిల్ యొక్క 250 సీసీ వేరియంట్ ను సైలెంట్ గా అప్‌డేట్ చేసింది. కొత్త 2022 బజాజ్ డొమినార్ 250 ఇప్పుడు స్టైలిష్ బ్లాక్-అవుట్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో లభిస్తుంది. ఈ ఒక్క మార్పు మినహా కొత్త బజాజ్ డొమినార్ 250లో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

ట్రేడ్‌మార్క్ కోసం రెండు కొత్త పేర్లు.. బజాజ్ నుండి కొత్త క్లాసిక్ పల్సర్ బైక్‌లు రానున్నాయా..?

డిజైన్ పరంగా చూస్తే, కొత్త బజాజ్ డొమినార్ 250 (Bajaj Dominar 250) మరియు బజాజ్ డొమినార్ 400 రెండూ కూడా చాలా దగ్గర పోలికను కలిగి ఉంటాయి. ఈ రెండింటిలో ప్రధానమైన మార్పు దాని ఇంజన్ రూపంలో ఉంటుంది. డొమినార్ 400 (Dominar 400) లో తాజాగా చేసిన అప్‌డేట్ (టూరింగ్ యాక్సెసరీలను స్టాండర్డ్‌గా జోడించడం) కారణంగా ఈ రెండు మోటార్‌సైకిళ్లను వేరు చేయడం సులభం అయ్యింది.

Most Read Articles

English summary
Bajaj pulsar elan and bajaj pulsar eleganz names trademarked details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X