భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' (Bajaj Auto) తన 'పల్సర్ 250' (Pulsar 250) బైకుల ధరలను ఇప్పుడు ఒక్కసారిగా రూ. 4,000 పెంచినట్లు ప్రకటించింది. ఇందులో కంపెనీ యొక్క పల్సర్ ఎన్250 మరియు పల్సర్ ఎఫ్250 బైకులు ఉన్నాయి. బజాజ్ కంపెనీ 2022 ఫిబ్రవరి నెలలో కూడా రూ. 1,000 పెంచింది. ఇప్పుడు మళ్ళీ భారీ మొత్తంలో పెంచడం జరిగింది. ధరల పెరుగుదల తరువాత 'బజాజ్ పల్సర్ ఎన్250' ధర రూ. 1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, 'బజాజ్ పల్సర్ ఎఫ్250' ధర రూ.1.45 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.

భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

ప్రస్తుతం కంపెనీ కేవలం ధరలను పెంచడం మాత్రమే కాకుండా, ఈ బైకులను కొత్త కలర్ ఆప్సన్స్ లో కూడా అందిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ బైకును 'కరీబియన్ బ్లూ' అనే కలర్ లో తీసుకువచ్చింది. ఈ కలర్ చేరడం వల్ల బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు మూడు కలర్స్ లో అందుబాటులో వచ్చింది.

భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

బజాజ్ కంపెనీ తన పల్సర్ 250 బైకులను దేశీయ మార్కెట్లో విడుదల చేసినప్పటినుంచి కేవలం 6 నెలల వ్యవధిలో 10,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లు అధికారికంగా ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ బైకులకు (పల్సర్ ఎన్250 మరియు పల్సర్ ఎఫ్250) మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందొ మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

పల్సర్ 250 బైకులు అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ బైకులు ఇప్పుడు ట్యూబ్‌లెస్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడ్డాయి. ఇది చూడటానికి చాలా ఏరోడైనమిక్‌గా రూపొందించింది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ మరియు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈ బైక్ ముందు భాగం అగ్రెసివ్ లుక్ లో ఉంటుంది.

భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

ఇందులోని టాకోమీటర్ దాని మునుపటి మోడల్ నుంచి తీసుకోబడింది. ఐతే కాకుండా ఈ బైక్ డిజిటల్ స్క్రీన్ కూడా పొందుతుంది. ఈ స్క్రీన్ బైక్ యొక్క పరిధి, గేర్ పొజిషన్ మరియు డిస్టెన్స్ టూ ఎంప్టీ వాటి సమాచారాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త అప్డేటెడ్ బైకులలో USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

బజాజ్ పల్సర్ బైక్‌ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడు 14 లీటర్లు, మరియు సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంది. మొత్తానికి ఈ బైక్ స్టైలిష్ గా మరియు వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, బజాజ్ పల్సర్ 250 బైక్ 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 24.5 బిహెచ్‌పి పవర్ మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది.

భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

పల్సర్ 250 సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో టెలీస్కోపిక్ ఫోర్క్స్ మరియు కొత్త మోనోషాక్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది, కావున ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ అసిస్ట్ మరియు స్లీపర్ క్లచ్‌తో కూడా వస్తుంది, ఇది వేగవంతమైన గేర్‌షిఫ్ట్‌లలో సహాయపడుతుంది.

భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. అంతే కాకుండా ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌కు దాదాపు 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది.

భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

బజాజ్ పల్సర్ 250 బైక్ యొక్క ముందువైపు 100/80 ప్రొఫైల్ టైర్లను మరియు వెనుకవైపు 17-ఇంచెస్ వీల్స్ తో 130/70 ప్రొఫైల్‌ను పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు టెక్నో గ్రే మరియు రేసింగ్ రెడ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క పనితీరు మునుపటికంటే కూడా ఇప్పుడు మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగానే కంపెనీ ఇవి మంచి సంయలో అమ్ముడవుతూ విపరీతమైన డిమాండ్ పొందుతున్నాయి.

భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?

భారతీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ 250 బైక్ యమహా ఎఫ్‌జెడ్, సుజుకి జిక్సర్ 250 మరియు టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి వంటి వాటికీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. మొత్తం మీద ఇప్పుడు కంపెనీ ఒక్కసారిగా రూ. 4,000 పెంచడం వల్ల అమ్మకాలు ఎలా ఉంటాయి అనేది త్వరలో తెలియరావాలి.

More from DriveSpark

Article Published On: Saturday, May 7, 2022, 8:30 [IST]
English summary
Bajaj pulsar f250 and pulsar n250 price hike upto rs 4000 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+