భారతీయ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160: ధర & వివరాలు

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' (Bajaj Auto) భారతీయ మార్కెట్లో తన సరికొత్త 'పల్సర్ ఎన్160' (Pulsar N160) బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 'సింగిల్ ఛానల్ ఏబీఎస్' కాగా, మరొకటి 'డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్'. వీటి ధరలు వరుసగా రూ.1,22,854 మరియు రూ. 1,27,853 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160: ధర & వివరాలు

బజాజ్ కంపెనీ యొక్క కొత్త పల్సర్ ఎన్160 డిజైన్ దాదాపు దాని ఎన్250 బైక్ ను పోలి ఉంటుంది. అయితే ఇది నేక్డ్ స్ట్రీట్ బైక్ మాదిరిగా ఉంది. కానీ ఈ బైక్ అదే సింగిల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ కలిగి ఉంటుంది. అంతే కాకుండా దానికి రెండువైపులా ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. మొత్తం మీద ఇది చూడగానే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160: ధర & వివరాలు

బజాజ్ పల్సర్ ఎన్160 బైక్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్‌తో పాటు ఇప్పుడు ఫ్యూయెల్ ట్యాంక్‌పై కొంత పొడిగింపులను కలిగి ఉంది. ఇది మరింత స్పోర్టివ్ గా ఉంటుంది. ఈ బైక్ స్ప్లిట్ సీట్, అల్లాయ్ వీల్స్ వంటి వాటితోపాటు ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ కలిగి ఉంటుంది. పల్సర్ ఎన్160 బైక్ USB ఛార్జింగ్ పోర్ట్, 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, గేర్ పొజిషన్, క్లాక్, ఫ్యూయల్ ఎకానమీ మరియు రేంజ్ డిస్‌ప్లే చేసే డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160: ధర & వివరాలు

కొత్త బజాజ్ పల్సర్ ఎన్160 యొక్క కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, సింగిల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ మూడు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి కరేబియన్ బ్లూ, రేసింగ్ రెడ్ మరియు టెక్నో గ్రే కలర్స్.

ఇక బజాజ్ పల్సర్ ఎన్160 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ కేవలం సింగిల్ కలర్ ఆప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది 'బ్రూక్లిన్ బ్లాక్' కలర్ ఆప్షన్‌. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కావున తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160: ధర & వివరాలు

కొత్త పల్సర్ ఎన్160 బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 164.82 సిసి 2-వాల్వ్, ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 15.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 14.65 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160: ధర & వివరాలు

బజాజ్ యొక్క ఈ కొత్త బైక్ దాని ఎన్ఎస్160 కంటే కూడా 1.2 బిహెచ్‌పి పవర్ తక్కువ ఉత్పత్తి చేస్తుంది. అయితే పనితీరు అందించడంలో అద్భుతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. కావున ఈ కొత్త బైక్ తప్పకుండా మంచి పనితీరుని అందిస్తుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160: ధర & వివరాలు

కొత్త బజాజ్ పల్సర్ ఎన్160 అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ మరియు బ్రేకింగ్ సిస్టం పొందుతుంది. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ గమనించినట్లయితే దీని ముందువైపు 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు మోనో షాక్ సెటప్ ఉంటుంది. అదే సమయంలో మోటార్‌సైకిల్ 100/80-17 ఫ్రంట్ టైర్ మరియు 130/70-17 రియర్ టైర్‌తో 17-ఇంచెస్ వీల్స్ పొందుతుంది. కావున ఎలాంటి రహదారిలో అయినా సజావుగా ముందుకు సాగుతుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160: ధర & వివరాలు

బజాజ్ పల్సర్ ఎన్160 బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వెర్షన్‌లో 300 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు సింగిల్ ఛానల్ వెర్షన్‌లో 280 మిమీ ఫ్రంట్ డిస్క్ కలిగి ఉంటుంది. అయితే ఈ రెండు వేరియంట్స్ కూడా 230 మిమీ రియర్ డిస్క్‌ పొందుతాయి. సింగిల్ ఛానెల్ వెర్షన్ బరువు 152 కేజీల వరకు ఉంటుంది. అదే విధంగా డ్యూయల్ ఛానెల్ వెర్షన్ 154 కేజీల బరువు కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ మొత్తం మీద రైడర్ కి అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ ఎన్160: ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

బజాజ్ ఆటో గత కొన్ని రోజుల నుంచి తన ఎన్160 బైక్ ని టెస్ట్ చేస్తూనే ఉంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది నిజంగా బజాజ్ ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈ బైక్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుందో త్వరలోనే తెలుస్తుంది.

Most Read Articles

English summary
Bajaj pulsar n160 launched in india specs features details
Story first published: Thursday, June 23, 2022, 9:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X