కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ ఆటో (Bajaj Auto) యొక్క 'పల్సర్ ఎన్ఎస్160' (Pulsar NS160) ఇటీవల కొత్త అప్డేట్ అందుకుంది. మార్కెట్లో ఎక్కువ అమ్మకాలను పొందిన బైకులలో పల్సర్ ఎన్ఎస్160 కూడా ఒకటి. అయితే కంపెనీ ఇప్పుడు దీనికి కొత్త అప్డేట్ అందించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 నేక్డ్ స్పోర్టీ బైక్ అల్లాయ్ వీల్స్‌ ఇప్పుడు కొత్త పెయింట్ స్కీమ్ లో అందుబాటులో ఉంటుంది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఇప్పుడు వైట్ కలర్ ఆప్షన్‌తో బ్లాక్ పెయింట్‌లో అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త పెయింట్ స్కీమ్ అనేది ఈ బైక్ యొక్క డిజైన్ ని మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైక్‌లో బ్లాక్ కలర్ డ్యూయల్ టోన్ పెయింట్‌ను వైట్ కలర్ తో అందించారు, దీని మీద బ్లాక్ అల్లాయ్ వీల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్. దీనికి షార్ప్ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు టర్న్ ఇండికేటర్‌లు ఇవ్వబడ్డాయి.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

ఈ బైక్‌లో ఫ్రంట్ మడ్‌గార్డ్, రియర్ మడ్‌గార్డ్, హెడ్‌లైట్ కౌల్, వైజర్ మరియు ఇంజిన్ గార్డ్ బ్లాక్ టోన్‌లో ఇవ్వబడ్డాయి. ఇది స్పోర్టి బ్లాక్ రియర్ వ్యూ మిర్రర్‌లను పొందుతుంది, ఇది దాని విజువల్ అప్పీల్‌ను మరింత పెంచుతుంది. మొత్తం మీద ఇది చూడచక్కగా ఉంటుంది.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైక్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఇది ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు రియర్ మోనోషాక్ అబ్జార్బర్‌ని పొందుతుంది. ఈ బైక్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో కూడిన సింగిల్ ఛానల్ ఏబీఎస్ అమర్చబడి ఉంటుంది. బైక్ సైడ్ ఫెండర్లలో ఆకర్షణీయమైన 'NS160' గ్రాఫిక్స్ ఇవ్వబడ్డాయి. బైక్ మోనోకోక్ ఛాసిస్‌పై నిర్మించబడింది. వెనుక చక్రం బాక్స్ స్వింగార్మ్‌కు జోడించబడింది.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

పల్సర్ ఎన్ఎస్160 బైక్‌లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ అలారం మరియు ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఆన్ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా ఇందులో అందించబడ్డాయి. అంతే కాకూండా పల్సర్ 150 మరియు పల్సర్ 180 కూడా అదే పెయింట్‌లో 'డాగర్ ఎడ్జ్ ఎడిషన్' పేరుతో ప్రారంభించబడింది.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైక్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇది 160cc సింగిల్ సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 15.3 బిహెచ్‌పి పవర్ మరియు 14.6 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

భారతీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ NS160 ధర రూ. 1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధర వద్ద బజాజ్ పల్సర్ NS160 బైక్ టీవీఎస్ అపాచీ RTR 160 4V, యమహా MT15 మరియు హీరో ఎక్స్ట్రీమ్ 60R వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

ఇదిలా ఉండగా, బజాజ్ కంపెనీ తన అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం ఫిబ్రవరి 2022 లో కంపెనీ 3,16,020 యూనిట్ల అమ్మకాలను జరిపింది. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 3,75,017 యూనిట్లను విక్రయించింది. దీన్నిబట్టి చూస్తే 16 శాతం క్షీణతను నమోదు చేసింది.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

దేశీయ విపణిలో, బజాజ్ ఆటో యొక్క ద్విచక్ర వాహనాల విక్రయాలు ఫిబ్రవరి 2022 లో 96,523 యూనిట్లకు క్షీణించాయి, గత ఏడాది ఇదే నెలలో 1,48,934 యూనిట్లు ఉన్నాయి. ఎగుమతులు విషయానికి వస్తే, 2022 ఫిబ్రవరి నెలలో 1,82,814 యూనిట్స్ అని తెలిసింది. గత సంవత్సరం ఇదే నెలలో 1,83,629 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి. బజాజ్ ఆటో యొక్క మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఫిబ్రవరి 2022 లో 16 శాతం క్షీణించి 2,79,337 యూనిట్లకు పడిపోయాయి.

కొత్త అప్డేట్ అందుకున్న Bajaj Pulsar NS160: ఇప్పుడు మరింత స్టైలిష్ గురూ..!!

ఇక కమర్షియల్ వెహికల్ అమ్మకాల విషయానికి వస్తే, దేశీయ మార్కెట్‌లో 2022 ఫిబ్రవరి నెలలో 16,224 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 15,887 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే విధంగా ఎగుమతుల విషయానికి వస్తే, 2022 ఫిబ్రవరిలో 23 శాతం తగ్గి 20,459 యూనిట్లకు పడిపోయాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 8, 2022, 9:38 [IST]
English summary
Bajaj pulsar ns 160 launched with black alloy wheels details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+