భారత మార్కెట్లో కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

హంగేరియన్ టూవీలర్ బ్రాండ్ కీవే (Keeway) గడచిన మే 2022 నెలలో భారత మార్కెట్లో వియస్టా 300 (Vieste 300) మరియు సిక్స్టీస్ 300ఐ (Sixties 300i) అనే రెండు స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ (Benelli) యాజమాన్యంలో ఉన్న కీవే తాజాగా భారత మార్కెట్లో తమ కొత్త క్రూయిజర్ బైక్ కీవే కె-లైట్ (Keeway K-Lite) ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ విపణిలో కీవే కె-లైట్ క్రూయిజర్ బైక్ ధరలు రూ.2.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

భారత మార్కెట్లో కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో కొత్త బెనెల్లీ కీవే కె-లైట్ 250 సీసీ క్రూయిజర్ మూడు రంగులలో లభిస్తుంది. వీటిలో మ్యాట్ బ్లూ, మ్యాట్ డార్క్ గ్రే మరియు మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కస్టమర్లు ఎంచుకునే కలర్ ఆప్షన్ ను బట్టి ఈ బైక్ ధరలు ఆధారపడి ఉంటాయి. వాటి వివరాలు ఉన్నాయి:

* కీవే కె-లైట్ 250 మ్యాట్ బ్లూ - రూ. 2.89 లక్షలు

* కీవే కె-లైట్ 250 గ్రే - రూ. 2.99 లక్షలు

* కీవే కె-లైట్ 250 బ్లాక్ - రూ. 3.09 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

భారత మార్కెట్లో కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

డిజైన్ విషయానికి వస్తే, కీవే కె-లైట్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ చూడటానికి మోడిఫైడ్ బజాజ్ అవెంజర్ లేదా హ్యార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ వంటి రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్లకు చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది. కె-లైట్ మినిమలిస్టిక్ డిజైన్‌తో నో-ఫ్రిల్స్ బైక్‌గా కనిపిస్తుంది. గుండ్రటి హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు మరియు టెయిల్ లైట్‌లతో ఇది రెట్రో ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఇది భారత మార్కెట్లో బజాజ్ అవెంజర్ 220 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వంటి క్రూయిజర్ బైక్ లకు పోటీగా నిలుస్తుంది.

భారత మార్కెట్లో కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

కీవే కె-లైట్ 250 క్రూయిజర్ మోటార్‌సైకిల్ యొక్క కొన్ని ముఖ్య లక్షణాలలో దాని రెట్రో-స్టైల్ ఫ్యూయెల్ ట్యాంక్, మెటాలిక్ ఫినిషింగ్‌లో ఉండే సైడ్ ప్యానెళ్లు, అల్లాయ్ వీల్స్, షార్ట్ టెయిల్ సెక్షన్ మరియు రియర్ టైర్ హగ్గర్ మొదలైన వాటిని గమనించవచ్చు. ఇది రంధ్రాలు గల హీట్ షీల్డ్‌తో కూడిన కాంపాక్ట్ ఎగ్జాస్ట్ పైపును కలిగి ఉంటుంది. హంగేరీలో, కీవే కె-లైట్ గ్రే మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. భారతదేశం కూడా కంపెనీ అవే కలర్ ఆప్షన్లను అందిస్తోంది.

భారత మార్కెట్లో కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

బెనెల్లీ కీవే 250 సీసీ క్రూయిజర్ బైక్ ఇటు చిన్నపాటి సిటీ రైడ్‌ లకు మరియు అటు సుదూరమైన క్రూజింగ్ రైడ్ లకు అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది. ఇందులోని పుల్-బ్యాక్, వైడ్ హ్యాండిల్ బార్ మరియు ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌ల కారణంగా రైడింగ్ ఎర్గోనామిక్స్ చాలా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. ఇందులో స్ప్లిట్ సీట్ ఉంటుంది, అయితే, ఇక్కడ పిలియన్ రైడర్ కోసం ఎక్కువ స్థలం కనిపించనప్పటికీ, ఆ సీటు కూడా సౌకర్యవంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పిలియన్ రైడర్ కోసం అందించిన బ్యాక్‌రెస్ట్ కారణంగా వారికి సుదూర ప్రయాణాలలో సౌకర్యంగా ఉంటుంది.

భారత మార్కెట్లో కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

కె-లైట్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో ట్యాంక్-మౌంటెడ్ సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ ఉంటుంది, ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్‌తో సహా అనేక రకాల సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇంకా ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు హైడ్రాలిక్ ట్విన్ సస్పెన్షన్ సెటప్, ఇరు వైపులా డిస్క్ బ్రేకులు, డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్, అన్ని ఎల్ఈడి లైట్లు, ఇంజన్ గార్డ్, డ్యూయల్ ఎగ్జాస్ట్ మరియు షార్ట్ టెయిల్ సెక్షన్ మొదలైనవి ఉన్నాయి.

భారత మార్కెట్లో కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

కీవే కె-లైట్ 250 క్రూయిజర్ మోటార్‌సైకిల్ లో 249 సీసీ వి-ట్విన్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.7 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 19 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ నుంచి వచ్చే శక్తి 5 స్పీడ్ గేర్ యూనిట్ మరియు బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా వెనుక చక్రానికి పంపిణీ చేయబడుతుంది.

భారత మార్కెట్లో కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ఇక కొలతల విషయానికి వస్తే, కె-లైట్ 2230 మిమీ పొడవు, 920 మిమీ వెడల్పు మరియు 1090 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 1530 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీగా ఉంటుంది. కాగా, ఇందులో 20 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఇరువైపులా 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించబడ్డాయి మరియు వాటిపై ముందు వైపున 120/80-R16 సెక్షన్ టైర్ అలాగే వెనుక వైపున 140/70-R16 సెక్షన్ టైర్ అమర్చబడి ఉంటాయి.

భారత మార్కెట్లో కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

హంగేరీకి చెందిన ద్విచక్ర వాహన తయారీదారు కీవే యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా మరియు ఆఫ్రికా దేశాలలో తమ ఉనికిని కలిగి ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం చైనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు అయిన Qianjiang గ్రూప్‌లో భాగంగా ఉంది, ఇదే గ్రూపులు ఇటాలియన్ బైక్ బ్రాండ్ బెనెల్లీ కూడా ఉంది. కీవే భారతదేశంలో ముందుగా తమ రెండు స్కూటర్లను విడుదల చేయడం ద్వారా ఇక్కడ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. - కీవే స్కూటర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Benelli launches keeway k lite 250cc cruiser motorcycle in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X