బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; పూర్తి చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్!

చైనాకు చెందిన ఎలక్ట్రి వెహికల్ కంపెనీ బెన్లింగ్ యొక్క భారతీయ అనుబంధ సంస్థ బెన్లింగ్ ఇండియా (Benling India), దేశీయ విపణిలో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) పేరుతో కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో బెన్లింగ్ బిలీవ్ ఇ-స్కూటర్‌ ధరను రూ. 97,520 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఇదొక లాంగ్ రేంజ్, హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రీమియం ఇ-స్కూటర్ విభాగంలో బెన్లింగ్ ఈ కొత్త బిలీవ్ మోడల్‌ను విడుదల చేసింది.

బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; పూర్తి చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్!

బెన్లింగ్ బిలీవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్ లను కూడా స్వీకరిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగస్టు 25, 2022వ తేదీ నుండి కంపెనీ షోరూమ్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. బెన్లింగ్ బిలీవ్ పసుపు, నీలం, నలుపు, తెలుపు, పర్పుల్, మ్యాజిక్ గ్రే అనే కలర్ ఆప్షన్లలో కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం, బెన్లింగ్ ఇండియా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు మరియు 160 నగరాల్లో అధీకృత డీలర్‌షిప్‌లు ఉన్నాయి. వాటి ద్వారా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయించబడుతుంది.

బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; పూర్తి చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్!

బెన్లింగ్ ఇండియా విడుదల చేసిన ఈ కొత్త బిలీవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓ ప్రత్యేకమైన స్మార్ట్ బ్రేక్‌డౌన్ అసిస్ట్ ఫంక్షన్ (Smart Break Down Assist Function) తో వస్తుంది. ఒకవేళ, బెన్లింగ్ బిలీవ్ స్కూటర్ బ్రేక్‌డౌన్ అయినప్పుడు, రైడర్ ఈ స్కూటర్‌ను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిపించడానికి ఈ ఫీచర్ రైడర్ కు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ యొక్క మరొక హైలైట్ ఏంటంటే, దీని సుధీర్ఘమైన రేంజ్. బెన్లింగ్ బిలీవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జింగ్ పై గరిష్టంగా 120 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

బెన్లింగ్ బిలీవ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీలను ఉపయోగించింది, ఇవి సాధారణ లిథియం-అయాన్ బ్యాటరీల కంటే సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. కంపెనీ ఇందులో స్వాప్ చేయగల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించింది. అంటే, రైడర్ ఈ బ్యాటరీ ప్యాక్ ను స్కూటర్ నుండి బయటకు తీసి ద్వారా ఛార్జ్ చేయవచ్చు. అపార్ట్‌మెంట్‌లు మరియు బయట వైపు చార్జింగ్ సౌకర్యం లేని వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; పూర్తి చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్!

బిలీవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సాంకేతిక విషయాలను గమనిస్తే, ఇందులో 3.2 kW వాటర్‌ప్రూఫ్ BLDC ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయడానికి సహాయపడుతుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.5 సెకండ్లలోనే గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 250 కిలోల బరువును మోయగలదు మరియు డబుల్ లోడింగ్‌లో కూడా దీనిని ఆపరేట్ చేయడం చాలా సులభం.

బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; పూర్తి చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్!

బెన్లింగ్ బిలీవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ 36 నెలలు లేదా 50,000 కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే) వారంటీని కూడా అందిస్తోంది. కాగా, కంపెనీ ఇందులో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం, చార్జింగ్ సమయం వంటి విషయాలను ఇంకా వెల్లడించలేదు, మరికొద్ది వారాల్లోన్నే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే, బెన్లింగ్ బిలీవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కీలెస్ స్టార్ట్, మల్టిపుల్ స్పీడ్ మోడ్‌లు, యాంటీ-థెఫ్ట్ అలారం ఫీచర్, రీజెనరేటివ్ బ్రేకింగ్, మొబైల్-యాప్ కనెక్టివిటీ, పార్క్-అసిస్ట్ ఫంక్షన్, మొబైల్-ఛార్జింగ్ మరియు రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి మరెన్నో అధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి.

బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; పూర్తి చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్!

ఈ సందర్భంగా బెన్లింగ్ ఇండియా సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ, "భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌కు 'బిలీవ్'ని పరిచయం చేయడానికి తాము సంతోషిస్తున్నామని, కస్టమర్‌లు ఇప్పుడు అనేక అధునానత సాంకేతిక ఫీచర్లతో కూడిన సరైన ఇ-స్కూటర్‌ను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారని, సరసమైన ఈవీ మార్కెట్‌లో తమ స్థానాన్ని బలోపేతం చేయడం తమ మొదటి లక్ష్యం అని" అన్నారు.

బెన్లింగ్ ఇండియా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మరో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విక్రయిస్తోంది. వీటిలో బెన్లింగ్ ఆరా (Benling Aura), బెన్లింగ్ ఫాల్కన్ (Benling Falcon), బెన్లింగ్ క్రిటి (Benling Kriti) మరియు బెన్లింగ్ ఐకాన్ (Benling Icon) అనే నాలుగు ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విక్రయిస్తోంది. వీటిలో బెన్లింగ్ ఆరా మరియు బెన్లింగ్ క్రిటి రెండూ కూడా క్లాసిక్ డిజైన్ కలిగి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు కాగా, బెన్లింగ్ ఫాల్కన్ మరియు బెన్లింగ్ ఐకాన్‌లు రెండూ కూడా మోడ్రన్ డిజైన్ కలిగిన యూత్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.

బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; పూర్తి చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్!

బెన్లింగ్ ఆరా ఎలక్ట్రిక్ స్కూటర్ 72V /40AH (Li-Ion) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండి, పూర్తి చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్ (ఎకో మోడ్‌లో) అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లుగా ఉంటుంది. బెన్లింగ్ క్రిటీ రెండు రకాల బ్యాటరీలతో లభిస్తుంది, వీటిలో 48V/20Ah*5 (VRLA), 48V/24Ah*1 (Li-Ion) ఆప్షన్లు ఉన్నాయి. ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, దీని గరిష్ట వేగం గంటకు 25 కిమీగా ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 60 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; పూర్తి చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్!

బెన్లింగ్ ఫాల్కన్ కూడా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు ఇది రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. వీటిలో 60V/20Ah*5 (VRLA), 60V/22Ah*1 (Li-Ion) బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఇది పూర్తి చార్జ్ పై సుమారు 70-75 కిమీ సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది మరియు దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ. ఇదిలా ఉంటే, బెన్లింగ్ ఇండియా ఈ ఏడాది చివరి నాటికి ఓ ఎలక్ట్రిక్ లోడర్‌తో సహా మరో రెండు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయాలని చూస్తోంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Benling believe electric scooter launched in india price range features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X